అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ.. భక్తి చాటుకున్న ఇంగ్లండ్‌ క్రికెటర్‌!

Kevin Pietersen: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఒక్క పోస్ట్‌తో భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అతను చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Kevin Pietersen: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ ఒక్క పోస్ట్‌తో భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అతను చేసిన ఒక పోస్ట్‌ వైరల్‌గా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

అయోధ్య రామమందిరంలో ఈ నెల 22న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దాదాపు 500 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం నిర్మించాలని హిందువులు డిమాండ్‌ చేస్తున్నారు. దాని కోసం ఎన్నో పోరాటాలు, వివాదాలు కూడా జరిగాయి. ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పుతో అయోధ్యలోని రామజన్మ భూమిలో రామ మందిరం నిర్మాణం అవుతుంది. అయితే.. ముందుగా ఆలయం కింది భాగంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను నిర్వహించారు. దీంతో.. దేశం మొత్తం రామ నామ స్మరణతో మారుమోగిపోయింది.

దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ మహత్తర​ కార్యంలో భాగమయ్యారు. దాదాపు 2 వేల మంది సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు, సెలబ్రేటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు. అలాగే కొన్ని కోట్ల మంది టీవీల్లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చూసి తరించిపోయారు. ఒక్క ఇండియాలోనే కాదు.. విదేశాల్లో ఉన్న హిందువులు కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సమయంలో ర్యాలీలు, భజనలతో పండుగ వాతావరణంలో గడిపారు. ఇక హిందువులే కాకుండా.. పలువురు ఇతర మత క్రికెటర్లు సైతం రామ మందిరం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠపై స్పందించడం విశేషం.

వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్‌ గురించి. ఈ దిగ్గజ మాజీ క్రికెటర్‌.. అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ, రామ మందిర ప్రారంభోత్సవంపై స్పందిస్తూ.. జై శ్రీరామ్‌ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ పెట్టాడు. పైగా మూడు నామాల బొట్టుతో ఉన్న తన ఫొటోను ఫేర్ చేయడంతో.. పీటర్సన్‌ ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ ఫొటోను భారత క్రికెట్‌ అభిమానులు షేర్‌ చేస్తూ.. దేశం మొత్తం రామ నామ స్మరణతో ఊగిపోతున్న సమయంలో పీటర్సన్‌ ఇలా ఇండియన్స్‌ను ఉత్సాహపరిచేలా.. జైశ్రీరామ్‌ నిదానంతో పోస్ట్‌ చేయడం సంతోషంగా ఉందంటూ పేర్కొన్నారు. మరి పీటర్స్‌న్‌ చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments