డబుల్ సెంచరీతో దుమ్మురేపిన సర్ఫరాజ్‌ తమ్ముడు! అన్నను మించిన ఆట..

Musheer Khan, Ranji Trophy: ఇప్పుడిప్పుడే టీమిండియాలో మెరుస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అడుగుజాడల్లోనే అతని తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ కూడా నడుస్తున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో అద్భుతమైన ద్విశతకంతో రాణించాడు. ఆ వివరాలను ఇప్పుడు పూర్తిగా చూద్దాం..

Musheer Khan, Ranji Trophy: ఇప్పుడిప్పుడే టీమిండియాలో మెరుస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ అడుగుజాడల్లోనే అతని తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ కూడా నడుస్తున్నాడు. తాజాగా రంజీ ట్రోఫీలో అద్భుతమైన ద్విశతకంతో రాణించాడు. ఆ వివరాలను ఇప్పుడు పూర్తిగా చూద్దాం..

సర్ఫరాజ్‌ ఖాన్‌ టీమిండియాలో ఇటీవలె చోటు దక్కించుకుని, తొలి మ్యాచ్‌లోనే రెండు హాఫ్‌ సెంచరీలో సత్తా చాటాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడుతున్నాడు. మరోవైపు సర్ఫరాజ్‌ ఖాన్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ దేశవాళి టోర్నీ.. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. చాలా మంది సీనియర్‌ ప్లేయర్‌ లేకపోవడంతో ముంబై రంజీ జట్టులో ముషీర్‌ ఖాన్‌కు అవకాశం దొరికింది. అది కూడా ఎంతో కీలకమైన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో. దీంతో తనకు దొరికిన ఈ ఛాన్స్‌ను అద్భుతంగా వాడుకున్న ముషీర్‌ ఖాన్‌ ఏకంగా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. 350 బంతుల్లో 18 ఫోర్లతో తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో తొలి ద్విశతకం సాధించాడు.

బరోడాతో శుక్రవారం ప్రారంభమైన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 57 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఇలాంటి సమయంలో వన్‌డౌన్‌లో వచ్చిన ముషీర్‌ ఖాన్‌ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. పైగా ఒక వైపు వికెట్లు పడుతున్నా.. ముషీర్‌ ఖాన్‌ మాత్రం మరో ఎండ్‌లో వికెట్ కాపాడుకుంటూ.. ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా కూడా ముషీర్‌ మిగతా బ్యాటర్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలోనే నిలిచింది. తొలి రోజు 128 పరుగులతో ఉన్న ముషీర్ ఖాన్.. రెండో రోజు డబుల్ సెంచరీతో 203* కదంతొక్కాడు. దీంతో 384 పరుగులకు ఆలౌట్ అయ్యింది ముంబై.

అయితే.. ముషీర్‌ ఖాన్‌ ఇటీవల ముగిసిన అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముషీర్‌ ఖాన్‌తో పాటు మరికొంతమంది కుర్రాళ్లు అద్భుతంగా ఆడటంతో టీమిండియా ఫైనల్‌ వరకు వెళ్లింది. కానీ, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. కుర్రాళ్ల ప్రదర్శనపై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ముషీర్‌ ఖాన్‌ అన్న సర్ఫరాజ్‌ ఖాన్‌ సైతం దేశవాళి క్రికెట్‌లో ఎంతో నిలకడగా రాణించి.. తాజాగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు ముషీర్‌ ఖాన్‌ సైతం అన్న బాటలోనే పయనించి.. టీమిండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. మరి ముషీర్‌ ఖాన్‌ సెంచరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments