ఆ కాల్‌ రాగానే మా నాన్న బాగా ఏడ్చారు! కానీ..: నితీష్‌ కుమార్‌ రెడ్డి

Nitish Kumar Reddy, Team India: ప్రస్తుతం టీమిండియా తరఫున జింబాబ్వే సిరీస్‌ ఆడాల్సిన తెలుగు క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే.. తాజాగా అతను తన జీవితంలో చోటు చేసుకున్న ఓ భావోద్వేగపూరిత ఘటన గురించి వెల్లడించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Nitish Kumar Reddy, Team India: ప్రస్తుతం టీమిండియా తరఫున జింబాబ్వే సిరీస్‌ ఆడాల్సిన తెలుగు క్రికెటర్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే.. తాజాగా అతను తన జీవితంలో చోటు చేసుకున్న ఓ భావోద్వేగపూరిత ఘటన గురించి వెల్లడించాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

తెలుగు క్రికెటర్‌, ఐపీఎల్‌ 2024లో సన్‌రైజర్స్‌ తరఫున అదరగొట్టిన నితీష్‌ కుమార్‌ రెడ్డి జింబాబ్వే పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. కానీ, దురదృష్టవశాత్తు గాయం కారణంగా ఆ సిరీస్‌కు దూరం అయ్యాడు. టీమిండియా జెర్సీ ధరించి, దేశానికి తొలిసారి ప్రాతినిథ్యం వహించే అవకాశం కోల్పోయాడు ఈ యువ క్రికెటర్‌. కానీ, త్వరలోనే మళ్లీ టీమిండియాలో చోటు సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాడు. అయితే.. భారత జట్టుకు ఎంపిక సమయంలో తన కుటుంబ సభ్యులు ఎలా భావోద్వేగానికి గురయ్యారు? ఆ టైమ్‌లో తాను ఎలా ఫీల్‌ అయ్యాడో తాజాగా వెల్లడించాడు.

నితీష్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘జింబాబ్వే టూర్‌కు జట్టును ప్రకటించే రెండు రోజుల ముందే బీసీసీఐ నుంచి నాకు ఫోన్‌ కాల్ వచ్చింది. జింబాబ్వే సిరీస్‌కు ఎంపిక చేస్తున్నామని చెప్పారు. ఆ విషయం విని చాలా సంతోషించాను. అప్పటికే తనను టీమిండియాకు ఎంపిక చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. నేను కూడా ఛాన్స్‌ దక్కుతుందని అనుకున్నాను. అనుకున్నట్లే నేను ఎంపికయ్యాను. బీసీసీఐ నుంచి కాల్‌ చేసి.. నా జెర్సీ నంబర్‌తో పాటు సైజ్ వివరాలను అడిగి తీసుకున్నారు. ఈ విషయాన్ని మా నాన్నతో చెబితే ఆయన చాలా ఎమోషనల్‌ అయ్యారు. బాగా ఏడ్చేశారు.’ అని నితీష్‌ తెలిపాడు.

కానీ, దురదృష్టవశాత్తు గాయం కారణంగా నితీష్‌ కుమార్‌ రెడ్డి చివరి నిమిషంలో జింబాబ్వే సిరీస్‌కు దూరం అయ్యాడు. అతని స్థానంలో శివమ్ దూబేను సెలెక్టర్లు ఎంపిక చేశారు. గాయంతో తొలిసారి టీమిండియా జెర్సీ ధరించే అవకాశం కోల్పోవడం తనను ఎంతో బాధించిందని నితీష్‌ వెల్లడించాడు. ఐపీఎల్‌ 2024 సీజన్ ముగిసిన తర్వాత.. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ హార్దిక్ పాండ్యా తనను అభినందిస్తూ మెసేజ్ చేసినట్లు ఈ సందర్భంగా నితీష్‌ చెప్పుకొచ్చాడు. మరి నితీష్‌ కుమార్‌ రెడ్డి.. టీమిండియా ఎంపిక కావడం, గాయంతో దూరం కావడంతో పాటు అతని తండ్రి తీవ్ర భావోద్వేగానికి గురి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments