టీమిండియా కోచ్‌గా.. ఆ సిరీస్‌ ఓటమి బాధించింది: ద్రవిడ్‌

Rahul Dravid, IND vs SA: టీమిండియా రెండున్నరేళ్ల పాటు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు ద్రవిడ్‌, తన కోచింగ్‌ టైమ్‌లో బాధపడిన విషయం గురించి వెల్లడించాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం​..

Rahul Dravid, IND vs SA: టీమిండియా రెండున్నరేళ్ల పాటు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు ద్రవిడ్‌, తన కోచింగ్‌ టైమ్‌లో బాధపడిన విషయం గురించి వెల్లడించాడు. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం​..

టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. రెండున్నరేళ్ల పాటు భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా పనిచేశాడు. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024తో తన పదవీ కాలం ముగియడంతో బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. టీమిండియాను టీ20 ఛాంపియన్‌గా నిలిపి హెడ్‌ కోచ్‌ పదవికి ఘనంగా వీడ్కోలు పలికాడు ద్రవిడ్‌. 2021లో హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. తన కోచింగ్‌లో ఇండియాను విజయవంతంగా నడిపించాడు.

ద్రవిడ్‌ కోచింగ్‌లో టీమిండియా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సెమీ ఫైనల్‌, వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌ ఆడింది. వాటితో అనేక సిరీస్‌లు గెలిచింది. అలాగే 2023లో ఆసియా కఫ్‌ కూడా గెలిచింది రోహిత్‌ సేన. ఈ ఘనతలతో పాటు రాహుల్‌ ద్రవిడ్‌ కోచింగ్‌లోని టీమిండియా.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022 సమీస్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. అలాగే వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓటమి, డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి ఉన్నాయి.. అయితే ఇవేవి ద్రవిడ్‌ను బాధపెట్టలేదు.

ఓ టెస్ట్‌ సిరీస్‌ ఓటమే తన కోచింగ్‌ కెరీర్‌లో లోయెస్ట్‌ పాయింట్‌ అంటూ రాహుల్‌ ద్రవిడ్‌ తాజాగా వెల్లడించాడు. 2021-22లో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో విజయం కూడా సాధించింది. దీంతో.. సౌతాఫ్రికాలో మొట్టమొదటి టెస్టు సిరీస్‌ గెలిచే అవకాశం టీమిండియాకు వచ్చింది. కానీ, తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలై.. 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఆ సిరీస్‌కు గాయంతో రోహిత్‌ దూరం అయ్యాడు. కోహ్లీ కూడా రెండో టెస్టు ఆడలేదు. దీంతో.. టీమిండియా మొట్టమొదటి సారి సౌతాఫ్రికాతో సౌతాఫ్రికాలో సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలనుకున్న ద్రవిడ్‌ ఆశలు.. నెలవేరలేదు. అదే తన కోచింగ్‌ కెరీర్‌లో చాలా బాధించిన అంశం అంటూ ద్రవిడ్‌ వెల్లడించాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments