Somesekhar
Deepti Jeevanji wins bronze medal in Paris Paralympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీ సత్తాచాటింది. పారాలింపిక్స్ లో బరిలోకి దిగిన తొలిసారే పతకంతో మెరిసింది.
Deepti Jeevanji wins bronze medal in Paris Paralympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజీ సత్తాచాటింది. పారాలింపిక్స్ లో బరిలోకి దిగిన తొలిసారే పతకంతో మెరిసింది.
Somesekhar
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ 2024లో భారత అథ్లెట్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. సోమవారం భారత్ పతకాల వేటలో అదరగొట్టింది. ఈ ఒక్క రోజే రెండు స్వర్ణాలతో సహా.. ఎనిమిది పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. అయితే ఆ తర్వాత రోజు నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో నేనున్నానంటూ స్ప్రింటర్ దీప్తి జీవాంజి చివర్లో పతకంతో మెరిసింది ఈ తెలంగాణ బిడ్డ. మహిళల 400 మీటర్ల టీ20 కేటగిరీ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి పతకాన్ని సాధించింది. పారాలింపిక్స్ బరిలోకి దిగిన తొలిసారే ఆమె ఈ ఘనత సాధించడం విశేషం.
పారాలింపిక్స్ 2024లో భారత స్టార్ స్ప్రింటర్, తెలంగాణ క్రీడాకారిణి దీప్తి జీవాంజి కాంస్య పతకంతో అదరగొట్టింది. మంగళవారం జరిగిన 400 మీటర్ల మహిళల టీ20 విభాగం ఫైనల్లో 55.45 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచి, కాంస్య పతకాన్ని సాధించింది. 55.16 సెకన్లలో టార్గెట్ ను పూర్తి చేసి స్వర్ణ పతకం దక్కించుకుంది ఉక్రెయిన్ కు చెందిన వై షులియర్. ఇక 55.23 సెకన్లలో రెండ స్థానంలో నిలిచి టర్కీకి చెందిన ఏ. ఓండర్ రజతాన్ని చేజిక్కించుకుంది.
కాగా.. తెలంగాణలోని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది. పుట్టుకతోనే మేధోపరమైన బలహీనతతో పుట్టిన దీప్తీని పీఈటీ ప్రోత్సహించాడు. ఆ తర్వాత జూనియర్ అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణలో రాటుదేలింది. అక్కడి నుంచి పారాలింపిక్స్ లో పతకం సాధించేంత వరకు ఆమె ప్రయాణం సాగింది. ప్రస్తుతం ప్రపంచ రికార్డు (55.07 సెకన్లు) ఆమె పేరిటే ఉంది. ఇక ఇప్పటి వరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరాయి. 3 స్వర్ణాలు, 7 రజతాలు, 10 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి. మరి పేదరికంలో పుట్టి.. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించిన దీప్తీ జీవాంజిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Deepthi Jeevanji wins Bronze Medal in 400m event. 🥉
– 16th Medal for India at the Paris Paralympics. 🇮🇳 pic.twitter.com/0pTLgdGAnE
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2024