టీమిండియాలోకి కొత్త ఆటగాళ్లు వస్తే.. రోహిత్‌ శర్మ చేసేది ఇదే: కుల్దీప్‌ యాదవ్‌

టీమిండియాలోకి కొత్త ఆటగాళ్లు వస్తే.. రోహిత్‌ శర్మ చేసేది ఇదే: కుల్దీప్‌ యాదవ్‌

Kuldeep Yadav, Rohit Sharma: టీమిండియా స్టార్‌ స్పిన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. టీ20 వరల్డ్‌ కప్‌ ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Kuldeep Yadav, Rohit Sharma: టీమిండియా స్టార్‌ స్పిన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌.. టీ20 వరల్డ్‌ కప్‌ ముందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రస్తుతం టీమిండియా ఫోకస్‌ మొత్తం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌ కప్‌ 2024పైనే ఉంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు అమెరికా చేరుకుని ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నారు. ఒక్క విరాట్‌ కోహ్లీ తప్ప మిగతా ప్లేయర్లంతా అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతూ.. ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. కోహ్లీ కూడా త్వరలోనే వారిలో జతకలుస్తాడు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్‌ బౌలర్‌, టీ20 వరల్డ్ కప్‌ టీమ్‌లో ఉన్న ప్లేయర్‌ కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా జట్టులోకి కొత్త ప్లేయర్లు వచ్చిన సమయంలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ ఎలా ప్రవర్తిస్తాడు? వారిలో ఎలా ఉంటాడు అనే విషయాలను వెల్లడించాడు.

కుల్దీప్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ‘రోహిత్ అన్న యువ క్రికెటర్లకు చాలా మద్దతుగా ఉంటాడు, కొత్త ఆటగాడు టీమ్‌లోకి వచ్చినప్పుడు, అతను హృదయపూర్వకంగా మద్దతు ఇస్తాడు. కొత్త ఆటగాళ్లలో చాలా ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తాడు. అలాగే నా బౌలింగ్‌ను రోహిత్‌ చాలా బాగా అర్థం చేసుకున్నాడు. అతను ఇచ్చే సలహాలు సూచనలు కూడా నాకు చాలా సహాయపడ్డాయి. నాకు రోహిత్‌ సపోర్ట్‌ ఎప్పుడూ ఉంటుంది’ అని కుల్దీప్‌ యాదవ్‌ అన్నాడు. అతను చెప్పినట్లు.. రోహిత్‌ శర్మ చాలా మంది యువ క్రికెటర్లతో చాలా క్లోజ్‌గా ఉంటాడు. టెస్టుల్లో టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చిన ధృవ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ వంటి వారికి హిట్‌మ్యాన్‌ ఎంతో అండగా ఉండి.. వారిలో కాన్పిడెన్స్‌ నింపాడు.

అలాగే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో కచ్చితంగా సెలెక్ట్‌ అవుతాడు అనుకున్న రింకూ సింగ్‌.. ఎంపిక కాకపోవడంతో అతను చాలా బాధపడ్డాడు. టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమ్‌ సెలెక్షన్‌ పూర్తి అయిన తర్వాత.. ఐపీఎల్‌తో బిజీగా ఉన్న రింకూ సింగ్‌ ఎక్కడ బాధపడతాడో అని అతని దగ్గరికి వెళ్లి.. నిరాశపడాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ఇంకా చాలా అవకాశాలు వస్తాయని రింకూను ఓదార్చి అతనిలో కాన్ఫిడెన్స్‌ నింపాడు. అప్పటి వరకు డల్‌గా ఉన్న రింకూ సింగ్‌.. రోహిత్‌ శర్మ అతనితో మాట్లాడిన తర్వాత.. రింకూలో స్పష్టమైన మార్పు కనిపించింది. మరి రోహిత్‌ గొప్పతనం గురించి, యువ క్రికెటర్లతో అతను మెసలే విధానం గురించి కుల్దీప్‌ యాదవ్‌ ఇంత గొప్పగా చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments