Nidhan
Rohit Sharma, Ganesh Chaturthi 2024, T20 World Cup 2024: వినాయక చవితి సందడి మొదలైంది. పండక్కి ఇంకా ఒక్క రోజే ఉండటంతో గణేశ్ ప్రతిమలను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఈ తరుణంలో ఓ గణనాథుడి విగ్రహం ఇప్పుడు వైరల్‌గా మారింది. వరల్డ్ కప్ వినాయకుడ్ని చూసి అంతా షాక్ అవుతున్నారు.
Rohit Sharma, Ganesh Chaturthi 2024, T20 World Cup 2024: వినాయక చవితి సందడి మొదలైంది. పండక్కి ఇంకా ఒక్క రోజే ఉండటంతో గణేశ్ ప్రతిమలను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఈ తరుణంలో ఓ గణనాథుడి విగ్రహం ఇప్పుడు వైరల్‌గా మారింది. వరల్డ్ కప్ వినాయకుడ్ని చూసి అంతా షాక్ అవుతున్నారు.
Nidhan
రోహిత్ శర్మ.. ఈ టీమిండియా కెప్టెన్ 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్‌ను దేశానికి అందించాడు. యూఎస్ఏ-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిత్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్-2024లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి టాప్ టీమ్స్‌ను పడగొట్టి కప్పును సొంత దేశానికి తీసుకొచ్చాడు. ఆ క్షణాలు ఇంకా అభిమానుల కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి. ట్రోఫీతో భారత ఆటగాళ్లు స్వదేశానికి రావడం, విక్టరీ పరేడ్ నిర్వహించడం, వాంఖడేలో ఫ్యాన్స్‌తో కలసి దేశభక్తి గీతాలు పాడుతూ సెలబ్రేట్ చేసుకోవడం లైఫ్ టైమ్ మెమరీస్‌గా ఉండిపోయాయి. అయితే మెగాటోర్నీ ముగిసి రెండు నెలలు అవుతున్నా సెలబ్రేషన్స్ ఇంకా ముగియలేదు. క్రికెట్‌ను ఓ మతంలా భావించే ఇక్కడి ఫ్యాన్స్ మరోమారు టీమిండియాపై, కెప్టెన్ రోహిత్ శర్మపై తమకు ఉన్న అభిమానం, ప్రేమను చూపించారు.
వరల్డ్ కప్ సెలబ్రేషన్స్‌ను వినాయక చవితి ఉత్సవాల్లోనూ కంటిన్యూ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో నిర్వహించిన విక్టరీ పరేడ్‌ను రీక్రియేట్ చేశారు. అయితే ఈసారి విజయోత్సవ వేడుకల్లో వినాయకుడ్ని చేర్చడం హైలైట్‌గా మారింది. వినాయక చవితి నేపథ్యంలో స్పెషల్ వరల్డ్ కప్ వినాయకుడి ప్రతిమను తయారు చేయించారు రోహిత్ ఫ్యాన్స్. ఇందులో బొజ్జ గణపతి చేతిలో టీమిండియా గెలిచిన టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ ఉంది. వినాయకుడి మెడలో జాతీయ జెండా కూడా ఉంది. గణపయ్య పక్కనే కెప్టెన్ రోహిత్ కటౌట్ కూడా ఉంది. హిట్‌మ్యాన్‌కు వినాయకుడు ప్రపంచ కప్ ట్రోఫీని అందిస్తున్నట్లుగా ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. ఈ స్పెషల్ విగ్రహాన్ని రోహిత్ ఫ్యాన్స్ మండపంలో ప్రతిష్టించడానికి తీసుకెళ్తున్న వీడియోలు, ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
వరల్డ్ కప్ వినాయకుడ్ని చూసిన నెటిజన్స్.. ఈసారి పండక్కి ఇదే స్పెషల్ అని అంటున్నారు. దేశానికి వరల్డ్ కప్ అందించి, అందర్నీ గర్వించేలా చేసిన రోహిత్‌కు గౌరవంగా ఇలా విగ్రహాన్ని రూపొందించారని అంటున్నారు. హిట్‌మ్యాన్ ఫ్యాన్సా, మజాకానా అని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. రోహిత్ మీద వాళ్లు ప్రేమ చూపించిన తీరు సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఈసారి వినాయక చవితికి ఇలాంటి ప్రతిమలు మరిన్ని కొలువుదీరడం ఖాయమని నెటిజన్స్ అంటున్నారు. దేశానికి వరల్డ్ కప్ తీసుకొచ్చిన హిట్‌మ్యాన్‌ను ఇలా గౌరవించుకోవడం మంచి విషయమని ప్రశంసిస్తున్నారు. ఇక, బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు భారీ గ్యాప్ దొరకడంతో ఇంటి వద్దే రెస్ట్ తీసుకుంటున్నాడు హిట్‌మ్యాన్. అప్పుడప్పుడు పలు ఫంక్షన్స్‌కు అటెండ్ అవుతున్నాడు. అయితే ఈ గ్యాప్‌లో క్రికెట్‌ను వదలకుండా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే ఫిట్నెస్ మీద కూడా ఫోకస్ పెట్టాడు. రీసెంట్గా బయటకు వచ్చిన ఫొటోల్లో పొట్ట తగ్గి ఫుల్ ఫిట్‌గా కనిపిస్తున్నాడు రోహిత్. దీంతో అతడు ఫీల్డింగ్, వికెట్ల మధ్య రన్నింగ్‌లో మరింత దూకుడు చూపిస్తాడని అభిమానులు అంటున్నారు. ఇక ప్రత్యర్థులకు దబిడిదిబిడేనని చెబుతున్నారు. హిట్‌మ్యాన్‌ను ఆపడం ఎవరి వల్లా కాదంటున్నారు.
The iconic Ganpati Bappa welcome🫡”Ganpati Bappa giving world cup trophy to Captain Rohit Sharma”🥹🇮🇳
Thank you Captain for giving this much happiness to everyone @ImRo45 🐐🇮🇳👏 pic.twitter.com/tSXvGaZFgM
— Out Ashok (@out_ashok) September 5, 2024