Nidhan
IND vs BAN, Rohit Sharma, Gautam Gambhir: బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
IND vs BAN, Rohit Sharma, Gautam Gambhir: బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో బోణీ కొట్టాలని చూస్తోంది. అందుకోసం కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగానే ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Nidhan
బంగ్లాదేశ్‌తో ఫస్ట్ టెస్ట్‌కు సిద్ధమవుతోంది టీమిండియా. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌లో ముందడుగు వేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ స్టేడియానికి ఇప్పటికే చేరుకున్న భారత జట్టు ఆటగాళ్లు మొదటి రోజు ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా చెమటోడ్చారు. రెండో రోజు కూడా అంతే తీవ్రతతో సాధన చేశారు. చాన్నాళ్లు గ్యాప్ రావడంతో ప్రతి ప్లేయర్ గంటల కొద్దీ నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపారు. తొలి టెస్ట్‌లో బంగ్లా బెండు తీయాలని చూస్తున్న మెన్ ఇన్ బ్లూ.. అందుకు తగ్గట్లే గట్టి ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ అయితే స్వదేశంలో టెస్టుల్లో ఏ కెప్టెన్ కూడా చేయని సాహసానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అతడి రిస్క్ వర్కౌట్ అయితే మాత్రం బంగ్లాకు దబిడిదిబిడేనని అంటున్నారు. అసలు రోహిత్ ప్లాన్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఫస్ట్ టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ పిచ్‌ను పూర్తి పేస్ వికెట్‌గా తయారు చేయిస్తున్నాడట రోహిత్. కోచ్ గౌతం గంభీర్‌తో కలసి సమాలోచనలు చేశాకే ఈ నిర్ణయానికి వచ్చాడని వినికిడి. సాధారణంగా ఇక్కడ కనిపించే బ్లాక్ సాయిల్ వికెట్‌కు బదులు రెడ్ సాయిల్ వికెట్‌ను రెడీ చేయిస్తున్నారట. ఈ విషయం బయట పడకుండా ఉండేందుకు మీడియా సహా ఎవర్నీ పిచ్ దగ్గరకు రానివ్వడం లేదట. పేస్‌తో బంగ్లా బెండు తీయాలని రోహిత్-గంభీర్ స్కెచ్ వేశారట. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా సహా మరో ముగ్గురు స్పీడ్స్టర్స్ను తుదిజట్టులోకి తీసుకోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగానే దులీప్ ట్రోఫీలోనూ పేస్ ఫ్రెండ్లీ వికెట్ల మీద భారత స్టార్లను ఆడించారని సమాచారం.
తొలి టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న చెపాక్ పిచ్ నార్మల్‌గా స్పిన్‌కు అనుకూలిస్తుంది. మన దేశంలోని మంచి టర్నింగ్ ట్రాక్స్‌లో ఇదొకటి. బౌలర్లకు స్వర్గధామం లాంటి ఈ పిచ్ మీద నిలబడి పరుగులు చేయాలంటే టాప్ బ్యాటర్స్ కూడా జడుసుకుంటారు. సుడులు తిరిగే బంతులను అడ్డుకొని వికెట్ కాపాడుకోవడమే గొప్ప.. అలాంటిది పరుగులు చేయాలంటే ఎంతో ఓపిక, డిఫెన్స్ టెక్నిక్ అవసరం ఉంటుంది. దీంతో బంగ్లాతో మ్యాచ్‌లో స్పిన్నర్లు పండుగ చేసుకోవడం ఖాయమని అంతా అనుకున్నారు. ఈ మధ్య భారత బ్యాటర్లు స్పిన్ ఆడటంలో ఇబ్బంది పడుతుండటంతో వాళ్లను ఇదే అస్త్రంతో కొట్టాలని బంగ్లాదేశ్ భావిస్తోంది. దీన్ని పసిగట్టిన రోహిత్-గంభీర్ అనూహ్యంగా పిచ్‌ను మార్చాలని డిసైడ్ అయ్యారని సమాచారం.
పేస్ వెపన్తో అపోజిషన్ టీమ్‌కు షాక్ ఇవ్వాలని రోహిత్-గౌతీ అనుకుంటున్నారట. అయితే ఇది బెడిసికొడితే మొదటికే మోసం వచ్చే ఛాన్స్ ఉంది. రోహిత్ చేస్తున్న రిస్క్‌లో సక్సెస్‌తో పాటు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా పొంచి ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అయితే ఏదైనా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే హిట్‌మ్యాన్.. ఈ విషయంలోనూ మేధోమథనం చేసే ఉంటాడు. బంగ్లాను ఇక్కడ పేస్ అస్త్రంతో కొట్టి.. దీని రిజల్ట్‌ను బట్టి నెక్స్ట్ టెస్ట్‌లో ఎలా వెళ్లాలో చూస్తున్నట్లు కనిపిస్తోంది. బంగ్లాను బురిడీ కొట్టించడంలో అతడు ఎంత వరకు విజయవంతం అవుతాడో చూడాలి. మరి.. బంగ్లాను చిత్తు చేసేందుకు ఏ పిచ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.