Somesekhar
టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎవ్వరకీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ఈ యార్కర్ల కింగ్. ఆ వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎవ్వరకీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు ఈ యార్కర్ల కింగ్. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో జస్ప్రీత్ బుమ్రాది కీలకపాత్ర. లీగ్ మ్యాచ్ ల్లో లో స్కోరింగ్ మ్యాచ్ లను కాపాడింది బౌలర్లే. అందులో ఈ యార్కర్ల కింగ్ ది ప్రత్యేక పాత్ర. ఇక ఈ మెగాటోర్నీలో 8 మ్యాచ్ లు ఆడిన బుమ్రా 15 వికెట్లు తీసి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును అందుకున్నాడు. దాంతో పాటుగా ఓ అరుదైన, ఇప్పటి వరకు ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆ ఘనత గురించి తెలిస్తే.. నిజంగా మీరు షాక్ అవుతారు. ఆ వివరాల్లోకి వెళితే..
జస్ప్రీత్ బుమ్రా.. యార్కర్ల కింగ్ గా ప్రపంచ క్రికెట్ పై తనదైన ముద్రవేశాడు. డెత్ ఓవర్లలో పరుగులు కాపాడటంలో బుమ్రాను మించిన బౌలర్ లేడంటే.. అతిశయోక్తి కాదు. తాజాగా ముగిసిన వరల్డ్ కప్ ను టీమిండియా గెలుచుకోవడంలో ఈ స్పీడ్ స్టర్ ది చిరస్మరణీయ పాత్ర. ఇక ఈ ప్రపంచ కప్ లో 8 మ్యాచ్ ల్లో 29.4 ఓవర్లు వేసి.. 8.27 సగటుతో 15 వికెట్లు నేలకూల్చాడు. దాంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును దక్కించుకున్నాడు. దీంతో ఓ అరుదైన రికార్డ్ ను నమోదు చేశాడు. అదేంటంటే?
టీ20 వరల్డ్ కప్ లో ఒక్క పరుగు కూడా చేయకుండా.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును దక్కించుకున్న ఏకైక ప్లేయర్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఇలా ఏ ప్లేయర్ కూడా అవార్డ్ ను దక్కించుకోలేదు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా బుమ్రా నిలిచాడు. అయితే ఈ వరల్డ్ కప్ లో బుమ్రాకు బ్యాటింగ్ చేసే అవకాశం ఒకే ఒక్కసారి వచ్చింది. పాకిస్తాన్ పై బుమ్రా బ్యాటింగ్ కు దిగగా.. ఆ మ్యాచ్ లో గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు ఈ ఫాస్ట్ బౌలర్. మరి బుమ్రా ఈ టోర్నీలో ఒక్క రన్ చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
All 15 wickets of Jasprit Bumrah in 2024 WT20.🐐pic.twitter.com/071bo4mJDD
— VJ17 (@43off297) June 30, 2024