Nidhan
Rohit Sharma, KL Rahul, Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందే దీన్ని అతడు పరిష్కరించాలి. హిట్‌మ్యాన్ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.
Rohit Sharma, KL Rahul, Sarfaraz Khan: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందే దీన్ని అతడు పరిష్కరించాలి. హిట్‌మ్యాన్ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.
Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్ని వారాలు రెస్ట్ తీసుకున్నాడు. నేషనల్ డ్యూటీ లేకపోవడంతో ఫ్యామిలీతో కలసి టైమ్ స్పెండ్ చేశాడు. అయితే బంగ్లాదేశ్ సిరీస్‌కు సమయం దగ్గర పడుతుండటంతో హిట్‌మ్యాన్ తన ప్లానింగ్ మొదలుపెట్టేశాడు. ఫిట్నెస్ ఇంప్రూవ్ చేసుకునేందుకు ఈ టైమ్‌ను బాగా యూజ్ చేసుకున్నాడు. బంగ్లా సిరీస్ 19వ తేదీ నుంచి మొదలవనుంది. కానీ భారత జట్టు 12వ తేదీ నుంచి ప్రాక్టీస్‌లో మునిగిపోనుంది. బంగ్లాను లైట్ తీసుకోవడం లేదు హిట్‌మ్యాన్. అందుకే గట్టి టీమ్ కావాలని పట్టుబట్టి సెలెక్ట్ చేయించాడు. నెట్ సెషన్స్ కూడా ముందే మొదలయ్యేలా ప్లాన్ చేశాడు. ఓవరాక్షన్ చేసే బంగ్లాను చిత్తు చిత్తుగా ఓడించేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నాడు. ఈ తరుణంలో అతడికి ఓ కొత్త తలనొప్పి మొదలైంది.
బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు జట్టు అన్ని విధాలుగా ప్రిపేర్డ్‌గా ఉండేలా చూసుకుంటున్నాడు రోహిత్. అందుకోసం కోచ్ గౌతం గంభీర్‌తో కలసి తగిన ప్లానింగ్ చేస్తున్నాడు. ఇటీవల పాకిస్థాన్‌ను పాకిస్థాన్‌లో వైట్‌వాష్ చేసింది బంగ్లా. అందుకే ఆ టీమ్‌ను లైట్ తీసుకోకుండా, చిన్న పామును పెద్ద కర్రతో కొట్టాలనే ఆలోచనతో దూకుడుగా వెళ్తున్నాడు రోహిత్. రెస్ట్ మోడ్‌లో ఉన్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను కూడా ఈ సిరీస్‌లో దింపుతున్నాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్.. ఇలా అన్ని విభాగాలు పటిష్టంగా ఉండేలా చూసుకుంటున్నాడు. అంతా బాగానే ఉన్నా కేఎల్ రాహుల్ విషయంలో హిట్‌మ్యాన్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. బంగ్లాతో సిరీస్‌లో రాహుల్‌ను టీమ్‌లోకి తీసుకోవాలా? లేదా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను ఆడించాలా? అనేది అర్థం కాకుండా ఉంది.
బంగ్లాతో సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో దాదాపుగా అన్ని ప్లేసెస్ ఫిక్స్ అయిపోయాయి. అయితే మిడిలార్డర్లో ఓ స్పాట్ కోసం రాహుల్-సర్ఫరాజ్ మధ్య పోటీ నెలకొంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో నుంచి రాహుల్ తప్పుకోవడంతో అతడి ప్లేస్‌లో సర్ఫరాజ్‌ను ఆడించారు. డొమెస్టిక్ క్రికెట్లో దుమ్మురేపి కసి మీద ఉన్న అతడు ఇంగ్లండ్ సిరీస్‌లో 3 టెస్టుల్లో 200 పరుగులతో సత్తా చాటాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమ్ కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు దిగి మంచి ఇన్నింగ్స్‌లతో తన బ్యాటింగ్ రేంజ్ ఏంటో అతడు ప్రూవ్ చేశాడు. అటు టెస్ట్ టీమ్‌లోకి కమ్‌బ్యాక్ ఇచ్చిన రాహుల్ దులీప్ ట్రోఫీ ఓపెనింగ్ మ్యాచ్‌లో రెండు మంచి నాక్స్ ఆడాడు. క్లిష్ట సమయంలో ఒక హాఫ్ సెంచరీ బాది తనలో పస ఇంకా తగ్గలేదని నిరూపించాడు.
అటు సర్ఫరాజ్, ఇటు రాహుల్ ఇద్దరూ మంచి ఫామ్‌లో ఉండటం.. కష్ట సమయాల్లో టీమ్‌ను ఆదుకునే ఇన్నింగ్స్‌లు ఆడటంలో ఎక్స్పర్ట్స్ కావడంతో ఉన్న ఒక్క స్పాట్ కోసం ఎవర్ని తీసుకోవాలో రోహిత్‌కు అర్థం కావడం లేదు. 50 టెస్టులు ఆడిన రాహుల్‌ను తీసుకోకపోతే విమర్శలు తప్పవు. బాగా ఆడుతున్న సర్ఫరాజ్‌కు చోటు ఇవ్వకపోయినా కష్టంగానే ఉంది. అందుకే ఏం చేయాలో హిట్‌మ్యాన్‌కు పాలుపోవడం లేదు. పోనీ ఇద్దర్నీ తీసుకుందామంటే శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్‌లో ఎవర్నీ పక్కకు జరిపేందుకు ఛాన్స్ లేదు. ఈ నేపథ్యంలో బంగ్లాతో ఫస్ట్ టెస్ట్‌లో టీమ్ కాంబినేషన్ విషయంలో డైలమా ఏర్పడింది. దీన్ని రోహిత్, కోచ్ గంభీర్ ఎలా పరిష్కరిస్తారో చూడాలి. మరి.. సర్ఫరాజ్-రాహుల్‌లో ఎవర్ని ఆడిస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.