Samit Dravid: టీమిండియాలోకి ద్రవిడ్ కొడుకు! ఆస్ట్రేలియా సిరీస్ తో ఎంట్రీ..

Samit Dravid selected for Indian Under-19 team: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది.

Samit Dravid selected for Indian Under-19 team: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్ కు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది.

సమిత్ ద్రవిడ్.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కుమారుడిగా క్రికెట్ లో అడుగుపెట్టాడు. కానీ.. తనదైన బ్యాటింగ్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటున్నాడు. తాజాగా జరిగిన మహారాజా ట్రోఫీ 2024లో అద్భుతంగా రాణించాడు ఈ జూనియర్ వాల్. ఈ టోర్నీలో మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగి పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. తండ్రిలా జిడ్డు బ్యాటింగ్ చేయకుండా ఫోర్లు, సిక్సర్లతో అలరించాడు. దాంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. త్వరలోనే టీమిండియాలోకి అడుగుపెట్టబోతున్నాడు. భారత అండర్ 19 జట్టుకు సమిత్ ఎంపికైయ్యాడు.

భారత మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ టీమిండియా-19 జట్టుకు ఎంపికైయ్యాడు. భారత్ వేదికగా త్వరలోనే ఆస్ట్రేలియా 19 టీమ్ తో టీమిండియా తలపడనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, రెండు టెస్టు(నాలుగు రోజుల) మ్యాచ్ లు ఆడనుంది. సెప్టెంబర్ 21 నుంచి ఈ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యంగ్ టీమ్ ను బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు సమిత్ ద్రవిడ్. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుంటూ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సమిత్.. తనదైన దూకుడు బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. ఇటీవలే జరిగిన మహారాజా ట్రోఫీలో మెరుపు బ్యాటింగ్ తో అదరగొట్టాడు. మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగి.. స్పీడ్ బ్యాటింగ్ తో అలరించాడు. దాంతో సెలెక్టర్ల దృష్టి అతడిపై పడింది. ఇక ఇప్పుడు అండర్ 19 వన్డే, టెస్ట్ జట్టుకు ఎంపికైయ్యాడు. కాగా.. పుదుచ్చేరి వేదికగా వన్డే, చెన్నై వేదికగా టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి.

ఆసీస్ తో వన్డే సిరీస్ కు ఎంపికైన భారత అండర్ 19 టీమ్:

మహ్మద్ అమాన్ (కెప్టెన్), రుద్ర పటేల్ (వైస్ కెప్టెన్), సాహిల్ పరాఖ్, కార్తికేయ, కిరణ్ చోర్మలే , అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), సమిత్ ద్రవిడ్, యుధాజిత్ గుహా, సమర్థ్ , నిఖిల్ కుమార్ , హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, మహ్మద్ ఈనాన్, రోహిత్ రాజావత్.

టెస్ట్ మ్యాచ్ లకు ఎంపికైన భారత అండర్ 19 జట్టు:

సోహమ్ పట్వర్ధన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), నిత్య పాండ్య, కార్తికేయ, సమిత్ ద్రవిడ్, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వాన్ష్ సింగ్ (వికెట్ కీపర్), చేతన్ శర్మ, సమర్థ్ , నిఖిల్ కుమార్, అన్మోల్జీత్ సింగ్, ఆదిత్య రావత్, ఆదిత్య సింగ్, మహ్మద్ ఈనాన్.

Show comments