వేలంలో అమ్ముడైన ద్రవిడ్‌ కొడుకు! ఆ జట్టు తరఫున బరిలోకి..

Rahul Dravid, Samit Dravid, Maharaja Trophy KSCA 2024: దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌ భారీ జాక్‌పాట్‌ కొట్టాడు. స్టార్‌ ఆటగాళ్లతో కలిసి ఆడే లీగ్‌లో అమ్ముడుపోయాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Rahul Dravid, Samit Dravid, Maharaja Trophy KSCA 2024: దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కుమారుడు సమిత్‌ ద్రవిడ్‌ భారీ జాక్‌పాట్‌ కొట్టాడు. స్టార్‌ ఆటగాళ్లతో కలిసి ఆడే లీగ్‌లో అమ్ముడుపోయాడు. దాని గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌, తాజా మాజీ టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రస్తుతం పుత్రోత్సాహం పొందుతున్నట్లు ఉన్నాడు. ఎందుకంటే.. ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌ కర్ణాటకలో జరిగే మినీ ఐపీఎల్‌ టోర్నీలో ఆడేందుకు అర్హత సాధించాడు. తాజాగా నిర్వహించిన వేలంలో మంచి ధరకే అమ్ముడుపోయాడు. కర్ణాటక క్రికెట్‌ బోర్డు నిర్వహించే ఈ ‘మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20’ వేలంలో సమిత్‌ ద్రవిడ్‌ రూ.50 వేలకు అమ్ముడయ్యాడు. సమిత్‌ ద్రవిడ్‌ను మైసూర్‌ వారియర్స్‌ జట్టు కొనుగోలు చేసింది. 18 ఏళ్ల సమిత్‌ ద్రవిడ్‌ ఆల్‌రౌండర్‌గా మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు.

అయితే.. సమిత్‌ ద్రవిడ్‌కు కేవలం రూ.50 వేలు మాత్రమే దక్కినా.. మైసూర్‌ వారియన్స్‌ టీమ్‌లో ఉన్న స్టార్‌, సీనియర్‌ క్రికెటర్లతో కలిసి ఆడే అవకాశం సమిత్‌కు దక్కనుంది. దాంతో.. అతని గేమ్‌ మరింత మెరుగుపడనుంది. మైసూర్‌ వారియర్స్‌ టీమ్‌లో ప్రసిద్ధ్‌ కృష్ణ, కృష్ణప్ప గౌతమ్‌, కరుణ్‌ నాయర్‌ లాంటి స్టార్‌ ఆటగాళ్ల ఉన్నారు. సమిత్‌ ద్రవిడ్‌ మిడిల్డార్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు, అలాగే మీడియం పేస్‌తో బౌలింగ్‌ కూడా చేయగలడు. కూచ్‌ బెహార్‌ ట్రోఫీ 2023-24 గెలిచిన కర్ణాటక అండర్‌-19 టీమ్‌లో సమిత్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఈ ఏడాది లాంక్షైర్‌తో జరిగిన మూడు రోజుల మ్యాచ్‌లో కేఎస్‌సీఏ ఎలెవన్‌ తరఫున కూడా సమిత్‌ ఆడాడు.

ఇక మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ20 వేలం విషయానికి వస్తే.. ఈ వేలంలో వికెట్‌ కీపర్‌ ఎల్‌ఆర్‌ చేతన్‌ భారీ ధర పలికాడు. అతన్ని బెంగళూరు బ్లాస్టర్స్‌ ఏకంగా రూ.8.20 లక్షలు పెట్టి తమ టీమ్‌లో తీసుకుంది. చేతన్‌ లాస్ట్‌ సీజన్‌లో గుల్బర్గా జట్టు తరఫున ఆడాడు. ఈ టోర్నీలో టీమిండియా తరఫున ఆడిన స్టార్‌ ఆటగాళ్లు కూడా పాల్గొంటున్నారు. బెంగళూరు బ్లాస్టర్స్‌కు మయాంక్‌ అగర్వాల్‌, గుల్బర్గా మిస్టిక్స్‌కు దేవదత్త్‌ పడిక్కల్‌, హుబ్లీ టైగర్స్‌కు మనీష్‌ పాండే ఆడుతున్నారు. అలాగే హోహ్సిన్‌ ఖాన్ కూడా బెంగళూరుకు ఆడనున్నాడు. మరి ఈ కేఎస్‌సీఏ టోర్నీలో ద్రవిడ్‌ కొడుకు సమిత్‌ ద్రవిడ్‌కు వేలంలో రూ.50 వేల ధరపలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments