Tirupathi Rao
Jay Shah Will Be The Next Chairman Of ICC: బీసీసీఐ కార్యదర్శి జై షాను తర్వాతి ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జై షా అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించారు.
Jay Shah Will Be The Next Chairman Of ICC: బీసీసీఐ కార్యదర్శి జై షాను తర్వాతి ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నుకున్నారు. అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జై షా అరుదైన రికార్డును కూడా తన పేరిట లిఖించారు.
Tirupathi Rao
నవంబర్ 30తో ఐసీసీ ఛైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే పదవీకాలం ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరు ఆ పదవిలోకి రాబోతున్నారు అనే ఉత్కంఠ అయితే నెలకొంది. మూడోసారి ఆ పదవిలో కొనసాగేందుకు గ్రెగ్ బార్ క్లే విముఖత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కొత్త ఛైర్మన్ కోసం వెతుకులాట తప్పలేదు. అయితే ఐసీసీ ఛైర్మన్ పదవికి కేవలం జై షా మాత్రమే నామినీగా ఉన్నారు. అందుకే ఆయన ఎంపిక అనేది లాంఛనం అయిపోయింది. అందరి మద్దతుతో జై షా అయితే ఐసీసీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ధృవీకరించింది. జై షా ఎంపిక వివరాలు తెలియజేస్తూ.. ఐసీసీ కథనాన్ని ప్రచురించింది.
ఐసీసీ ఛైర్మన్ గా ఎంపిక కావడంతోనే జై షా ఒక రికార్డును తన పేరిట వేసుకున్నారు. అదేంటంటే.. ఇప్పటి వరకు ఐసీసీ పగ్గాలు అందుకున్న వారిలో యంగెస్ట్ ఛైర్మన్ గా 35 ఏళ్ల జై షా నిలవనున్నారు. ఇప్పటి వరకు ఇండియా నుంచి ఐసీసీకి హెడ్ గా బాధ్యతలు నిర్వర్తించిన వారిలో జై షా ఐదో వ్యక్తిగా నిలిచారు. జగ్మోహన్ దాల్మియా(ప్రెసిడెంట్), షరద్ పవార్, ఎన్ శ్రీనివాసన్, షషాంక్ మనోహర్ తర్వాత.. జై షా ఈ బాధ్యతలను అందుకోనున్నారు. 2020లో గ్రెగ్ బార్ క్లే తొలిసారి ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2022లో మరోసారి గ్రెగ్ బార్ క్లేనే ఎంచుకున్నారు. రూల్స్ ప్రకారం గ్రెగ్ మూడోసారి కూడా ఛైర్న్ బాధ్యతలను నిర్వర్తిచవచ్చు. అదే ఆఖరిసారి అవుతుంది. కానీ, గ్రెగ్ మాత్రం తాను ఈ బాధ్యతలను అందుకునేందుకు సిద్ధంగాలేను అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జై షా తర్వాతి ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఆయన డిసెంబర్ 1 నుంచి ఐసీసీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.