వీడియో: టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌ దీప్తి శర్మ రిక్వెస్ట్‌ను ఒప్పుకున్న షమీ!

Mohammed Shami, Deepti Sharma: భారత స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ.. ఉమెన్‌ క్రికెటర్‌ దీప్తి శర్మ రిక్వెస్ట్‌ను ఓకే చేశాడు. ఇంతకీ ఆ రిక్వెస్‌ ఏంటి ? అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Mohammed Shami, Deepti Sharma: భారత స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ.. ఉమెన్‌ క్రికెటర్‌ దీప్తి శర్మ రిక్వెస్ట్‌ను ఓకే చేశాడు. ఇంతకీ ఆ రిక్వెస్‌ ఏంటి ? అనే విషయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ షమీ.. ప్రస్తుతం భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే పనిలో ఉన్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుత ప్రదర్శన కనబర్చిన షమీ.. ఆ మెగా టోర్నీ తర్వాత గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. కాలి గాయానికి సర్జరీ చేయించుకుని.. నిదానంగా కోలుకొని.. ఈ మధ్య బౌలింగ్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రీ హ్యాబ్‌ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ముంబై వేదికగా జరిగిన సియట్‌ క్రికెట్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు షమీ. ఆ సమయంలో భారత మహిళ జట్టు క్రికెటర్‌ దీప్తి శర్మ చేసిన ఓ చిన్న రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేశాడు షమీ.

ఇంతకీ దీప్తి శర్మ చేసిన రిక్వెస్ట్‌ ఏంటంటే.. షమీ హాజరైన అవార్డ్‌ ఫంక్షన్‌కు దీప్తి శర్మ సైతం వచ్చింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి వచ్చాడు. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ షమీతో ఫొటో కావాలని తన సోదరిని కోరాడు. అవార్డ్‌ సెర్మనీకి వెళ్లే ఎంట్రన్స్‌లో ఫొటో షూట్‌ కోసం ఏర్పాటు చేసిన స్పాట్‌లో తన సోదరుడితో ఒక ఫొటో దిగాలని కోరింది. దీప్తి కోరిక మేరకు షమీ.. ఆమె సోదరుడితో ఫొటోకు ఫోజులిచ్చాడు. ఇలా టీమిండియా ఉమెన్‌ క్రికెటర్‌ రిక్వెస్ట్‌కు ఓకే చెప్పి హ్యాపీ చేశాడు.

అయితే.. షమీ బంగ్లాదేశ్‌తో వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్‌లో పాల్గొంటాడని అంతా భావించారు. సెలెక్టర్లు సైతం ఇదే విషయాన్ని గతంలో ప్రకటించారు. కానీ, షమీ ఇంకా పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌ సాధించలేదని.. బహుషా అతను న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌తో టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చే సూచనలు ఉన్నాయి. అంతకంటే ముందు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడానికి షమీ.. రంజీ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడనున్నాడు. బెంగాల్‌ తరఫున బరిలోకి దిగేందుకు షమీ రెడీ అవుతున్నాడు. మరి షమీ కమ్‌బ్యాక్‌తో పాటు, దీప్తి శర్మ చెప్పిన వెంటనే ఆమె సోదరుడితో ఫొటో దిగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments