రాహుల్‌+సచిన్‌=రచిన్‌ కాదు! పేరు వెనుక సీక్రెట్‌ బయటపెట్టిన రచిన్‌ తండ్రి

భారత సంతతికి చెందిన న్యూజిలాండ్‌ యువ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర ఈ వరల్డ్‌ కప్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తోనే టీమిండియా బుధవారం సెమీస్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా రచిన​ కీలకం కానున్నాడు. అయితే.. ఇన్ని రోజులు రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ పేర్లు కలిపి అతనికి రచిన్‌ అని పేరు పెట్టారని చాలా మంది అనుకున్నారు. కానీ, అతని పేరు వెనకున్న అసలు విషయాన్ని రచిన్‌ తండ్రి బయటపెట్టారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

భారత సంతతికి చెందిన న్యూజిలాండ్‌ యువ క్రికెటర్‌ రచిన్‌ రవీంద్ర ఈ వరల్డ్‌ కప్‌లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తోనే టీమిండియా బుధవారం సెమీస్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కూడా రచిన​ కీలకం కానున్నాడు. అయితే.. ఇన్ని రోజులు రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ పేర్లు కలిపి అతనికి రచిన్‌ అని పేరు పెట్టారని చాలా మంది అనుకున్నారు. కానీ, అతని పేరు వెనకున్న అసలు విషయాన్ని రచిన్‌ తండ్రి బయటపెట్టారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఇండియా-న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అసలు సిసలైన క్రికెట్‌ మజాను పొందేందుకు ఉవ్విళ్లు ఊరుతున్నారు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య తొలి సెమీస్‌ జరగనుంది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్టుగా ఉన్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇప్పటికే లీగ్‌ దశలో న్యూజిలాండ్‌ను రోహిత్‌ సేన ఓడించిన విషయం తెలిసిందే. అయినా.. కూడా నాకౌట్‌ మ్యాచ్‌ అనగానే పాత లెక్కలేవి పనిచేయవు. గతం గతః.. రేపు ఎవరు బాగా ఆడితే వారే ఫైనల్‌ చేరుతారు. అందుకే రెండు జట్లు తమ వందశాతం ఎఫర్ట్‌ పెట్టేందుకు సిద్ధం అవుతుంది. కాగా, టీమిండియా క్రికెట్‌ అభిమానులను న్యూజిలాండ్‌ టీమ్‌లో ఉన్న ఓ యువ కుర్రాడు కలవరపెడుతున్నాడు. అతనెవరో కాదు రచిన్‌ రవీంద్ర.

ఈ కుర్రాడు భారత సంతతికి చెందినవాడే. కానీ, కివీస్‌ జట్టులో స్టార్‌గా మారాడు. ఈ వరల్డ్‌ కప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న రచిన్‌.. ఇప్పటికే 565 పరుగులు చేసి.. టోర్నీలో ఇప్పటివరకు అత్యధిక రన్స్‌ చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను ఎంతో సులువుగా ఎదుర్కొంటూ అద్భుతంగా ఆడుతున్నాడు. లీగ్‌ దశలో ఇండియా-న్యూజిలాండ్‌ తలపడిన సమయంలో కూడా రచిన్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. డారిల్‌ మిచెల్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి న్యూజిలాండ్‌కు భారీ స్కోర్‌ అందించాడు. దీంతో రచిన్‌ పేరు క్రికెట్‌ ప్రపంచంలో మారుమోగిపోయింది.

ముఖ్యంగా అతని పేరుపై కూడా భారీ చర్చ జరిగింది. టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్లు.. రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌లపై అభిమానంతో రచిన్‌ తండ్రి తన కుమారుడికి రాహుల్‌ ద్రవిడ్‌లో ర, సచిన్‌లో చిన్‌ కలిపి.. రచిన్‌ అని పేరు పెట్టినట్లు చాలా వార్తలు వచ్చాయి. వారిద్దరి పేర్లే కాదు వారిద్దరి టాలెంట్‌ను కలిపితే రచిన్‌లా ఆడుతూ ప్రశంసలు పొందాడు. అయితే తాజాగా రచిన్‌ పేరు గురించి అతని తండ్రి రవి కృష్ణమూర్తి స్పందించారు. తన కుమారుడికి పేరు పెట్టేందుకు పెద్దగా ఆలోచించలేదని, రాహుల్‌ ద్రవిడ్‌, సచిన్‌ టెండూల్కర్‌ పేర్లు కలిసి వచ్చేలా పెట్టింది కాదని, ఆ పేరును రచిన్‌ వాళ్ల అమ్మ సూచించిందని, పలేకేందుకు బాగుంటడం, చిన్నగా ఉండటంతో పెట్టేశామని, రాహుల్‌, సచిన్‌ పేర్లు కలిసి రావాలని ఆలోచించి పెట్టలేదని అసలు విషయం వెల్లడించారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments