SNP
Nicholas Pooran, The Hundred League 2024: ఏ బ్యాటరైనా.. సిక్స్‌ను స్టాండ్స్‌లోకి కొడితేనే వావ్ అంటాం. అప్పుడప్పుడు స్టేడియం రూఫ్‌పై కూడా పడుతుంది. కానీ, అవి చాలా సందర్బాల్లో చిన్న స్టేడియాలు అయి ఉంటాయి. కానీ, ఇప్పుడు పూరన్ కొట్టింది పెద్ద స్టేడియంలో.. ఆ సిక్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
Nicholas Pooran, The Hundred League 2024: ఏ బ్యాటరైనా.. సిక్స్‌ను స్టాండ్స్‌లోకి కొడితేనే వావ్ అంటాం. అప్పుడప్పుడు స్టేడియం రూఫ్‌పై కూడా పడుతుంది. కానీ, అవి చాలా సందర్బాల్లో చిన్న స్టేడియాలు అయి ఉంటాయి. కానీ, ఇప్పుడు పూరన్ కొట్టింది పెద్ద స్టేడియంలో.. ఆ సిక్స్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
SNP
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ భారీ భారీ సిక్సులు కొడతాడని తెలుసుకానీ, మరి ఇంత భీకరమైన షాట్లు ఆడతాడా అనిపించేలా ఒక క్రూరమైన షాట్ కొట్టాడు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో గల ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియాల్లో ఒకటి. ఆ స్టేడియంలో బ్యాటింగ్ చేస్తూ.. స్టాండ్స్‌లోకి బాల్ కొడితేనే గొప్ప అనుకుంటే.. పూరన్ ఏకంగా స్టేడియం బయటికి కొట్టేశాడు. ఆ సిక్స్ చూసి.. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు, కామెంటేటర్లు, ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సైతం నోరెళ్లబెట్టారు. పూరన్ బ్యాటింగ్ పవర్ చూసి.. ఆశ్చర్యపోయారు. పూరన్ కొట్టిన ఆ సిక్స్ ఏకంగా 113 మీటర్ల దూరం వెళ్లిపడింది. అంటే.. దాదాపు డబుల్ సిక్స్ అన్నమాట.
ఈ అతి భారీ సిక్స్.. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ది హండ్రెడ్ లీగ్ 2024లో చోటు చేసుకుంది. మాంచెస్టర్ ఒరిజినల్స్, నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పూరన్ ఈ భారీ సిక్స్ కొట్టాడు. నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ తరఫున బ్యాటింగ్‌కు దిగిన పూరన్.. మాంచెస్టర్ ఒరిజినల్స్ బౌలర్ స్కాట్ క్యూరీ వేసిన ఇన్నింగ్స్ 74వ బంతిని డీప్ మిడ్ వికెట్ పై నుంచి స్టేడియం బయటపడేలా కొట్టాడు. ఫుల్ ఆన్ లెగ్ స్టంప్‌గా వచ్చిన బాల్‌ను.. కళ్లు చెదిరే బ్యాట్ స్వింగ్‌తో సూపర్ షాట్ ఆడాడు. ఈ ఒక్క సిక్సే కాదు.. ఈ మ్యాచ్‌లో ఏకంగా సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సులతో 66 పరుగులు చేసి అల్లాడించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే. మాంచెస్టర్ ఒరిజినల్స్ తొలుత బ్యాటింగ్ చేసి.. నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్ సాల్ట్ కేవలం 28 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి దుమ్మురేపాడు. మిగతా బ్యాటర్లలో ఎవరు పెద్ద చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. నార్తర్న్ సూపర్‌ఛార్జర్స్ బౌలర్లలో సాంట్నర్ 3 వికెట్లతో రాణించాడు. ఆదిల్ రషీద్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు. ఇక 153 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సూపర్‌ఛార్జర్స్ 97 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 156 పరుగులు చేసి గెలిచింది. పూరన్ 66, హ్యారీ బ్రేక్ 43, ఆడమ్ హోసి 27 పరుగులతో రాణించారు. మరి ఈ మ్యాచ్‌లో పూరన్ 113 మీటర్ల సిక్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
NICHOLAS POORAN SMASHED A 113M SIX IN THE HUNDRED. 🤯👌pic.twitter.com/3S72Q3Ie3D
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 12, 2024