Ravindra Jadeja: ఒక్క పోస్ట్​తో వాళ్లకు ఇచ్చిపడేసిన జడేజా.. కౌంటర్ అదిరింది!

టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టీ20లకు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసింది. పొట్టి ప్రపంచ కప్​తో ఆ ఫార్మాట్​కు అతడు వీడ్కోలు చెప్పేశాడు.

టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టీ20లకు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసింది. పొట్టి ప్రపంచ కప్​తో ఆ ఫార్మాట్​కు అతడు వీడ్కోలు చెప్పేశాడు.

టీమిండియా సీనియర్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా టీ20లకు గుడ్​బై చెప్పిన సంగతి తెలిసింది. పొట్టి ప్రపంచ కప్​తో ఆ ఫార్మాట్​కు అతడు వీడ్కోలు చెప్పేశాడు. వరల్డ్ కప్ ముగిశాక స్వదేశానికి చేరుకున్న జడ్డూ టీమ్​మేట్స్​తో కలసి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరకు వెళ్లాడు. ఆయన్ను కలిశాక ముంబైకి వచ్చి విక్టరీ పరేడ్​లో పాల్గొన్నాడు జడ్డూ. ఆ తర్వాత ప్రపంచ కప్ ట్రోఫీతో వాంఖడే స్టేడియంలో సందడి చేశాడు. వరల్డ్ కప్ విక్టరీ సెలబ్రేషన్స్ ముగిశాక ఇంటికి వెళ్లిపోయిన జడ్డూ.. అక్కడే రెస్ట్ తీసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్, ప్రపంచ కప్ ఆడి అలసిపోవడంతో అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు.

టీ20 వరల్డ్ కప్​తో టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగుతానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో లంక టూర్​లో వన్డేల్లో అతడు పాల్గొంటాడని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అతడ్ని ఎంపిక చేయలేదు. ఆల్రెడీ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో ఇద్దరు స్పిన్ ఆల్​రౌండర్లు ఉండటంతో జడేజాకు విశ్రాంతి ఇచ్చామని చీఫ్​ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పాడు. అతడ్ని పూర్తిగా పక్కనబెట్టలేదని, అతడు తమకు ఎంతో ముఖ్యమైన ఆటగాడని స్పష్టం చేశాడు. అగార్కర్ ఇంత స్పష్టంగా చెప్పినా కొందరు విమర్శకులు పనిగట్టుకొని జడ్డూను క్రిటిసైజ్ చేశారు. అతడి పనైపోయిందని, ఇక కమ్​బ్యాక్ కష్టమేనని చెప్పారు. దీనికి అతడు తాజాగా తనదైన రీతిలో కౌంటర్ ఇచ్చాడు.

టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎక్కువగా ఎక్కడా కనిపించని జడ్డూ.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఒక టెలిఫోన్ బూత్ దగ్గర నిల్చొని ఉన్న తన ఫొటోను అతడు అందరితో పంచుకున్నాడు. ఎవరితోనో ఫోన్​లో మాట్లాడుతున్నట్లు పోజ్ ఇచ్చాడు. ఈ ఫొటోకు ఒకే కాల్ దూరంలో ఉన్నాను అని క్యాప్షన్ జతచేశాడు. ఇది చూసిన క్రికెట్ లవర్స్.. తన పనైపోయిందని విమర్శిస్తున్న వారికి కౌంటర్​గానే అతడు ఈ పోస్ట్ పెట్టాడని అంటున్నారు. సెలెక్టర్ల నుంచి ఒక్క కాల్ వస్తే చాలు.. మళ్లీ నేషనల్ డ్యూటీలో బిజీ అయిపోతానని ఇన్​డైరెక్ట్​గా చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్​నెస్​, ఫామ్​తో పాటు బోర్డు సపోర్ట్ కూడా ఉందని.. చెత్త కామెంట్స్ వద్దంటూ ఇలా కౌంటర్ ఇచ్చాడని చెబుతున్నారు. మరి.. జడ్డూ కమ్​బ్యాక్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments