47 ఏళ్ల వయస్సులో దిగ్గజ క్రికెటర్ థండర్ ఇన్నింగ్స్! ఫోర్లు, సిక్సర్ల వర్షం..

  • Author Soma Sekhar Published - 01:32 PM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 01:32 PM, Sun - 20 August 23
47 ఏళ్ల వయస్సులో దిగ్గజ క్రికెటర్ థండర్ ఇన్నింగ్స్! ఫోర్లు, సిక్సర్ల వర్షం..

ప్రేమకు ఏజ్ తో పనిలేదు.. ప్రేమికుల నుంచి ఎక్కువగా వినిపించే మాట ఇది. ఇప్పుడీ మాట క్రికెట్ కూ వర్తిస్తుందని నిరూపించాడు దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాక్వెస్ కల్లిస్. ఆటకు ఏజ్ తో సంబంధం లేదని నిరూపిస్తూ.. చెలరేగిపోయడు ఈ దిగ్గజ బ్యాటర్. యూఎస్ మాస్టర్ లీగ్ లో భాగంగా టెక్సాస్ ఛార్జర్స్ తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 47 ఏళ్ల వయస్సులో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు కల్లీస్. అతడికి తోడు మిలాంద్ కుమార్ సంచలన ఇన్నింగ్స్ తో దుమ్మురేపడంతో.. కాలిఫోర్నియా నైట్స్ విజయం 49 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జాక్వెస్ కల్లీస్.. ప్రపంచ క్రికెట్ లో నిఖార్సైన ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కల్లీస్ లాంటి ఆల్ రౌండర్ వరల్డ్ క్రికెట్ లో మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంతలా అతడు క్రికెట్ పై తన ముద్రను వేశాడు. రిటైర్మెంట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా గానీ తనలో ఇంకా ఆ వేడి తగ్గలేదని మరోసారి నిరూపించాడు. ప్రస్తుతం జరుగుతున్న యూఎస్ మాస్టర్ లీగ్ లో కాలిఫోర్నియా నైట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు జాక్వెస్ కల్లిస్. ఇక ఈ లీగ్ లో భాగంగా.. తాజాగా టెక్సాస్ ఛార్జర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఈ సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్. తనదైన ట్రేడ్ మార్క్ షాట్స్ తో వింటేజ్ కల్లిస్ ను అభిమానులకు గుర్తుకు తెచ్చాడు.

ఇక ఈ మ్యాచ్ లో 31 బంతులు ఎదుర్కొన్న కల్లిస్ 8 ఫోర్లు, 3 సిక్స్ లతో 64 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడికి తొడుగా తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు మిలాంద్ కుమార్. ఇతడు కేవలం 28 బంతుల్లోనే 76 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. వీరిద్దరి వీర విహారంతో నిర్ణీత 10 ఓవర్లలో కాలిఫోర్నియా జట్టు 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టెక్సాస్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు మాత్రమే చేసింది. ఇక ఈ మ్యాచ్ లో కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని తనలో సత్తా ఇంకా తగ్గలేదని ప్రపంచానికి పరిచయం చేశాడు. మరి 47 ఏళ్ల వయస్సులో కూడా కల్లిస్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: BCCIకి HCA షాక్! మరోసారి వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు?

Show comments