వీడియో: తండ్రి చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ అందుకున్న యువ క్రికెటర్‌!

Team India, IND vs ZIM, Riyan Parag: టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తూ.. ఎమోషనల్‌ మూమెంట్స్‌లో గడిపిన ఓ క్రికెటర్‌ తన తండ్రి చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ అందుకుని మరింత ఆనందాన్ని పొందాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Team India, IND vs ZIM, Riyan Parag: టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తూ.. ఎమోషనల్‌ మూమెంట్స్‌లో గడిపిన ఓ క్రికెటర్‌ తన తండ్రి చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ అందుకుని మరింత ఆనందాన్ని పొందాడు. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకొని, భారీ కాంపిటీషన్‌ను తట్టుకుని, అంచెలంచెలుగా ఎదిగి జాతీయ జట్టుకు ఎంపికై, దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. పైగా క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో టీమిండియా తరఫున ఆడటం అంటే ఎంతో సాధించినట్లు లెక్క. అయితే.. జాతీయ జట్టుకు ఎంపికై.. తొలిసారి ఆ జెర్సీని ధరించేందుకు సిద్ధం అయ్యే ఆటగాడికి క్యాప్‌ను ప్రత్యేకంగా అందించడం ఆనవాయితీ. అలా టీమిండియా క్యాప్‌ అందుకుంటూ ఎమోషనల్‌ అవ్వని క్రికెటర్‌ లేడు. ఆ మధుర క్షణాలను తాజాగా ఓ ఇద్దరు యువ క్రికెటర్లు అనుభవించారు.

అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌.. ఈ రోజు(శనివారం) అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే.. టీమ్‌ మీటింగ్‌ తర్వాత.. అభిషేక్‌ శర్మకు, రియాన్‌ పరాగ్‌కు టీమిండియా క్యాప్‌ను అందుజేశారు. సాధారణంగా ఆ క్యాప్‌ను కెప్టెన్‌, కోచ్‌, సీనియర్‌ ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు ఇలా ఎవరో ఒకరు అందిస్తూ ఉంటారు. కానీ, రియాన్‌ పరాగ్‌ మాత్రం తన తండ్రి చేతుల మీదుగా టీమిండియా క్యాప్‌ను అందుకున్నాడు. ఇది అతని జీవితంలో చాలా ఎమోషనల్‌ మూమెంట్‌.

తన తల్లిదండ్రుల చేతుల మీదుగా క్యాప్‌ అందుకోవాలని అనుకుంటున్నట్లు రియాన్‌ పరాగ్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ను కోరడంతో.. అతని కోరిక మేరకు రియాన్‌ తండ్రి అతనికి కుమారుడికి టీమిండియా క్యాప్‌ను అందించారు. ఈ సమయంలో రియాన్‌ తల్లి కూడా అక్కడే ఉన్నారు. టీమిండియా క్యాప్‌ అందుకున్న తన కొడుకుని ఆమె ఆప్యాయంగా ముద్దాడారు. గత కొన్నేళ్లుగా దేశవాళి క్రికెట్‌లో పాటు ఐపీఎల్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న రియాన్‌ పరాగ్‌ను జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపిక చేశారు భారత సెలెక్టర్లు. మరి తండ్రి చేతుల మీదుగా పరాగ్‌ క్యాప్‌ అందుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట రూపంలో తెలియజేయండి.

Show comments