ఇషాన్‌ కిషన్‌కు BCCI గోల్డెన్‌ ఛాన్స్‌! మిస్‌ చేసుకుంటే కెరీర్‌ క్లోజ్‌?

Ishan Kishan, Duleep Trophy 2024, BCCI: టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌కు బీసీసీఐ ఒక గోల్డెన్‌ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అందులో నిరూపించుకోకుంటే.. అతని కెరీర్‌ ఖతమే. మరి ఆ ఛాన్స్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Ishan Kishan, Duleep Trophy 2024, BCCI: టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌కు బీసీసీఐ ఒక గోల్డెన్‌ అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. అందులో నిరూపించుకోకుంటే.. అతని కెరీర్‌ ఖతమే. మరి ఆ ఛాన్స్‌ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌కు బీసీసీఐ గోల్డెన్‌ ఛాన్స్‌ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది కనుక అతను మిస్‌ చేసుకుంటే.. ఇక అతని అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ ముగిసినట్లే అని భావించవచ్చు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 జట్టులో సభ్యుడిగా ఉన్న క్రికెటర్‌.. ఆర్నెళ్లు తిరిగే సరికి.. టీమిండియాలో లేకుండా పోయాడు. జట్టులో స్థానంతో పాటు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కూడా పోగొట్టుకున్నాడు. ఇదంతా అతని స్వయంకృతాపరాధమే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. ఒక యువ క్రికెటర్‌గా టీమిండియాలో మంచి భవిష్యత్తు ఉన్న ఇషాన్.. కెరీర్‌ ఆరంభంలోనే అతి తెలివి ప్రదర్శించాడు.

టీమిండియాలో చోటు దక్కడమే గగనమైనపోయిన సమయంలో.. ఇషాన్‌కు మూడు ఫార్మాట్లలోనూ ఆడే అవకాశం వచ్చింది. వన్డేల్లో డబుల్‌ సెంచరీతో మంచి మార్కులు కూడా కొట్టేశాడు. అలాగే టెస్టుల్లోనూ ఒకటి రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. వన్డే వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీకి కూడా ఎంపియ్యాడు. ఐపీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌ తరఫున మంచి ప్రదర్శనలు చేశాడు. చిన్న వయసులోనూ ఊహించని స్టార్‌డమ్‌ వచ్చేసింది. దీంతో.. ఇషాన్‌కు కళ్లు కాస్త నెత్తికి ఎక్కాయి. టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడకుండా.. రెస్ట్‌ కావాలంటూ.. దుబాయ్‌లో పార్టీలకు, కౌన్‌ బనేగా కరోడ్‌పతి టీవీ షోలకు హాజరయ్యాడు.

ఈ విషయంపై బీసీసీఐ చాలా సీరియస్‌ అయ్యింది. రెస్ట్‌ కావాలని చెప్పి.. పార్టీలకు, షోలకు వెళ్లడంపై ఇషాన్‌ను వివరణ కోరింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతన్ని జట్టు నుంచి తప్పించడంతో పాటు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఇషాన్‌కు మళ్లీ ఇండియాకు ఆడే అవకాశం రాలేదు. కనీసం జింబాబ్వే టూర్‌కు కూడా అతన్ని కనీసం పరిగణలోకి తీసుకోలేదు. దీంతో.. ఇషాన్‌ కెరీర్‌ క్లోజ్‌ అయిపోయినట్లే అని అంతా భావించారు. కానీ, తాజాగా బీసీసీఐ ఈ యువ క్రికెటర్‌కు మరో అవకాశం కల్పించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అదేంటంటే.. బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కి ముందు జరిగే దులీప్‌ ట్రోఫీలో ఆడేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ట్రోఫీలో టీమిండియా స్టార్‌ క్రికెటర్లు కోహ్లీ, రోహిత్‌తో పాటు చాలా మంది ఆడుతున్నారు. ఇషాన్‌కు కూడా అవకాశం ఇవ్వాలని మంచి ప్రదర్శన చేస్తే.. మరోసారి టీమిండియాలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కనుక ఇషాన్‌ విఫలం అయితే.. ఇక అతను టీమిండియాలోకి తిరిగి రావడం కష్టమే అని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. మరి ఇషాన్‌కు బీసీసీఐ మరో అవకాశం ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments