టీ20 వరల్డ్‌ కప్‌కి ముందు రోహిత్‌-పాండ్యా మాట్లాడుకోలేదు! సంచలన విషయం వెలుగులోకి..

Rohit Sharma, Hardik Pandya, T20 World Cup 2024: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా మధ్య టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు మాటలు లేవనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, Hardik Pandya, T20 World Cup 2024: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా మధ్య టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు మాటలు లేవనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అద్భుత ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 2007 తర్వాత.. మరోసారి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచింది భారత జట్టు. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో పొట్టి ప్రపంచ కప్‌తో విశ్వవిజేతగా ఆవిర్భవించింది. అయితే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు.. టీమిండియాలో ఒకరకమైన ఆందోళన కరమైన వాతావరణం ఉంది. ఎందుకంటే.. టీమిండియా రోహిత్‌ శర్మ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో.. టీ20 వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టీ20 టోర్నీలో భారత జట్టు ఎలా ఆడుతుందో అని అభిమానులంతా కంగారు పడ్డారు.

ఐపీఎల్‌ 2024 సందర్భంగా రోహిత్‌ శర్మ స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ నియమించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో రోహిత్‌, పాండ్యా మధ్య గ్యాప్‌ వచ్చిందని, ఇద్దరి మధ్య విభేదాలు కూడా తలెత్తాయని కూడా వార్తలు వచ్చాయి. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత.. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం భారత జట్టు అమెరికా వెళ్లింది. పాకిస్థాన్‌తో న్యూయార్క్‌ వేదికగా తొలి మ్యాచ్‌కి ముందు జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో రోహిత్‌ శర్మ, హార్ధిక్‌ పాండ్యా కూడా పాల్గొన్నారు. కానీ, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. కనీసం ఎదురుపడినా మాట్లాడుకోలేదు. ఎడ మొహ​ం పెడ మొహంగా ఉన్నారు.

ఈ విషయాన్ని ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ విమల్‌ కుమార్‌ వెల్లడించారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను కవర్ చేయడానికి అమెరికాకు వెళ్లిన విమల్‌.. టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌లో ఈ విషయం గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. ఇలా అయితే టీమిండియా ఎలా ఆడుతుందోనని ఆయన కంగారు పడ్డారు. కానీ, నెక్ట్స్‌డే రోహిత్‌ శర్మ, పాండ్యా పక్కన కూర్చోని చాలా సేపు మాట్లాడుకున్నారంటా.. అప్పుడు ఎలాంటి కెమెరాలు ఏమీ లేవు, కానీ టీమ్‌ కోసం గొడవలు, ఈగోలు పక్కనపెట్టి ఇద్దరు ఆటగాళ్లు చాలా సేపు చర్చలు జరిపారు.. ఆ తర్వాత టీమిండియా జైత్రయాత్ర గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments