టీమిండియాలో చోటు కోల్పోవడంపై తొలిసారి స్పందించిన ఇషాన్‌ కిషన్‌!

Ishan Kishan, Team India: తనను టీమ్‌ నుంచి తప్పించడం, సెంట్రల్‌ కాంట్రాక్ట్ నుంచి తొలగించడంపై ఇషాన్‌ కిషన్‌ తొలిసారి స్పందించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Ishan Kishan, Team India: తనను టీమ్‌ నుంచి తప్పించడం, సెంట్రల్‌ కాంట్రాక్ట్ నుంచి తొలగించడంపై ఇషాన్‌ కిషన్‌ తొలిసారి స్పందించాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఉండాల్సిన ఓ యువ క్రికెటర్‌ ఎవరంటే.. ఇషాన్‌ కిషన్‌ పేరు చెప్పుకోవచ్చు. మంచి టాలెంట్‌ ఉన్న ప్లేయర్‌, నిలబడితే మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్నోడు. కానీ, ఏమైందో ఏమో కానీ.. జట్టుకు దూరం అయ్యాడు. టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు.. వరల్డ్‌ కప్‌ కోసం రెడీ చేస్తున్న టీమ్‌లో ఇషాన్‌ను కీ ప్లేయర్‌గా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భావించినట్లు సమాచారం. కానీ, రెస్ట్‌ కావాలని చెప్పి.. టీవీ షోలు, పార్టీల్లో పాల్గొనడంతో ఇషాన్‌పై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది.

అతనితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌పై కూడా బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ.. జట్టు నుంచి తీసేయడమే కాకుండా సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి కూడా తప్పించింది. నిజానికి ఇషాన్‌ కిషన్‌ సరిగ్గా ఉండి ఉంటే.. కచ్చితంగా టీ20 వరల్డ్‌ కప్‌ స్క్వౌడ్‌లో ఉండేవాడని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. తనను టీమ్‌ నుంచి తీసేయడం, అలాగే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ తొలగించడంపై ఏనాడు స్పందించడని ఇషాన్‌.. తొలిసారి ఆ విషయంపై స్పందిస్తూ.. కాస్త ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు.

ఇషాన్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘నేను రన్స్‌ చేస్తూ.. నన్ను బెంచ్‌కే పరిమితం చేశారు. టీమ్‌గా ఆడే ఆటలో ఇది సహజమే అయినా.. టీమ్‌తో పాటు జర్నీ చేస్తూ నేను అలసిపోయాను. దాంతో నేను రెస్ట్‌ కోరుకున్నాను. అయితే.. అది చాలా మందికి తప్పుగా అర్థమైంది. కానీ, ఆ సమయంలో నా ఆరోగ్యం కూడా సరిగా లేదు. అందుకే విశ్రాంతి కోరాను. ఆ టైమ్‌లో నేను ఎలా ఉన్నానో నా కుటుంబ సభ్యులకు, అలాగే నా సన్నిహితులకు తప్పా ఇంకెవరికీ తెలియదు’ అని ఇషాన్‌ పేర్కొన్నాడు. టీమిండియా ఆడే సిరీస్‌ల నుంచి రెస్ట్‌ తీసుకున్న ఇషాన్‌ కిషన్‌. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి, అలాగే దుబాయ్‌లో పార్టీల్లో పాల్గొన్నట్లు తేలడంతో బీసీసీఐ అతనిపై చర్యలు తీసుకుంది. మరి ఇషాన్‌ టీమిండియాలోకి ఎప్పుడు కమ్‌ బ్యాక్‌ ఇస్తాడో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments