Sanju Samson: కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్ కాపీ కొట్టబోయిన శాంసన్! చివరికి బాబర్ లా అయ్యాడు..

Sanju Samson copied Virat Kohli trademark shot: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్ ను కాపీ కొట్టబోయిన శాంసన్ కేవలం 5 రన్స్ కే అవుట్ అయ్యి.. మళ్లీ నిరాశ పరిచాడు. దాంతో చివరికి నువ్వు బాబర్ అజంలా తయ్యారు అయ్యావ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Sanju Samson copied Virat Kohli trademark shot: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్ ను కాపీ కొట్టబోయిన శాంసన్ కేవలం 5 రన్స్ కే అవుట్ అయ్యి.. మళ్లీ నిరాశ పరిచాడు. దాంతో చివరికి నువ్వు బాబర్ అజంలా తయ్యారు అయ్యావ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంజూ శాంసన్.. ప్రస్తతం టీమిండియాలో ఉన్న దురదృష్టవంతమైన ప్లేయర్ ఎవరంటే అందరు ఇతడి పేరే చెప్తారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా గానీ.. వాటిని యూజ్ చేసుకోకుండా నిరాశపరుస్తున్నాడు. శాంసన్ కంటే వెనక వచ్చిన ఆటగాళ్లు.. టీమిండియాలో చోటు దక్కించుకుని దూసుకెళ్తున్నారు. కానీ.. ఈ కేరళ ప్లేయర్ మాత్రం పూర్ ఫామ్ తో జట్టులో చోటు కొరకు వేచి చూసే స్థాయికి దిగజారిపోయాడు. ఇక దులీప్ ట్రోఫీలో వచ్చిన ఛాన్స్ ను సైతం చేజేతులా విడిచిపెట్టుకుంటున్నాడు. తాజాగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్ ను కాపీ కొట్టబోయిన శాంసన్ కేవలం 5 రన్స్ కే అవుట్ అయ్యి.. మళ్లీ నిరాశ పరిచాడు. దాంతో చివరికి నువ్వు బాబర్ అజంలా తయ్యారు అయ్యావ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా జరుగుతున్న రెండో రౌండ్ మ్యాచ్ లో ఇండియా-ఏ వర్సెస్ ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి దారుణంగా విఫలం అయ్యాడు. ఇండియా-డి జట్టుకు ఆడుతున్న ఇతడు తొలి ఇన్నింగ్స్ లో అకీబ్ ఖాన్ అనే యంగ్ బౌలర్ కు వికెట్ సమర్పించుకున్నాడు. ఓ ఫోర్ తో మంచి ఊపుమీద ఉన్నట్లు కనిపించిన శాంసన్.. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించాలని ప్రయత్నించి కేవలం 5 రన్స్ కే ఔట్ అయ్యాడు. అయితే అతడు అవుట్ అయిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ షాట్ ను కాపీ కొట్టబోయి పెవిలియన్ చేరాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ.. టీ20 వరల్డ్  కప్ 2022లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో హరీస్ రౌఫ్ బౌలింగ్ లో కొట్టిన సిక్స్ ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఆ సిక్స్ ను షాట్ ఆఫ్ ది సెంచరీ గా ఐసీసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అచ్చం అలాగే సంజూ శాంసన్ కూడా షాట్ కొట్టాలని ప్రయత్నించాడు. కానీ అదికాస్త డిస్ కనెక్ట్ అయ్యి ప్రసిద్ధ్ కృష్ణ చేతిలో బంతి పడింది. ఇంకేముందు సంజూ మరోసారి తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరాడు. అయితే.. విరాట్ కోహ్లీ షాట్ ను కాపీ కొట్టాలని చూసిన శాంసన్ చివరికి బాబర్ అజాంలా తయ్యారు అయ్యాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. బాబర్ చాలా సమయాల్లో కోహ్లీతో పోల్చుకుంటూ.. కొన్ని కొన్ని షాట్స్ అతడిలా కొట్టాలని ట్రై చేస్తుంటాడు. కానీ అవి బిస్కెట్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు సంజూ శాంసన్ కూడా అలాగే చేశాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్. మరి సంజూ నిజంగానే కోహ్లీ షాట్ కాపీ కొట్టాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments