వీడియో: కృష్ణ శాస్త్రి కాళ్లు మొక్కిన కుల్దీప్‌ యాదవ్‌! ఎవరీ బాబా? అంత పవర్‌ ఫులా?

Kuldeep Yadav, Bageshwar Dham, Dhirendra Shastri: ఇటీవలె టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన జట్టులో సభ్యుడైన క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. తాజాగా ఓ బాబాను దర్శించుకుని.. ఆయన కాళ్లు మొక్కాడు. ఆ బాబా ఎవరు? అతని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Kuldeep Yadav, Bageshwar Dham, Dhirendra Shastri: ఇటీవలె టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచిన జట్టులో సభ్యుడైన క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. తాజాగా ఓ బాబాను దర్శించుకుని.. ఆయన కాళ్లు మొక్కాడు. ఆ బాబా ఎవరు? అతని వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా యువ క్రికెటర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తాజాగా బాగేశ్వర్‌ ధామ్‌ను సందర్శించాడు. అలాగే బాగేశ్వర్‌ ధామ్‌ సర్కార్‌గా ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని కలిసి.. ఆయన కాళ్లు మొక్కి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇటీవలె టీ20 వరల్డ్ కప్‌ 2024 గెలిచిన కుల్దీప్‌ యాదవ్‌.. ఆ విజయం తర్వాత తొలిసారి ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని దర్శించుకున్నాడు. అయితే.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కుల్దీప్‌ యాదవ్‌.. ఈ బాబా కాళ్లు మొక్కడంతో ఎవరీ బాబా? కుల్దీప్‌ లాంటి ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌ కాళ్లు మొక్కుతున్నాడు అంటే ఆయన అంత పవర్‌ ఫులా? అంటూ నెటిజన్లు సెర్చ్‌ చేస్తున్నారు. ఆ బాబా గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో ఉన్న బాగేశ్వర్‌ ధామ్‌లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి పీఠాధీశ్వరుడు. ఈయనను బాగేశ్వర్‌ ధామ్‌ సర్కార్‌ లేదా మహారాజ్‌ అని కూడా పిలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక ఒక హిందూ ఆధ్యాత్మిక గురువు. అతి చిన్న వయసులోనే పెద్ద ఆధ్యాత్మిక గురువుగా ఎదిగాడు. రామాయణం, మహాభారతం.. తన భక్తులకు చదివి వివరిస్తూ ఉంటారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి 1996 జూలై 4న ఛతర్‌పూర్‌ జిల్లాలోని గడ గ్రామంలో జన్మించాడు. సరోజ్ గార్గ్, రామ్ కృపాల్ గార్గ్ దంపతుల కుమారుడు.

ఈయన రామభద్రాచార్యుల శిష్యుడు. మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ జిల్లాలోని గడ గ్రామంలో హనుమంతుడికి అంకితం చేసిన హిందూ ఆధ్యాత్మిక క్షేత్రమైన బాగేశ్వర్ ధామ్‌కు పీఠాధీపతిగా ఉన్నాడు. ప్రతి మంగళ, శనివారాల్లో ఈ ధామ్‌లో ఒక దివ్య దర్బార్‌ను నిర్వహిస్తారు. జులై 23న నిర్వహించిన దర్బార్‌లోనే కుల్దీప్‌ యాదవ్‌.. ఈ బాబాను దర్శించుకున్నాడు. ఈ బాగేశ్వర్‌ ధామ్‌ మహారాజ​్‌ హనుమంతుడి నుంచి పొందిన శక్తులతో ప్రజల శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక బాధలన్నింటినీ నయం చేస్తాడని అక్కడి ప్రజలు చాలా మంది నమ్ముతుంటారు. అయితే.. గతంలో కూడా కుల్దీప్‌ యాదవ్‌ ఈ బాగేశ్వర్‌ బాబాను దర్శించుకున్న విషయం తెలిసిందే. మరి కుల్దీప్‌ ఈ బాబా కాళ్లు మొక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments