Ravichandran Ashwin: BCCIకి అశ్విన్ సపోర్ట్.. ఆ రూల్​లో తప్పేమీ లేదంటూ..!

Ravichandran Ashwin Wants Impact Rule To Continue: ఏ విషయంలోనైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​కు అలవాటు. ఇలాగే ఓ రూల్​పై స్పందించిన ఈ టాప్ స్పిన్నర్.. భారత క్రికెట్​కు బోర్డుకు సపోర్ట్​గా నిలిచాడు. ఆ నిబంధన విషయంలో బోర్డు తప్పేమీ లేదన్నాడు.

Ravichandran Ashwin Wants Impact Rule To Continue: ఏ విషయంలోనైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పడం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్​కు అలవాటు. ఇలాగే ఓ రూల్​పై స్పందించిన ఈ టాప్ స్పిన్నర్.. భారత క్రికెట్​కు బోర్డుకు సపోర్ట్​గా నిలిచాడు. ఆ నిబంధన విషయంలో బోర్డు తప్పేమీ లేదన్నాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో భారత క్రికెట్ బోర్డు కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఉంటుంది. తొలుత డొమెస్టిక్ క్రికెట్​లో ఆ రూల్స్​ను పరీక్షించి సక్సెస్ అయితే ఐపీఎల్​లో ప్రవేశపెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో బీసీసీఐ తెచ్చిన రూల్స్, చేసిన మార్పులు చాలా విజయవంతం అయ్యాయి. అయితే కొన్ని నిబంధనలు వివాదాస్పదం అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒకటి. ఈ నిబంధన వల్ల ఆల్​రౌండర్లకు అన్యాయం జరుగుతోంది? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మాజీ క్రికెటర్లతో పాటు కొన్ని ఫ్రాంచైజీలు, పలువురు ఐపీఎల్ స్టార్లు ఈ రూల్​ వద్దంటూ విముఖత వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రియాక్ట్ అయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన విషయంలో బోర్డుకు అతడు సపోర్ట్ చేశాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల స్ట్రాటజీలకు మరింత పదును పెట్టడంతో పాటు అడిషనల్ వాల్యూ కూడా చేకూరుతుందని అశ్విన్ అన్నాడు. ఈ రూల్ అంత చెడ్డదేం కాదని.. దీని వల్ల వ్యూహాలకు అదనపు విలువ చేకూరుతుందని చెప్పాడు. ఆల్​రౌండర్లకు వ్యతిరేకంగా ఉందని అంటున్నారని.. కానీ వాళ్లను ఎవరూ ఆపడం లేదు కదా అని అశ్విన్ ఎదురు ప్రశ్నించాడు. ఈ తరంలో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేసేవారి సంఖ్య తగ్గిపోయిందన్న టాప్ స్పిన్నర్.. దీని వల్లే ప్రోత్సాహం దక్కడం లేదనడం కరెక్ట్ కాదన్నాడు. కేకేఆర్ స్టార్ ప్లేయర్​ వెంకటేష్ అయ్యర్​ను ఉదాహరణగా చూపిన అశ్విన్.. అతడు లాంక్​షైర్ తరఫున ఆడుతున్నాడని తెలిపాడు. కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఇది మంచి ఛాన్స్ అని.. ఈ రూల్ లేకపోతే చాలా మంది యంగ్​స్టర్స్​కు ఐపీఎల్​లో ఆడే అవకాశం రాదన్నాడు.

‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ మంచిదే. దీని వల్ల ఆల్​రౌండర్లకు ప్రయోజనం చేకూరుతోంది. దీనికి లాస్ట్ ఐపీఎల్​లో రెండో క్వాలిఫయర్ మ్యాచే ఎగ్జాంపుల్. ఆ మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్​గా షాబాజ్ అహ్మద్​ను తీసుకుంది. అతడు విలువైన రన్స్ చేయడంతో పాటు బౌలింగ్​లోనూ అదరగొట్టాడు. మూడు కీలక వికెట్లు తీసి మ్యాచ్​ను ఎస్​ఆర్​హెచ్​ వైపు తిప్పాడు. ఒకవేళ సెకండ్ ఇన్నింగ్స్​లో బ్యాటర్​గా చేసేటప్పుడు వ్యూహాత్మకంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది అందరూ ఆలోచించాలి. ఎక్స్​ట్రా ప్లేయర్ అందుబాటులో ఉంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా సాగుతుంది. ఈ రూల్ లేకపోతే చాలా మంది ఆటగాళ్లకు ఐపీఎల్​లో ఆడే ఛాన్సే రాదు. దీంతో మరింత మందికి అవకాశం వస్తుందని అనడం లేదు. కానీ తీసేయాల్సినంత చెత్త నిబంధనైతే కాదు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. మరి.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉంచాలా? తీసేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Show comments