Jasprit Bumrah: బుమ్రా క్రేజీ రికార్డ్.. కెరీర్​లో గుర్తుండిపోయే ఫీట్!

Jasprit Bumrah Completes 400 International Wickets: టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. కెరీర్​లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ ఫీట్​ను రీచ్ అయ్యాడు. బుమ్రా సాధించిన ఆ మైల్​స్టోన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah Completes 400 International Wickets: టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. కెరీర్​లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ ఫీట్​ను రీచ్ అయ్యాడు. బుమ్రా సాధించిన ఆ మైల్​స్టోన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా తన కెరీర్​లో ఎన్నో రికార్డులు సాధించాడు. ఏటికేడు మరింత దీటుగా బౌలింగ్ చేస్తూ గ్రేటెస్ట్ క్రికెటర్స్ సరసన నిలిచేందుకు వడివడిగా పరుగులు పెడుతున్నాడు. గాయం నుంచి కమ్​బ్యాక్ ఇచ్చాక అతడి బౌలింగ్​లో వాడివేడి మరింత పెరిగాయి. గత కొన్నేళ్లుగా ఎదురులేని బౌలింగ్​తో మోడర్న్ క్రికెట్​ను శాసిస్తున్నాడీ భీకర పేసర్. రికార్డులు వేట సాగిస్తూ దూసుకెళ్తున్న బుమ్రా.. తాజాగా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. కెరీర్​లో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ ఫీట్​ను రీచ్ అయ్యాడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో చరిత్ర సృష్టించాడీ టీమిండియా బౌలర్‌‌. అతడు సాధించిన క్రేజీ రికార్డ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంటర్నేషనల్ క్రికెట్​లో 400 వికెట్ల మైల్​స్టోన్​ను చేరుకున్నాడు బుమ్రా. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్ట్​తో అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఈ మ్యాచ్​ తొలి ఇన్నింగ్స్​లో 4 వికెట్లు పడగొట్టాడు పేసుగుర్రం. హసన్ మహమూద్​ను ఔట్ చేయడం ద్వారా నాలుగొందల వికెట్ల క్లబ్​లో అతడు జాయిన్ అయ్యాడు. వన్డేలు, టెస్టులు, టీ20ల్లో కలుపుకొని 400 వికెట్లు తీసిన ఆరో భారత పేస్ బౌలర్​గా బుమ్రా క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ లిస్ట్​లో లెజెండ్ కపిల్ దేవ్ (687 వికెట్లు) టాప్​లో ఉన్నాడు. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా జహీర్ ఖాన్ (597 వికెట్లు), జవగళ్ శ్రీనాథ్ (551 వికెట్లు), మహ్మద్ షమి (448 వికెట్లు), ఇషాంత్ శర్మ (434 వికెట్లు) ఉన్నారు. అరుదైన ఘనత సాధించడంతో బుమ్రా సంతోషంలో మునిగిపోయాడు. సహచర ఆటగాళ్లతో కలసి దీన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు.

ఇక, చెన్నై టెస్ట్​లో బంగ్లాదేశ్​ను వణికిస్తోంది టీమిండియా. తొలి ఇన్నింగ్స్​లో 376 పరుగులకు ఆలౌట్ అయిన రోహిత్ సేన.. ప్రత్యర్థి జట్టును 149 పరుగులకే పరిమితం చేసింది. పేస్​, స్వింగ్​కు అనుకూలిస్తున్న పిచ్​ మీద భారత బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేశారు. బుమ్రాతో పాటు ఆకాశ్​దీప్, మహ్మద్ సిరాజ్ అదరగొట్టారు. వీళ్లిద్దరూ తలో 2 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచారు. స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా 2 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వికెట్లు తీయకపోయినా కట్టుదిట్టమైన బౌలింగ్​తో అపోజిషన్ టీమ్​ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. బౌలర్లంతా రాణించడంతో టీమిండియాకు మంచి లీడ్ దొరికింది. మన జట్టు ఇప్పుడు 227 పరుగుల ఆధిక్యంతో ఉంది. రోహిత్ సేన డామినేషన్ ఇలాగే కొనసాగితే మ్యాచ్ మూడ్రోజుల్లో ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. బుమ్రా రేర్ ఫీట్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments