టీమిండియాలోకి IPL హీరోలు! ఆ సిరీస్ తో జట్టులోకి ఎంట్రీ..

టీమిండియాలోకి IPL హీరోలు! ఆ సిరీస్ తో జట్టులోకి ఎంట్రీ..

ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపిన టీమిండియా యంగ్ ప్లేయర్లు త్వరలోనే టీమిండియాలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత జరిగే సిరీస్ లతో ఈ ఐపీఎల్ హీరోలు అరంగేట్రం చేయనున్నారు. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే?

ఐపీఎల్ 2024 సీజన్ లో దుమ్మురేపిన టీమిండియా యంగ్ ప్లేయర్లు త్వరలోనే టీమిండియాలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్ కప్ తర్వాత జరిగే సిరీస్ లతో ఈ ఐపీఎల్ హీరోలు అరంగేట్రం చేయనున్నారు. ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే?

ప్రస్తుతం టీమిండియా టీ20 వరల్డ్ కప్ తో బిజీగా ఉంది. ఇక ఈ మెగాటోర్నీ ముగిసిన తర్వాత వెంటనే జింబాబ్వే తో టీ20 సిరీస్, శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్ లతో టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఐపీఎల్ 2024 హీరోలు. వీరితో పాటుగా పలు కారణాలతో జట్టుకు దూరంగా ఉన్న ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి జట్టులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్న ఆ ఐపీఎల్ హీరోలు ఎవరు? చూద్దాం పదండి.

టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత టీమిండియా జింబాబ్వేతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. అలాగే శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ కూడా ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత సీజన్ ఐపీఎల్ హీరోలు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. లంకతో జరిగే సిరీస్ కు సీనియర్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ టీమ్ లోకి రీ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. ఇక జూలై 6 నుంచి జింబాబ్వేతో జరగబోయే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ఐపీఎల్ 2024లో మెరుపులు మెరిపించిన యంగ్ హీరోలు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

వారిలో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, యశ్ దయాల్, నితీశ్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్ వైశాఖ్ లతో పాటుగా పంజాబ్ కింగ్స్ నయా సెన్సేషన్ సుశాంత్ సింగ్ కూడా తుది జట్టులో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం. జింబాబ్వే సిరీస్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. యంగ్ ప్లేయర్లను పరీక్షించాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. వీరితో పాటుగా టీ20 వరల్డ్ కప్ కు ట్రావెల్ రిజర్వ్ గా ఎంపికైన శుబ్ మన్ గిల్, రింకూ సింగ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లు కూడా ఎంపిక కానున్నారు. కాగా.. జింబాబ్వే పర్యటనకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా, సూర్య కుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా ఎంపిక అవుతారని సమాచారం. ఇక ఈ సిరీస్ కోసం వచ్చే వారంలో జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. చూడాలి మరి ఎందరు ఐపీఎల్ హీరోలు టీమిండియాలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారో.

Show comments