Nidhan
టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వే బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. భారీ షాట్లతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. అతడు బాదిన ఓ బంతి అడ్రస్ లేకుండా పోయింది.
టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వే బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. భారీ షాట్లతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. అతడు బాదిన ఓ బంతి అడ్రస్ లేకుండా పోయింది.
Nidhan
టీమిండియా బ్యాటర్ సంజూ శాంసన్ జింబాబ్వే బౌలర్లను పిచ్చికొట్టుడు కొట్టాడు. భారీ షాట్లతో వాళ్లపై విరుచుకుపడ్డాడు. అతడు బాదిన ఓ బంతి అడ్రస్ లేకుండా పోయింది. ఇదంతా ఐదో టీ20లో చోటుచేసుకుంది. రెండు జట్ల మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో సంజూ ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఒక్క బౌండరీ మాత్రమే బాదిన ఈ స్టైలిష్ బ్యాటర్.. 4 భారీ సిక్సులు కొట్టాడు. అందులో ఒక బాల్ ఏకంగా 110 మీటర్ల దూరంలో వెళ్లి పడింది.
సంజూ కొట్టిన దెబ్బకు బాల్ కనిపించకుండా పోయింది. టపాటపా వికెట్లు పడటంతో మొదట్లో మెళ్లిగా ఆడిన సంజూ ఆ తర్వాత వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించాడు. అలాగని అడ్డగోలు షాట్లు ఆడలేదు. తనదైన స్వీట్ టైమింగ్‌తో రన్స్ పిండుకున్నాడు. రియాన్ పరాగ్ (22) ఫర్వాలేదనిపించాడు. అయితే ఆఖర్లో శివమ్ దూబె (26) చెలరేగడంతో 20 ఓవర్లు ముగిసేసరికి గిల్ సేన 167 పరుగులు చేసింది. మ్యాచ్‌లో నెగ్గాలంటే భారత బౌలర్లు చెమటోడ్చక తప్పదు. అయితే ఆల్రెడీ సిరీస్ గెలిచాం కాబట్టి ఒకవేళ ఓడినా పెద్దగా పోయేదేమీ లేదు. కానీ టూర్‌ను గెలుపుతో ముగిస్తే ఫుల్ పాజిటివిటీ ఉంటుంది. మరి.. సంజూ బ్యాటింగ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
SANJU SAMSON SMASHED 110 METER SIX 🥶💪 pic.twitter.com/sngQiAKCPo
— Johns. (@CricCrazyJohns) July 14, 2024