వరల్డ్‌లోనే బెస్ట్‌ టీమ్‌ పాకిస్థాన్‌! ఈ మాట ఎవరన్నారో తెలుసా?

వరల్డ్‌లోనే బెస్ట్‌ టీమ్‌ పాకిస్థాన్‌! ఈ మాట ఎవరన్నారో తెలుసా?

Pakistan, PCB: ప్రపంచంలో ఉన్న అన్ని టీమ్స్‌ కంటే.. పాకిస్థాన్‌ టీమ్‌ బెస్ట్‌ అని ఓ అఫీషియల్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Pakistan, PCB: ప్రపంచంలో ఉన్న అన్ని టీమ్స్‌ కంటే.. పాకిస్థాన్‌ టీమ్‌ బెస్ట్‌ అని ఓ అఫీషియల్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మరికొన్ని రోజుల్లో టీ20 వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్‌ హీట్‌ మొదలైంది. జట్ల ప్రకటన, ఆటగాళ్ల బలాబలాలు, మాజీ క్రికెటర్ల కామెంట్లతో వాతావరణ వేడెక్కుతోంది. ఇదే క్రమంలో మరి కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు నవ్వు తెప్పించేలా కూడా ఉన్నాయి. తాజాగా పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ మొహ్‌సిన్‌ నఖ్వీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ టీమ్‌ బెస్ట్‌ టీమ్‌ అని అన్నారు. ఈ ఒక్క కామెంట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పీసీబీ ఛైర్మన్‌ ఇ‍చ్చిన ఈ స్టేట్‌మెంట్‌తో మీమర్లు పండగ చేసుకుంటున్నారు.

పైగా ఆయన ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది ఎప్పుడో తెలుసా.. పసికూన ఐర్లాండ్‌పై మూడు టీ20ల సిరీస్‌ గెలిచిన తర్వాత.. ఆయన ఈ కామెంట్స్‌ చేయడం విశేషం. టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు పాకిస్థాన్‌ టీమ్‌ ఐర్లాండ్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌ విజయంతో.. వరల్డ్‌లో బెస్ట్‌ టీమ్‌ పాకిస్థాన్‌ అని ఆయన అన్నారు. ఆయన కామెంట్స్‌పై క్రికెట్‌ అభిమానులు నవ్వుకుంటున్నారు. ఐర్లాండ్‌ చేతిలో తొలి మ్యాచ్‌లోనే ఓడిపోయిన టీమ్‌.. ఎలా బెస్ట్‌ టీమ్‌ అవుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో వైఫల్యం తర్వాత.. బాబర్‌ అజమ్‌ ఓటమికి బాధ్యత వహిస్తూ.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆ తర్వాత షాహీన్‌ అఫ్రిదీకి టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కానీ, కెప్టెన్‌గా అఫ్రిదీ విఫలం అవ్వడంతో మళ్లీ బాబర్‌ అజమ్‌నే కెప్టెన్‌గా నియమించారు. బాబర్‌ కెప్టెన్సీలో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను సమం చేసుకున్న బాబర్‌ సేన.. తాజాగా ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లి తొలి మ్యాచ్‌లో ఓడి పరువుపోగొట్టుకుంది. అయినా కూడా పాకిస్థాన్‌ టీమ్‌ అంటూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రకటించడం హాస్యాస్పదంగా మారింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments