SNP
Jay Shah, BCCI, ICC Chairman, Amit Shah: ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా మరో మూడు నెలల్లో ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒక స్టాక్ బ్రోకర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే వ్యక్తిగా ఎదిగిన జైషా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Jay Shah, BCCI, ICC Chairman, Amit Shah: ప్రస్తుతం బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జైషా మరో మూడు నెలల్లో ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఒక స్టాక్ బ్రోకర్‌గా కెరీర్ మొదలుపెట్టి.. ప్రపంచ క్రికెట్‌ను శాసించే వ్యక్తిగా ఎదిగిన జైషా లైఫ్ స్టోరీ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
కొన్నేళ్లుగా భారత క్రికెట్‌ను శాసిస్తున్న వ్యక్తి జైషా. బీసీసీఐ(బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) కార్యదర్శిగా క్రికెట్ అభిమానులందరికీ సుపరిచతమే. బీజేపీ అగ్రనేత, ప్రస్తుతం భారత హోం మంత్రి అమిత్ షా కుమారుడిగానే చాలా మంది జైషా తెలుసు. కానీ, బీసీసీఐలోకి రాకముందు ఆయనకు క్రికెట్‌తో అనుబంధం ఉంది. నిజానికి చిన్న వయసులోనే క్రికెట్ అవ్వాలని కలలు కన్నాడు.. కానీ, ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ను శాసించే వ్యక్తిగా ఎదిగాడు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి జై షా ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సందర్భంగా జైషా జీవితం గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బీజేపీ అగ్ర నేత అమిత్ షా – సోనాల్ షా దంపతులకు 1988 సెప్టెంబర్ 22న జన్మించాడు జై షా. వీళ్లది ట్రెడిషనల్ గుజరాతీ కుటుంబం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన జై షాకు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం. తాను కూడా గొప్ప క్రికెటర్ అవ్వాలని బాల్యం నుంచే కలలు కనేవాడు. అందుకోసం ఏకంగా.. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ జైయేంద్ర సెహగల్ వద్ద కోచింగ్ కూడా తీసుకున్నాడు. కానీ, ఏమైందో ఏమో కానీ.. తర్వాత చదువుల్లో పడిపోయాడు. అహ్మదాబాద్‌లోని నిర్మా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు.
బీటెక్ పూర్తి చేసిన తర్వాత.. 2003లో కుటుంబానికి చెందిన పీవీసీ పైపులు బిజినెస్ కంపెనీలో చేరాడు. ఆ తర్వాత.. కొన్ని నెలలు స్టాక్ బ్రోకర్‌గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత.. తండ్రి అమిత్ షా అడుగుజాడల్లోనే రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. కానీ, మళ్లీ ఎందుకో తిరిగి వ్యాపారం రంగం వైపు మల్లాడు. 2004లో టెంపుల్ ఎంటప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించాడు.
ఒక వైపు వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తూనే.. మరో వైపు క్రికెట్ అడ్మిస్ట్రేషన్‌లోకి ప్రవేశించాడు జైషా. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చేరాడు. 2013లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. జైషా గుజరాత్ స్టేట్ క్రికెట్ బోర్డ్‌లో జాయింట్ సెక్రటరీగా ఉన్న సమయంలోనే ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం అహ్మాదాబాద్‌లో జరిగింది.
2015లో జైషా.. రిషితా పటేల్‌ను గుజరాతీ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నాడు. రిషితా.. జై షా క్లాస్‌మేట్. కాలేజీలో వీరిద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఇద్దరు ఒక్కటయ్యారు. వీరికి 2017లో రుద్రి అనే పాప జన్మించింది.
మెంబర్ ఆఫ్ ది ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ కమిటీ ఆఫ్ ది బోర్డ్‌గా జై షా 2015లో బీసీసీఐలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒకవైపు బీసీసీఐలో మెంబర్‌గా కొనసాగుతూనే.. మరోవైపు తన వ్యాపార కార్యకలాపాలను కూడా కొనసాగించాడు. 2015లో కుసుమ్ ఫిన్‌సర్వ్ అనే స్టాక్ ట్రేడింగ్ అండ్ మార్కెటింగ్ కన్సల్టెన్సీలో 60 శాతం వాటను కొనుగోలు చేశాడు. కానీ, 2016లో తన ఓన్ కంపెనీ ‘టెంపుల్ ఎంటప్రైజెస్ ప్రై.లి’ని మూసివేశాడు.
2019 సెప్టెంబర్‌లోలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశాడు. అదే నెలలో బీసీసీఐ సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో కలిసి.. బీసీసీఐని సమర్థవంతంగా ముందుకు నడిపాడు. 2021లో ఏసీసీ(ఏషియా క్రికెట్ కౌన్సిల్) ఛైర్మన్ కూడా అయ్యాడు జైషా. ఇక గంగూలీ పదవీ కాలం ముగిసిన తర్వాత.. ఇండియన్ క్రికెట్ అంటే జై షాగా మారిపోయింది పరిస్థితి. భారత క్రికెట్ జై షా కనుసన్నల్లో కొనసాగింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా 2024లో టీ20 వరల్డ్ కప్ గెలుస్తుందని నమ్మి, ఆ విషయాన్ని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి జైషానే. ఆయన చెప్పినట్లే.. రోహిత్ సేన 2024 జూన్‌లో టీ20 ఛాంపియన్‌గా అవతరించింది.
జైషా హయాంలోనే ఐపీఎల్‌కు అత్యధిక లాభాలు వచ్చాయి. బ్రాడ్ కాస్టింగ్ రైట్స్‌ను రూ.48,390 వేల కోట్లకు అమ్మి.. ప్రపంచంలోనే సెకండ్ బిగ్ స్పోర్ట్స్ ఈవెంట్‌గా ఐపీఎల్‌ను నిలిపిన ఘనత జై షాకు దక్కింది. దాంతో పాటు.. పురుష క్రికెటర్లతో సమానంగా భారత మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇచ్చేలా చేయడంలో కూడా జై షా కీలక పాత్ర పోషించాడు. ఇది భారత క్రికెట్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక ఘట్టంగా చెప్పుకోవచ్చు. భారత స్టార్ క్రికెటర్లు సైతం డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే అనే రూల్ తెచ్చిన క్రెడిట్ కూడా అతనికే దక్కుతుంది. బీసీసీఐ సెక్రటరీగా రెండో సారి, ఏసీసీ ఛైర్మన్‌గా రెండో సారి కొనసాగుతున్న జైషా.. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి ఐసీసీ ఛైర్మన్‌గా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. వరల్డ్ క్రికెట్‌కు బాస్‌గా వెళ్తున్న జైషా.. ప్రపంచ క్రికెట్‌లో మోస్ట్ పవర్ ఫుల్ వ్యక్తిగా ఉన్నారు.
జై షా ఆధ్వర్యంలో నడిచిన ‘టెంపుల్ ఎంటర్‌ప్రజెస్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే ట్రేడింగ్ కంపెనీకి.. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయిన ఏడాది లోపే ఏకంగా 16 వేల రెట్లు రెవెన్యూ వచ్చినట్లు ఆరోపిస్తూ.. ది వైర్ అనే మీడియా సంస్థ జై షాపై కథనం వెలువరించింది. దీనిపై జై షా సీరియస్ అవుతూ.. 2017 అక్టోబర్‌లో ‘ది వైర్’పై క్రిమినల్ డిఫమేషన్ కేసు వేశాడు. ఆ వార్త రాసిని ఆథర్‌పై, అలాగే మీడియా సంస్థకు ఎడిటర్లపై రూ.100 కోట్ల పరువునష్టం దావా వేశాడు. ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది. అలాగే.. అసలు క్రికెట్ అంటే ఏంటో తెలియని వ్యక్తి, సరిగ్గా క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం రాని జై షా.. బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడు? కేవలం వాళ్ల నాన్న సెంట్రల్ మినిస్టర్ అవ్వడం ద్వారానే ఆయనకు బీసీసీఐలో అంత పెద్ద పదవీ వరించిందనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటి దాటుకుంటూ.. చిన్నతనంలో క్రికెటర్ అవ్వాలని కలలు కన్న వ్యక్తి.. ఇపుపడు ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదిగాడు. మరి జై షా ప్రొపెషనల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.