నేను ఏం చేసినా ట్రోల్‌ చేసే వాళ్లు! కేఎల్‌ రాహుల్‌ ఎమోషనల్‌ కామెంట్స్‌

KL Rahul Koffee with Karan Contravecy: ఓ ఐదేళ్ల క్రితం తన జీవితంలో చోటు చేసుకున్న ఓ షాకింగ్‌ ఘటన గురించి తాజాగా కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

KL Rahul Koffee with Karan Contravecy: ఓ ఐదేళ్ల క్రితం తన జీవితంలో చోటు చేసుకున్న ఓ షాకింగ్‌ ఘటన గురించి తాజాగా కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా స్టార్ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ తన జీవితంలో జరిగిన ఓ షాకింగ్‌ ఘటన తాజాగా స్పందించాడు. బాలీవుడ్‌ నిర్మాత కరన్‌ జోహార్‌ టీవీ షో ‘కాఫీ విత్‌ కరన్‌’లో పాల్గొని.. కాంట్రవర్సీ కామెంట్స్‌ చేసి.. టీమిండియా నుంచి సస్పెండ్‌ అవ్వడంపై తాజాగా రాహుల్‌ స్పందించాడు. అది తన జీవితంలో ఎంత భయపడిన సంఘటన అని గుర్తుచేసుకున్నాడు. ఆ తర్వాత.. తాను ఎంతో మారిపోయానని కూడా రాహుల్‌ వెల్లడించాడు. టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యాతో కలిసి ఓ షోలో పాల్గొన్న కేఎల్‌ రాహుల్‌.. అమ్మాయిల గురించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. వారిపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వ్యక్తం అయ్యాయి.

ఇండియాలో వీరి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్న సమయంలో కేఎల్‌ రాహుల్‌, హార్ధిక్‌ పాండ్యా ఆస్ట్రేలియా టూర్‌లో ఉన్నారు. వారిద్దరినీ టీమ్‌ నుంచి సస్పెండ్‌ చేసిన బీసీసీఐ.. వెంటనే ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి పంపించింది. అప్పటి నుంచి తనపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్‌ జరిగిందని, తాను నిల్చున్నా, కూర్చున్నా.. తనపై ట్రోలింగ్‌ జరిగేదంటూ రాహుల్‌ వెల్లడించాడు. ఆ ఘటన తర్వాత తన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని, నేను ఒక సాఫ్ట్‌ స్పోకెన్‌ పర్సన్‌లా మారిపోయానని తెలిపాడు.

తన స్కూల్‌ డేస్‌లో కూడా తనెప్పుడూ పనిష్మెంట్‌ను ఎదుర్కొలేదని.. అలాంటి బీసీసీఐ తనను టీమ్‌ నుంచి సస్పెండ్‌ చేసిన సమయంలో ఏం చేయాలో కూడా తనకు అర్థం కాలేదని రాహుల్‌ తెలిపాడు. ఆ షాకింగ్‌ ఘటన తర్వాత.. బీసీసీఐ సస్పెన్షన్‌ ఎత్తివేశాక తిరిగి టీమిండియాలోకి వచ్చిన రాహుల్‌.. టీమ్‌లో ఒక కీ ప్లేయర్‌గా మారిపోయాడు. వైస్‌ కెప్టెన్సీ కూడా దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో సైతం మంచి ప్రదర్శన చేశాడు. కానీ, టీ20 క్రికెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేదు. దాంతో వైస్‌ కెప్టెన్సీ కోల్పోయాడు. సెప్టెంబర్‌ 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌ కోసం.. రెడీ అవుతున్నాడు రాహుల్‌. అంతకంటే ముందు దేశవాళి క్రికెట్‌లో దులీప్‌ ట్రోఫీలో ఆడనున్నాడు రాహుల్‌. మరి 2019లో సస్పెన్షన్‌కు గురి కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments