Nitish Kumar Reddy: కోహ్లీ రేంజ్‌ను అందుకున్న తెలుగు క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి! కోట్లలో ఆదాయం..

Nitish Kumar Reddy: కోహ్లీ రేంజ్‌ను అందుకున్న తెలుగు క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి! కోట్లలో ఆదాయం..

Nitish Kumar Reddy, Puma, Brand Ambassador, Riyan Parag: ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి.. ఇటీవల టీమిండియాకు ఆడే అవకాశం కోల్పోయి.. తాజాగా అదిరిపోయే జాక్‌పాట్‌ కొట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Nitish Kumar Reddy, Puma, Brand Ambassador, Riyan Parag: ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి.. ఇటీవల టీమిండియాకు ఆడే అవకాశం కోల్పోయి.. తాజాగా అదిరిపోయే జాక్‌పాట్‌ కొట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి గురించి క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఐపీఎల్‌ 2024 సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడి అదరగొట్టిన ఈ కుర్రాడు తాజాగా పెద్ద జాక్‌ పాట్‌ కొట్టేశాడు. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ ‘పుమా’ నితీష్ కుమార్ రెడ్డిని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. మరో యంగ్‌ ప్లేయర్‌ రియాన్ పరాగ్‌కు కూడా ఆ కాంట్రాక్ట్‌ లభించింది. ఈ ఇద్దరిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసుకుంది పుమా. అయితే.. పుమాకు ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమీ లాంటి టీమిండియా సూపర్‌ స్టార్లు బ్రాండ్‌ అంబాసిడర్లుగా ఉన్నారు. వారితో పాటు ఇప్పుడీ యంగ్‌ ప్లేయర్లు కూడా పుమా ఉత్పత్తులకు ప్రచారం చేయనున్నారు.. ఇందుకు గానూ పుమా కంపెనీ నితీష్‌, పరాగ్‌లకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించనుంది.

ఐపీఎల్‌ 2024లో ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన నితీష్‌ కుమార్‌ రెడ్డి.. టీమిండియాలో కూడా చోటు సంపాదించుకున్నాడు. జింబాబ్వేతో ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఐదు టీ20ల సిరీస్‌ కోసం భాతర సెలెక్టర్లు నితీష్‌ను ఎంపిక చేశారు. కానీ, దురదృష్టవశాత్తు గాయం కారణంగా చివరి నిమిషంలో జట్టు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. భారత జెర్సీ ధరించే గొప్ప అవకాశాన్ని మిస్‌ అయ్యాడు నితీష్‌. కానీ గాయం నుంచి కోలుకుని.. త్వరలోనే టీమిండియాకు ఆడతానని నమ్మకంగా ఉన్నాడు. టీమిండియాకు ఆడే అవకాశం కోల్పోయాననే బాధలో ఉన్న అతనికి ఈ పుమా కాంట్రాక్ట్‌ ఊరటను ఇవ్వనుంది. విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్‌ ప్లేయర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీకి తాను కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌ అవ్వడం నిజంగా గొప్ప విషయమే కదా.

ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున మొత్తం 13 మ్యాచ్‌లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 33.67 సగటుతో 303 పరుగులు చేశాడు. 142.92 స్ట్రైక్‌రేట్‌తో 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. అవి కూడా ఎంతో కీలకమైన సమయంలో కీలక మ్యాచ్‌ల్లో నమోదు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌‌లో కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ నితీష్ 76 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. అలాగే బౌలింగ్‌లోనూ 3 వికెట్లు తీసాడు. ఇలా ఆల్‌రౌండర్‌గా అతను చూపించిన ప్రతిభకు గుర్తింపుగా అతన్ని టీమిండియాలోకి ఆహ్వానించింది బీసీసీఐ. కానీ, గాయం అతని అదృష్టంపై నీళ్లు చల్లింది. ఆ విషయం పక్కనపెడితే.. నితీష్‌ పుమా బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments