RCB: IPLకి నెల ముందే RCBకి గుడ్ న్యూస్! కప్ కొట్టినా ఆశ్చర్యం లేదు!

ఒక పక్క ఐపీఎల్‌ ఆరంభానికి​ ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క.. ఆయా ఫ్రాంచైజీలు ఈ సారి సత్తాచాటేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. అయితే.. ఈసారి కప్పు ఆర్సీబీదే అని ప్రచారం నడుస్తోంది. అందులో లాజిక్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఒక పక్క ఐపీఎల్‌ ఆరంభానికి​ ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క.. ఆయా ఫ్రాంచైజీలు ఈ సారి సత్తాచాటేందుకు కూడా సిద్ధం అవుతున్నాయి. అయితే.. ఈసారి కప్పు ఆర్సీబీదే అని ప్రచారం నడుస్తోంది. అందులో లాజిక్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ అభిమానులకు నాన్‌స్టాప్‌ వినోదాన్ని అందించే ఐపీఎల్‌ మరికొన్ని వారాల్లో మొదలుకానుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం ఎంతగానే ఎదురుచూస్తున్నారు. మార్చి 23 నుంచి ఐపీఎల్‌ ఆరంభం కానుంది. ఈ సీజన్‌లో ఎలాగైన కప్పు కొట్టాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. అయితే.. ఒక్క కప్పు కూడా లేకుండా భారీ క్రేజ్‌ ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఐపీఎల్‌ ఆరంభానికి నెల రోజుల ముందే అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ కప్పు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఆర్సీబీ టీమ్‌లో ప్రధాన ఆటగాళ్ల లిస్ట్‌ ఒకసారి చూస్తే.. విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, రజత్‌ పాటిదార్, సిరాజ్‌, కామెరున్‌ గ్రీన్‌.. వీరి ప్రదర్శన ఆధారంగానే ఆర్సీబీ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఆర్సీబీ గెలవాలన్నా.. ఓడిపోవాలన్నా.. వారి చేతుల్లోనే అంతా. ఆ టీమ్‌కు మెయిన్‌ పిల్లర్స్‌ వాళ్లే. ప్రస్తుతం వాళ్లంతా అద్భుత ఫామ్‌లో ఉండటం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. ముఖ్యంగా మ్యాక్స్‌వెల్‌ అయితే భీకర ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్‌తో తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో చెలరేగాడు.

కేవలం 55 బంతుల్లోనే 12 ఫోర్లు, 8 సిక్సులతో 120 పరుగులు చేసి.. విధ్వంసం సృష్టించాడు. మరోవైపు డుప్లెసిస్‌ సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో జొహన్నెస్‌బర్గ్‌ సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా అద్బుతంగా ఆడాడు. అలాగే టీమిండియా సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరంగా ఉన్నా.. మంచి టచ్‌లోనే ఉన్నాడు. పైగా ఇంత పెద్ద గ్యాప్‌ తీసుకుని, నేరుగా ఐపీఎల్‌ బరిలోకి ఫ్రెష్‌ మైండ్‌తో దిగితే.. కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. మరోవైపు యువ క్రికెటర్‌ రజత్‌ పటీదార్‌ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇలా ఆర్సీబీకి ఎంతో కీలకమైన ఆటగాళ్లు ఇంత అద్బుతమైన ఫామ్‌లో ఉండటంతో.. ఈ సారి కప్పు ఆర్సీబీదే అని క్రికెట్‌ అభిమానులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments