SNP
Mohammed Shami, Virat Kohli: టీమిండియాలో బిల్డప్ బాబాయ్ ఎవరో చెప్పేశాడు స్టార్ బౌలర్ షమీ. అలాగే స్టైలిష్, స్కేరీ ఇలా పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ.. ఒక్కో క్రికెటర్ పేరు చెప్పాడు. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Mohammed Shami, Virat Kohli: టీమిండియాలో బిల్డప్ బాబాయ్ ఎవరో చెప్పేశాడు స్టార్ బౌలర్ షమీ. అలాగే స్టైలిష్, స్కేరీ ఇలా పలు ఆసక్తికర విషయాలపై స్పందిస్తూ.. ఒక్కో క్రికెటర్ పేరు చెప్పాడు. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
టీమిండియా స్టార్ బౌలర్ మొహమ్మద్ షమీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ శుభంకర్ మిశ్రాతో జరిగిన పొడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అందులో భాగంగా కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు. తన కెరీర్‌తో పాటు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించిన షమీ.. భారత జట్టులో ఉండే ఆటగాళ్ల గురించి మాట్లాడుతూ ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చాడు. అందులో భాగంగా టీమిండియాలో బిల్డప్ బాబాయ్ అంటూ బడాయి మాటలు ఎవరు చెప్తారు, కింగ్ అనగానే ఎవరు గుర్తుకు వస్తారు, జట్టులో మోస్ట్ స్టైలిష్ ప్లేయర్ ఎవరు? ఇలా ఎన్నో విషయాలు వెల్లడించాడు.
ప్రస్తుతం షమీ చెప్పిన విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. జర్నలిస్ట్ మిశ్రా అడిగిన వాటికి వన్ వర్డ్‌లో సమాధాన చెబుతూ.. కింగ్ అనే మాట వింటే ఎవరు గుర్తుకు వస్తారంటే.. విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. అలాగే స్పీడ్ అంటే జడేజా పేరు చెప్పాడు. దేశీ బాయ్ అంటే తన పేరు చెప్పుకున్నాడు. గోల్డెన్ ఆర్మ్- మహేంద్ర సింగ్ ధోని, లప్పేబాజ్ – సిరాజ్, ఫేకు(గొప్పలు చెప్పేవాడు) బిల్డయ్ బాబాయ్ అంటే జడేజా పేరు చెప్పాలు షమీ. అలాగే స్కేరీ అంటే జస్ప్రీత్ బుమ్రా అని, స్టైలిష్ అంటే విరాట్ కోహ్లీ అని పేర్కొన్నాడు. అయితే.. ఇందులో జడేజా గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇవే కాకుండా హార్ధిక్ పాండ్యాతో వివాదం, రోహిత్ శర్మ కెప్టెన్సీ, టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇలా పలు విషయాలపై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం గాయం నుంచి రికవరీ అవుతూ.. ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్న షమీ.. శ్రీలంకతో సిరీస్ తర్వాత.. టీమిండియా ఆడే టెస్టు సిరీస్‌లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత షమీ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగలేదు. ఆ వరల్డ్ కప్‌లో షమీ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. తొలి నాలుగు మ్యాచ్‌లు ఆడకపోయినా.. ఆ తర్వాత టీమ్‌లోకి వచ్చి సంచలన బౌలింగ్‌తో రాణించాడు. వరల్డ్ కప్‌లో నొప్పిని తట్టుకుని ఆడిన షమీ.. ఆ తర్వాత పూర్తిగా గాయం నుంచి రికవరీ అవ్వడంపైనే ఫోకస్ పెట్టాడు. మరి జడేజా బిల్డప్ బాబాయ్ అంటూ షమీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.