హార్ధిక్‌ పాండ్యాకు రీప్లేస్‌మెంట్‌గా తెలుగోడు!

Nitish Kumar Reddy, Hardik Pandya: ఐపీఎల్‌ 2024లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో.. అతనిపై వేటు వేస్తూ.. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం అతని ప్లేస్‌లో ఓ తెలుగు క్రికెటర్‌ను తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అతనెవరో ఇప్పుడు చూద్దాం..

Nitish Kumar Reddy, Hardik Pandya: ఐపీఎల్‌ 2024లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో.. అతనిపై వేటు వేస్తూ.. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం అతని ప్లేస్‌లో ఓ తెలుగు క్రికెటర్‌ను తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మరి అతనెవరో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ జోరుగా నడుస్తున్నా.. కొంతమంది క్రికెట్‌ అభిమానుల ఫోకస్‌ రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌పై కూడా ఉంది. పైగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌ కాకపోవడంతో.. అతను కూడా టీ20 వరల్డ్‌ కప్‌ 2024పైనే ఫోకస్‌ పెట్టాడు. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టీమిండియాను ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే.. వరల్డ్‌ కప్‌ తర్వాత టీమిండియాలో చోటు చేసుకోబోయే పరిణామాలపై  ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ తెలుస్తోంది. చెత్త ఫామ్‌లో ఉన్న హార్ధిక్‌ పాండ్యాకు బదులు.. టీమిండియాలోకి ఓ తెలుగోడిని తీసుకునే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. మరి ఆ లక్కీ ఛాన్స్‌ కొట్టేసే క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ దుమ్మురేపుతోంది. ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మతో పాటు క్లాసెన్‌, అబ్దుల్‌ సమద్‌ పే​ర్లు బాగా వినిపిస్తున్నాయి. అయితే.. వీరితో పాటు మరో క్రికెటర్‌ కూడా అదరగొడుతున్నాడు. అతనే నితీష్‌ కుమార్‌ రెడ్డి. ఎస్‌ఆర్‌హెచ్‌ టీమ్‌లో ఒక క్వాలిటీ ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్న నితీస్‌ కుమార్‌ రెడ్డిపై ఇప్పుడు టీమిండియా సెలెక్టర్లు కన్ను పడినట్లు సమాచారం. అది కూడా టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, ప్రస్తుత ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాకు రీప్లేస్‌మెంట్‌గా నితీష్‌ కుమార్‌ రెడ్డిని టీమ్‌లోకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హార్ధిక్‌ పాండ్యా ఫామ్‌లో లేడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ భారంతో అతను బ్యాటింగ్‌, బౌలింగ్‌లో దారుణంగా విఫలం అవుతున్నాడు.

పైగా ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో.. పాండ్యాపై నమ్మకం పెట్టుకుని ఎంతో కీలకమైన టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు ఎంపిక చేసి.. తలపట్టుకోవడం కంటే.. శివమ్‌ దూబేతో పాటు నితీష్‌ కుమార్‌ రెడ్డిని టీమ్‌లోకి తీసుకుంటే ఉపయోగం ఉంటుందని ఇటు సెలెక్టర్లు, అటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బలంగా నమ్ముతున్నట్లు సమాచారం. పాండ్యా ప్లేస్‌లో నితీస్‌ కుమార్‌ రెడ్డిని ఎందుకు తీసుకోవాలంటే.. పాండ్యా కంటే వేగంగా.. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో బౌలింగ్‌ చేయగలడు. అలాగే బ్యాటింగ్‌లో కూడా అదరగొడుతున్నాడు. మిడిల్‌ ఓవర్స్‌లో యాంకర్‌ రోల్‌ పోషిస్తూ బ్యాటింగ్‌ చేయగలడు, అవసరం అయితే ఫినిషర్‌ రోల్‌ కూడా అద్భుతంగా పోషిస్తాడు. దీంతో.. పాండ్యా ప్లేస్‌లో నితీష్‌ వంద శాతం ఫిట్‌ అవుతాడని క్రికెట్‌ నిపుణులు కూడా భావిస్తున్నారు. గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సులతో 76 పరుగులు చేసి అదరగొట్టాడు.

 

10 197 46 21.89 150.38

Read more at: https://www.mykhel.com/cricket/players/hardik-pandya-ipl-p7780/

ఈ సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన నితీస్‌ కుమార్‌ రెడ్డి 54.75 యావరేజ్‌, 154.23 స్ట్రైక్‌రేట్‌తో 219 పరుగులు చేశాడు. అందులో రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో 3 వికెట్లు కూడా పడగొట్టాడు. ఎకానమీ 9.77గా ఉంది. మరో వైపు హార్దిక్‌ పాండ్యా 10 మ్యాచ్‌లు ఆడి 21.89 యావరేజ్‌, 150.38 స్ట్రైక్‌రేట్‌తో 197 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క ఫిఫ్టీ కూడా లేదు. అలాగే బౌలింగ్‌లో 10 మ్యాచ్‌ల్లో కేవలం 6 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 11.00గా ఉంది. ఇలా ఏ విధంగా చూసుకున్నా.. హార్ధిక్ పాండ్యా కంటే నితీష్‌ కుమార్‌ రెడ్డి బెస్ట్‌ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. పైగా టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మకు పాండ్యాకు అస్సలు పడటం లేదు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాండ్యా కనుక విఫలం అయితే.. వరల్డ్‌కప్‌ తర్వాత పాండ్యాకు నితీష్‌ కుమార్‌రెడ్డి రీప్లేస్‌మెంట్‌గా టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది. నితీష్‌ కుమార్‌ రెడ్డిని టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్‌ క్రికెట్‌ అభిమానుల నుంచి కూడా వ్యక్తం అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments