నా స్కిల్స్‌పై నాకంటే అతనికే ఎక్కువ నమ్మకం: కుల్దీప్‌ యాదవ్‌

Kuldeep Yadav, Rohit Sharma: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ విజయం స్పందిస్తూ.. ఓ స్టార్‌ క్రికెటర్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Kuldeep Yadav, Rohit Sharma: టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ టీ20 వరల్డ్‌ కప్‌ విజయం స్పందిస్తూ.. ఓ స్టార్‌ క్రికెటర్‌ గురించి ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

అతన స్పిన్‌ మాయాజాలం ముందు హేమాహేమీ బౌలర్లు కూడా తలొంచాల్సిందే. పిచ్‌ నుంచి టర్న్‌ లభిస్తే.. ఒక్కడే మ్యాచ్‌ను తీసుకొచ్చి చేతుల్లో పెట్టేస్తాడు. అతని మణికట్టు నుంచి గిర్రున తిరుగుతూ వచ్చే బంతులు ఆడేందుకు వణికిపోయే బ్యాటర్లు చాలా మందే ఉన్నారు. క్రికెట్‌ ప్రపంచం అతన్ని చైనామెన్‌ బౌలర్‌ అని పిలుస్తోంది. టీమిండియాకు దొరికిన ఒక ఆణిముత్యం లాంటి బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌. టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి కీలక ప్లేయర్‌గా, మ్యాచ్‌ విన్నింగ్‌ బౌలర్‌గా మారిపోయాడు. తాజాగా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయంలో భాగమై.. దేశానికి రెండో పొట్టి ప్రపంచ కప్‌ను అందించాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో తొలి మూడు మ్యాచ్‌లు ఆడే అవకాశం కుల్దీప్‌ యాదవ్‌కు రాలేదు.. కానీ, ఒక్కసారి సూపర్‌ 8 స్టేజ్‌కు చేరిన తర్వాత ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి వచ్చిన కుల్దీప్‌.. టీమిండియాను మరింత స్ట్రాంగ్‌ చేశాడు. ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి.. టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. తాజాగా టీ20 వరల్డ్‌ కప్‌ విజయంపై మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మ గురించి ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు కుల్దీప్‌. ఈ వరల్డ్‌ కప్‌ అతని కోసమే అంటూ పేర్కొన్నాడు.

కుల్దీప్‌ మాట్లాడుతూ..‘నా కష్టకాలంలో రోహిత్‌ శర్మ చాలా మద్దతుగా నిలిచాడు. రోహిత్‌ అన్న అంటే నాకు చాలా ఇష్టం. నాలో ఉన్న స్కిల్‌ను నాకంటే అతనే ఎక్కువ నమ్మేవాడు. ఈ వరల్డ్‌ కప్‌ అతని కోసం గెలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే విరాట్‌ అన్న తన చివరి టీ20 మ్యాచ్‌లో 70కి పైగా మ్యాచ్‌ విన్నింగ్‌ నాక్‌ ఆడి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోవడం హ్యాపీగా ఉంది.’ అని కుల్దీప్‌ పేర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్‌ రోహిత్‌ శర్మ మధ్య చాలా మ్యాచ్‌ల్లో ఆసక్తికర చర్చలు నడిచేవి. నేను చెప్పినట్లే చేస్తే చాలాని రోహిత్‌, లేదు ఇంకోలా చేద్దామని కుల్దీప్‌ చేసుకునే చర్చలు క్రికెట్‌ అభిమానులను అలరిస్తాయి. ఆ విషయాలు వాళ్లిద్దరూ తెలిపారు. మరి తన విషయంలో రోహిత్‌ అందించిన సపోర్ట్‌పై కుల్దీప్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments