IPL 2025: KL రాహుల్‌ ప్లేస్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు కెప్టెన్‌గా పూరన్‌?

Nicholas Pooran, LSG, KL Rahul, IPL 2025: ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం కొత్త కెప్టెన్‌ను నియమించుకునే పనిలో ఉంది లక్నో. కేఎల్‌ రాహుల్‌ను తప్పించి.. అతని ప్లేస్‌లో విధ్వంసకర బ్యాటర్‌ను కొత్త కెప్టెన్‌గా ఫిక్స​ అయ్యాడని తెలుస్తోంది. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

Nicholas Pooran, LSG, KL Rahul, IPL 2025: ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం కొత్త కెప్టెన్‌ను నియమించుకునే పనిలో ఉంది లక్నో. కేఎల్‌ రాహుల్‌ను తప్పించి.. అతని ప్లేస్‌లో విధ్వంసకర బ్యాటర్‌ను కొత్త కెప్టెన్‌గా ఫిక్స​ అయ్యాడని తెలుస్తోంది. అతనెవరో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ 2025 ఆరంభానికి చాలా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే స్ట్రాంగ్‌ టీమ్‌ను రెడీ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి అన్ని ఫ్రాంచైజీలు. ఐపీఎల్‌ 2025కి ముందు మెగా వేలం జరగనున్న నేపథ్యంలో జట్టులో మార్పులు చేర్పులపై అన్ని ఫ్రాంచైజీలు ఫోకస్‌ పెట్టాయి. ఈ క్రమంలోనే తన టీమ్‌కు కొత్త కెప్టెన్‌ను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫిక్స్‌ చేసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 2022 సీజన్‌తో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చి లక్నో సూపర్‌ జెయింట్స్‌కు వరుసగా మూడేళ్లు టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఐపీఎల్ 2022, 2023 సీజన్స్‌లో రాహుల్‌ కెప్టెన్సీలోని లక్నో టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కానీ, ఐపీఎల్‌ 2024లో మాత్రం చెత్త ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేదు. గత సీజన్‌లో లక్నో చెత్త ప్రదర్శనపై ఆ టీమ్‌ ఓనర్‌ గోయెంకా.. స్టేడియంలోనే రాహుల్‌తో కోపంగా మాట్లాడుతూ కనిపించాడు. ఆ విషయం అప్పట్లో పెను సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత రాహుల్‌ లక్నో ఫ్రాంచైజ్‌ను వీడుతాడని, లక్నో సైతం కొత్త కెప్టెన్‌ కోసం వెతుకుంతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరుస్తూ.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తన కొత్త కెప్టెన్‌ ఎవరో ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది.

వెస్టిండీస్‌ విధ్వంసకర బ్యాటర్‌ నికోలస్‌ పూరన్‌ను తమ కొత్త కెప్టెన్‌గా నియమించుకునేందుకు లక్నో మేనేజ్‌మెంట్‌ డిసైడ్‌ అయిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే.. కేఎల్‌ రాహుల్‌ను సైతం ఐపీఎల్‌ 2025 కోసం రిటేన్‌ చేసుకునేందుకు కూడా లక్నో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. కేవలం వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా మాత్రమే రాహుల్‌ను టీమ్‌లో ఉంచుకోవాలని, కెప్టెన్సీ బాధ్యతలను పూరన్‌కు అప్పగించనున్నారు. కానీ, రాహుల్‌ మాత్రం లక్నో నుంచి బయటికి వచ్చేందుకే ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఇప్పటికే రాహుల్‌తో ఆర్సీబీ టీమ్‌ సంప్రదింపులు జరిపినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆర్సీబీ కెప్టెన్‌గా రాహుల్‌ ఐపీఎల్‌ 2025లో ఆడే అవకాశం ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడక తప్పదు. మరి లక్నో కెప్టెన్‌గా పూరన్‌ ఉంటే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments