Nidhan
Jasprit Bumrah Tease Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు తోపు ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో, బాల్‌తో అతడు అద్భుతాలు చేస్తున్నాడు.
Jasprit Bumrah Tease Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పుడు తోపు ఫామ్‌లో ఉన్నాడు. బ్యాట్‌తో, బాల్‌తో అతడు అద్భుతాలు చేస్తున్నాడు.
Nidhan
టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తోటి ప్లేయర్లతో ఎలా ఉంటాడో తెలిసిందే. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితో అతడు కలసిపోతాడు. కెప్టెన్‌తో పాటు అందరు టీమ్మేట్స్తో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తుంటాడు. అతడు సీరియస్‌గా కనిపించడం చాలా అరుదు. గ్రౌండ్లో అప్పుడప్పుడు మాత్రమే అగ్రెషన్ చూపిస్తుంటాడు. ఇంక డ్రెస్సింగ్ రూమ్‌లో, బయట అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. కుట్టి స్టోరీస్ అంటూ యూట్యూబ్‌లో సహచర క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తుంటాడు. అందులో వాళ్లను మాట్లాడిస్తూనే ఆటపట్టిస్తుంటాడు. తోటి ప్లేయర్లపై జోక్స్ వేయడంలో అశ్విన్ దిట్ట. అలాంటోడితో పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడుకున్నాడు. సీనియర్ అని చూడకుండా అతడి మీద జోక్స్ వేశాడు.
అశ్విన్‌ను బుమ్రాతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆడుకున్నాడు. ‘అన్న ఫర్ ఏ రీజన్’ అంటూ అతడ్ని ఏడిపించారు. ఇది ఫ్లయిట్లో జరిగింది. చెన్నై టెస్ట్ ముగియడంతో రెండో టెస్ట్‌కు ఆతిథ్యం ఇస్తున్న కాన్పూర్‌కు బయల్దేరారు భారత ఆటగాళ్లు. ఈ క్రమంలో ఫ్లయిట్లో పక్క పక్క సీట్లలో కూర్చున్నారీ ముగ్గురు స్టార్లు. ఫోన్లో ఏదో చూస్తూ బిజీగా ఉన్నాడు అశ్విన్. ఆ టైమ్‌లో బుమ్రా ‘అన్న ఫర్ ఏ రీజన్’ అంటూ ఏడిపించాడు. జడేజా కూడా ‘అన్న ఫర్ ఏ రీజన్’ అంటూ ఆడుకున్నాడు. యాష్ అన్న అంటూ కామెడీ చేశాడు. దీంతో అశ్విన్ నవ్వుల్లో మునిగిపోయాడు. వాళ్లు కావాలనే ఇలా చేస్తున్నారని కెమెరాను చూస్తూ అన్నాడు అశ్విన్. తాము ఏడిపించలేదని, అతడ్ని మెచ్చుకుంటూ అలా అన్నామని బుమ్రా తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అశ్విన్‌ను బుమ్రా, జడేజా ఆడుకున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. వాళ్ల మధ్య ఫ్రెండ్షిప్కు ఇది ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఫ్రెండ్స్ మధ్య ఇలాంటివి కామన్ అని, ఒకర్ని మరొకరు ఆటపట్టించడం వల్ల బాండ్ మరింత స్ట్రాంగ్ అవుతుందని చెబుతున్నారు. ఇక, బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఈ ముగ్గురు స్టార్లు రెచ్చిపోయి ఆడారు. బుమ్రా 5 వికెట్లతో ఆ టీమ్ నడ్డి విరిచాడు. జడేజా 5 వికెట్లు తీయడమే గాక 86 పరుగులతో సత్తా చాటాడు. ఇంక అశ్విన్ సంగతి చెప్పనక్కర్లేదు. సెంచరీతో చెలరేగడమే గాక 6 వికెట్లు తీసి గ్రాండ్ విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. అందుకే అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాన్పూర్‌లో స్పిన్ వికెట్‌ను రెడీ చేస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో అక్కడ అశ్విన్-జడ్డూ జోడీ ఇంకెంత రెచ్చిపోయి బౌలింగ్ చేస్తారో చూడాలి.
A journey full of smiles from Chennai to Kanpur 😃👌#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/awGef5q1Jd
— BCCI (@BCCI) September 25, 2024