రోహిత్ చెప్పిన ఆ ఒక్క మాటతో నా బాధంతా పోయింది.. రింకూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rinku Singh Discloses Rohit Sharma's Advice: టీమిండియా యంగ్ క్రికెటర్స్​లో ప్రామిసింగ్ ప్లేయర్​గా రింకూ సింగ్​ను చెప్పొచ్చు. తనకు అప్పగించిన రోల్​ను నిర్వర్తించడానికి అతడు ఎంత ఎఫర్ట్ పెట్టేందుకైనా రెడీగా ఉంటాడు. అలాంటోడు తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Rinku Singh Discloses Rohit Sharma's Advice: టీమిండియా యంగ్ క్రికెటర్స్​లో ప్రామిసింగ్ ప్లేయర్​గా రింకూ సింగ్​ను చెప్పొచ్చు. తనకు అప్పగించిన రోల్​ను నిర్వర్తించడానికి అతడు ఎంత ఎఫర్ట్ పెట్టేందుకైనా రెడీగా ఉంటాడు. అలాంటోడు తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా యంగ్ క్రికెటర్స్​లో ప్రామిసింగ్ ప్లేయర్​గా రింకూ సింగ్​ను చెప్పొచ్చు. తనకు అప్పగించిన రోల్​ను నిర్వర్తించడానికి అతడు ఎంత ఎఫర్ట్ పెట్టేందుకైనా రెడీగా ఉంటాడు. ఐపీఎల్​ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ప్లేయర్ క్యాష్ రిచ్ లీగ్​లో దుమ్మురేపి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా తరఫున వచ్చిన ప్రతి ఛాన్స్​ను సద్వినియోగం చేసుకొని లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్​లో టీమ్​లో కీలక ప్లేయర్​గా ఎదిగాడు. ముఖ్యంగా గత కొంత కాలంగా టీ20ల్లో ఫినిషర్​గా అతడు ఆడిన విధానం, ​జట్టును ఒంటిచేత్తో గెలిపించిన తీరు చూసి పొట్టి ప్రపంచ కప్​-2024లో టీమ్​లో రింకూకు బెర్త్ పక్కా అని అంతా అనుకున్నారు. కానీ అతడ్ని రిజర్వ్​డ్ ప్లేయర్​గా తీసుకెళ్లారు. దీంతో అప్పటివరకు తాను పడిన శ్రమ వృథా అయిందని రింకూ బాధపడ్డాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన ఒక్క మాటతో తన బాధంతా పోయిందన్నాడు రింకూ.

‘బాధలో ఉన్న నన్ను ఓదార్చడానికి రోహిత్ భయ్యా వచ్చాడు. ఏం ఫర్లేదు, నీకు చాలా ఫ్యూచర్ ఉందన్నాడు. మున్ముందు చాలా వరల్డ్ కప్స్ ఉన్నాయని, నిరాశ పడొద్దని అన్నాడు. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మెరుగు పర్చుకో అని సలహా ఇచ్చాడు. ప్రతి రెండేళ్లకో ప్రపంచ కప్ వస్తుందని, దానిపై ఫోకస్ చేయాలని సూచించాడు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కూల్​గా ఉండు’ అని హిట్​మ్యాన్ తనను సముదాయించాడని రింకూ వ్యాఖ్యానించాడు. అతడి మాటలతో తన బాధంతా పోయిందని, భవిష్యత్తు మీద ఫోకస్ పెడుతున్నానని పేర్కొన్నాడు. రోహిత్ మాటలు మంత్రంగా పనిచేశాయని తెలిపాడు. హిట్​మ్యాన్ కెప్టెన్సీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

విరాట్ కోహ్లీ సారథ్యం అంటే కూడా తనకు ఇష్టమని, అతడి కెప్టెన్సీలో అగ్రెషన్ చాలా కీలకమన్నాడు రింకూ. టీమ్​ను లీడ్ చేసే సమయంలో కోహ్లీ భయ్యా ఎంతో దూకుడుగా ఉంటాడని, అదే అతడి సారథ్యంలోని స్పెషాలిటీ అని తెలిపాడు. భారత జట్టులో అందరికంటే విరాట్ ఫిట్టెస్ట్ ప్లేయర్ అని చెప్పిన రింకూ.. అందరూ అతడ్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారన్నాడు. ఫిట్​నెస్​లో కోహ్లీ రేంజ్​ను అందుకునేందుకు అందరమూ ప్రయత్నిస్తామని తెలిపాడు. ఇప్పటివరకు టీమిండియా తరఫున ఎన్నో మ్యాచుల్లో ఆడినప్పటికీ కోహ్లీతో బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదని.. అది తన డ్రీమ్ అన్నాడు రింకూ. అది నెరవేరే రోజు కోసం ఎదురు చూస్తున్నానని.. త్వరలో సాధ్యమవుతుందని వివరించాడు.

Show comments