SNP
Sri Lankan New Head Coach: కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఆస్ట్రేలియాలా ఒక వెలుగు వెలిగిన శ్రీలంక ఇప్పుడు పసికూనలా మారింది. అలాంటి లంక తలరాత మార్చేందుకు ఓ దూత వస్తున్నాడు. అతను ఇండియాతోనే అతని వేట మొదలుపెట్టనున్నాడు. మరి అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..
Sri Lankan New Head Coach: కొన్నేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో మరో ఆస్ట్రేలియాలా ఒక వెలుగు వెలిగిన శ్రీలంక ఇప్పుడు పసికూనలా మారింది. అలాంటి లంక తలరాత మార్చేందుకు ఓ దూత వస్తున్నాడు. అతను ఇండియాతోనే అతని వేట మొదలుపెట్టనున్నాడు. మరి అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..
SNP
అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే పసికూన అనే ట్యాగ్‌ను చెరిపేసుకుని.. పెద్ద టీమ్స్‌కు పోటీ ఇస్తూ.. ఛాంపియన్ టీమ్‌లా ఎదిగిన జట్టు శ్రీలంక. చాలా తక్కువ టైమ్‌లోనే పెద్ద టీమ్స్‌లో ఒకటిగా మారిపోయింది. 2000 నుంచి 2015 వరకు శ్రీలంక అంటే మరో ఆస్ట్రేలియా అనేలా ఆడేది. 2011 వన్డే వరల్డ్ కప్‌లో మనతో పాటు ఫైనల్‌లో పోటీ పడింది. ఒక సారి వన్డే వరల్డ్ కప్, ఒకసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక.. కొన్నేళ్లుగా పసికూన జట్టులా మారిపోయింది. అర్జున రణతుంగా, ఆటపట్టు, ముత్తయ్య మురళీ ధరణ్, సనత్ జయసూర్య తర్వాత.. కుమార సంగాక్కర, మహేళ జయవర్దనే, లసిత్ మలింగా ఉన్నంత కాలం ఆ జట్టు బాగానే ఉంది.
వాళ్లు రిటైర్ అయిపోయిన తర్వాత.. ఒక్కసారిగా లంక బలహీన పడింది. టీ20 వరల్డ్ కప్ కోసం క్వాలిఫైయర్స్ ఆడేంత దీన స్థితికి దిగజారిపోయింది లంక. తాజాగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా కనీసం గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్న శ్రీలంకకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆ దేశ దిగ్గజ మాజీ క్రికెటర్ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. శ్రీలంక హెడ్ కోచ్‌గా లెజెండరీ క్రికెటర్ సనత్ జయసూర్య బాధ్యతలు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 27 నుంచి ఇండియాతో శ్రీలంక ఆడబోయే 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌తోనే జయసూర్య హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.
అదే జరిగితే.. శ్రీలంక తలరాత మారుతుందని చాలా మంది క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఆటగాడిగా శ్రీలంకను ఓ రేంజ్‌లో నిలబెట్టిన జయసూర్య ఇప్పుడు హెడ్ కోచ్‌గా కూడా లంకకు పూర్వవైభవం తెస్తాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. క్రికెట్ అభిమానులకు జయసూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విధ్వంసకర ఆటతీరుకు అతను మారుపేరు. ఇప్పుడు టీ20ల్లో ఆడుతున్న దూకుడైన ఆటను అతను ఎప్పుడో వన్డే, టెస్టుల్లోనే ఆడేశాడు. సచిన్‌కు పోటీ ఇస్తూ టన్నుల కొద్ది పరుగులు చేశాడు. ఐపీఎల్ సచిన్‌తో కలిసి ముంబై ఇండియన్స్ ఓపెనర్‌గా కూడా ఆడాడు.
తన కెరీర్‌లో 110 టెస్టులు ఆడిన జయసూర్య 6973 పరుగులు చేశాడు. 445 వన్డేలు ఆడి.. 13430 రన్స్ చేశాడు. 31 టీ20ల్లో 629 రన్స్ ఉన్నాయి. అలాగే టెస్టుల్లో 98 వికెట్లు, వన్డేల్లో 323 వికెట్లు, టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టిన ఘనత అతనిది. చాలా మంది జయసూర్య అంటే ఓపెనర్ బ్యాటర్ అంటారు కానీ.. నిజానికి అతనో నిఖార్సయిన ఆల్‌రౌండర్. ఇప్పుడు అతని అనుభవం శ్రీలంకకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి జయసూర్య అయినా లంక తలరాతను మార్చి.. పాత శ్రీలంకను మరోసారి ప్రపంచానికి పరిచయం చేస్తాడో లేదో చూడాలి.
Sanath Jayasuriya is likely to be the head coach of the Sri Lankan team for the India series. [AFP] pic.twitter.com/IdFTUIcxi0
— Johns. (@CricCrazyJohns) July 8, 2024