వీడియో: అశ్విన్-కుల్దీప్ మధ్య ఆసక్తికర సన్నివేశం.. మ్యాచ్ కు ఇదే హైలెట్!

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్.. తొలిరోజు ఆటలో కుల్దీప్ యాదవ్-రవిచంద్రన్ అశ్విన్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. ఇది తొలిరోజు ఆటకే హైలెట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్-ఇండియా మధ్య జరుగుతున్న చివరి టెస్ట్.. తొలిరోజు ఆటలో కుల్దీప్ యాదవ్-రవిచంద్రన్ అశ్విన్ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. ఇది తొలిరోజు ఆటకే హైలెట్ గా నిలిచింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ధర్మశాల వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా దుమ్మురేపింది. తొలిరోజు ఆటలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలుత బౌలర్లు చెలరేగితే.. ఆ తర్వాత ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, మణికట్టు మాంత్రికుడు కుల్దీప్ యాదవ్ సత్తాచాటడంతో.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 218 పరుగులకే చాపచుట్టేసింది. ఇక ఈ మ్యాచ్ లో కుల్దీప్-అశ్విన్ మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో తొలిరోజు ఆటలో మ్యాచ్ కు ఇదే హైలెట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

క్రికెట్ చరిత్రలో కొన్ని కొన్ని సంప్రదాయాలు అనాదిగా వస్తూ ఉంటాయి. వాటిని ఇప్పటి పాటిస్తూ ఉంటారు. సాధారణంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ బంతిని గుర్తుగా ఉంచుకుని లంచ్ టైమ్ లేదా ఆలౌట్ అయిన తర్వాత జట్టును ముందుండి డ్రస్సింగ్ రూమ్ వైపు నడిపిస్తాడు. ఇది అనాదిగా వస్తున్న ఆనవాయితి. కాగా ధర్మశాల వేదికగా ఇంగ్లండ్-ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లతో చెలరేగడంతో.. ఇంగ్లండ్ 218కే కుప్పకూలింది.

ఇక ఇంగ్లండ్ ఆలౌట్ కావడంతో ఇండియన్ టీమ్ డ్రస్సింగ్ రూమ్ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో ఐదు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. తన చేతిలో ఉన్న బంతిని అశ్విన్ కు ఇచ్చాడు. దానికి కారణం.. ఇది అశ్విన్ కు 100వ టెస్ట్ కావడమే. వందో టెస్ట్ అశ్విన్ గుర్తించుకోవాలి కుల్దీప్ అలా చేశాడు. కానీ.. అశ్విన్ మాత్రం అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలన్న ఉద్దేశంతో 5 వికెట్లు తీసిన కుల్దీప్ కే బాల్ ను అందించాడు. బలంగా అతడిని ముందుకునెట్టాడు. దీంతో కుల్దీప్ చేసేదేం లేక టీమ్ ను ముందుండి నడిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీమ్ స్పిరిట్ అంటే ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యాచ్ విషయానికి వస్తే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, రోహిత్ శర్మలు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జైస్వాల్ 57 పరుగులకు బషీర్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. తొలిరోజు ఆటముగిసే సమయానికి వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ(52), శుబ్ మన్ గిల్(26) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. మరి కుల్దీప్-అశ్విన్ మధ్య జరిగిన సన్నివేశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: RCBకి బిగ్ షాక్.. IPLకు దినేశ్ కార్తిక్ గుడ్ బై!

Show comments