Nidhan
Rahmanullah Gurbaz Smashes Century: క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటైన సౌతాఫ్రికాను భయపెడుతోంది ఆఫ్ఘానిస్థాన్. పట్టుదలతో ఆడుతూ సఫారీల పని పడుతున్నారు ఆఫ్ఘాన్ వీరులు. తొలి వన్డేలో ఆ జట్టును చిత్తు చేశారు. రెండో వన్డేలోనూ ప్రొటీస్‌కు షాక్ ఇచ్చేలాగే ఉన్నారు.
Rahmanullah Gurbaz Smashes Century: క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటైన సౌతాఫ్రికాను భయపెడుతోంది ఆఫ్ఘానిస్థాన్. పట్టుదలతో ఆడుతూ సఫారీల పని పడుతున్నారు ఆఫ్ఘాన్ వీరులు. తొలి వన్డేలో ఆ జట్టును చిత్తు చేశారు. రెండో వన్డేలోనూ ప్రొటీస్‌కు షాక్ ఇచ్చేలాగే ఉన్నారు.
Nidhan
క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటైన సౌతాఫ్రికాను భయపెడుతోంది ఆఫ్ఘానిస్థాన్. పట్టుదలతో ఆడుతూ సఫారీల పని పడుతోంది. ఏ మాత్రం భయం లేకుండా ఆడుతూ వాళ్లను షేక్ చేస్తోంది. బిగ్ టీమ్‌కు ఫియర్ ఎలా ఉంటుందో పరిచయం చేస్తోంది. తొలి వన్డేలో ప్రొటీస్‌ను చిత్తు చేసిన ఆఫ్ఘాన్ వీరులు.. రెండో వన్డేలోనూ ఆ టీమ్‌కు షాక్ ఇచ్చేలాగే ఉన్నారు. ఈ దిశగా ఇప్పటికే భారీ అడుగులు పడ్డాయి. ఆఫ్ఘాన్-సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే ఆసక్తికరంగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆఫ్ఘాన్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే తొలి వన్డేలో ఓడి కసి మీద ఉన్న సఫారీలు ఆ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను తక్కువ స్కోరుకే కూలుస్తారనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఓపెనర్ రెహ్మానుల్లా గుర్బాజ్ పిడుగులా ప్రొటీస్ మీద పడ్డాడు. మెరుపు సెంచరీతో ప్రత్యర్థితో ఓ ఆటాడుకున్నాడు.
ఫస్ట్ ఓవర్ నుంచి సౌతాఫ్రికాను వణకించాడు గుర్బాజ్. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేకుండా అందర్నీ వాయించి వదిలేశాడు. స్టార్ పేసర్లు లుంగీ ఎంగిడీ, నండ్రీ బర్గర్తో పాటు నకాబా పీటర్ బౌలింగ్‌లో భారీగా పరుగులు పిండుకున్నాడు. వ్లాన్ ముల్డర్‌ను కూడా ఉతికి ఆరేశాడు. మొత్తంగా 110 బంతుల్లో 105 పరుగులు చేశాడు గుర్బాజ్. ఇందులో 10 బౌండరీలు, 3 సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 58 పరుగులు పిండుకున్నాడు రెహ్మానుల్లా. భారీ షాట్లు బాదుతూనే మధ్యలో స్ట్రైక్ రొటేషన్‌కు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సింగిల్స్‌ను డబుల్స్‌గా కన్వర్ట్ చేస్తూ సౌతాఫ్రికా ఫీల్డర్లను ఒత్తిడిలో పెట్టాడు. ఈ నాక్‌తో ప్రొటీస్ మీద వన్డేల్లో సెంచరీ చేసిన తొలి ఆఫ్ఘాన్ బ్యాటర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇక, గుర్బాజ్‌కు తోడుగా రెహ్మత్ షా (66 బంతుల్లో 50) రాణించడంతో ఆ టీమ్ భారీ స్కోరు దిశగా సాగుతోంది.
గుర్బాజ్, రెహ్మత్ ఔట్ అయినా ఆ తర్వాత వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. అతడు పవర్ హిట్టింగ్తో అదరగొడుతున్నాడు. 34 బంతుల్లో 52 పరుగులు చేసిన ఒమర్జాయి ఇంకా క్రీజులోనే ఉన్నాడు. మరో ఎండ్‌లో ఉన్నాడు సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ (9 నాటౌట్). ఆఫ్ఘాన్ ఇప్పుడు 44.2 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 260 పరుగులతో ఉంది. ఈజీగా మరో 50 నుంచి 60 పరుగులు చేసేలా ఉంది. ఆ టీమ్ బ్యాటర్లు ఇంకా చెలరేగితే స్కోరు 330 వరకు వెళ్లొచ్చు. ఆల్రెడీ తొలి వన్డేలో ఓడి భారీ విమర్శలు మూటగట్టుకున్న సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లోనూ ఓడితే సిరీస్ కోల్పోతుంది. అదే జరిగితే ప్రోటీస్ మీద మరింత ట్రోలింగ్ జరగడం ఖాయం. మరి.. గుర్బాజ్ సెంచరీ నాక్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
🚨 HISTORY ALERT 🚨
Rahmanullah Gurbaz becomes the first-ever Afghanistan batter to score a hundred against South Africa in ODIs 🙌 pic.twitter.com/qgnX60j6mc
— CricTracker (@Cricketracker) September 20, 2024