Rohit Sharma: రోహిత్​ను తక్కువ చేసి మాట్లాడిన అసిస్టెంట్ కోచ్ నాయర్.. మీకు తెలియదంటూ..!

టీమిండియాను శ్రీలంక భయపెడుతోంది. టీ20 సిరీస్​లో మన దెబ్బకు జడుసుకున్న ఆతిథ్య జట్టు.. వన్డే సిరీస్​లో మాత్రం చెలరేగి ఆడుతూ షాకుల మీద షాకులు ఇస్తోంది.

టీమిండియాను శ్రీలంక భయపెడుతోంది. టీ20 సిరీస్​లో మన దెబ్బకు జడుసుకున్న ఆతిథ్య జట్టు.. వన్డే సిరీస్​లో మాత్రం చెలరేగి ఆడుతూ షాకుల మీద షాకులు ఇస్తోంది.

టీమిండియాను శ్రీలంక భయపెడుతోంది. టీ20 సిరీస్​లో మన దెబ్బకు జడుసుకున్న ఆతిథ్య జట్టు.. వన్డే సిరీస్​లో మాత్రం చెలరేగి ఆడుతూ షాకుల మీద షాకులు ఇస్తోంది. ఫస్ట్ వన్డేలో ఓడిపోయే స్థితి నుంచి పుంజుకొని ఆడిన ఆతిథ్య జట్టు మ్యాచ్​ను టై చేసింది. రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి గెలుపు ముంగిట భారత్​ను బోల్తాపడేలా చేసింది. రెండో వన్డేలో ఆ టీమ్​ మరింతగా డామినేట్ చేసింది. మొదట బ్యాటింగ్​కు దిగి 9 వికెట్లకు 240 పరుగులు చేసిన లంక.. ఆ తర్వాత రోహిత్ సేనను 208 పరుగులకు కట్టడి చేసింది. 32 పరుగుల తేడాతో గెలిచి సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ రెండు వన్డేల్లో భారత్​కు ఏదైనా కలిసొచ్చే అంశం ఉందంటే అది కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ అనే చెప్పాలి.

శ్రీలంకలోని స్లో పిచ్​లపై అందరు బ్యాటర్లు విఫలమవుతున్నా రోహిత్ శర్మ మాత్రం స్పెషల్ ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్నాడు. తొలి మ్యాచ్​లో 41 బంతుల్లోనే 58 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్​తో టీమిండియాకు క్విక్ స్టార్ట్ అందించాడు. రెండో వన్డేలోనూ ఇదే విధంగా ఆడాడు. 44 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 భారీ సిక్సుల సాయంతో 64 పరుగులు చేశాడు. ఒకవైపు హిట్​మ్యాన్ బౌండరీలు, సిక్సుల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తుంటే మరోవైపు మిగతా బ్యాటర్లంతా సరెండర్ అయిపోతున్నారు. ఒక్కో రన్ చేసేందుకు నానాకష్టాలు పడుతున్నారు. కొందరైతే డబుల్ డిజిట్ కూడా చేరుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రోహిత్​ను ప్రశంసించాల్సింది పోయి.. టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అతడి బ్యాటింగ్​ను తక్కువ చేసి మాట్లాడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఈ ఓటమి మాకు షాక్ అనే చెప్పాలి. అయితే మీకు తెలియదు.. ఇక్కడి కండీషన్స్, స్పిన్ ఫ్రెండ్లీ వికెట్లపై ఇలాంటి ఫలితాలు రావడంలో అంత ఆశ్చర్యమేమీ లేదు. గత మ్యాచ్​ను చూసుకున్నా కొత్త బంతిని ఎదుర్కొంటూ పరుగులు చేయడం సులువుగా మారింది. కానీ బాల్ పాతబడ్డాక రన్స్ చేయడం టఫ్​గా కనిపించింది. 50 ఓవర్ల ఫార్మాట్​లో ఇదే అతిపెద్ద ఛాలెంజ్. లంక బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా వండర్సే సరైన లెంగ్త్​లో డెలివరీస్ వేస్తూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు’ అని నాయర్ చెప్పుకొచ్చాడు. మిగతా బ్యాటర్ల వైఫల్యాన్ని కవర్ చేయడం వరకు ఓకే. కానీ వాళ్లను వెనకేసుకొచ్చే క్రమంలో రోహిత్ ఇన్నింగ్స్​ను తక్కువ చేసి మాట్లాడటం ఏంటని నాయర్​పై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు.

రోహిత్​లా లంక ఓపెనర్లు గానీ లేదా భారత మరో ఓపెనర్ గిల్ గానీ ఆడుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. పిచ్, కండీషన్స్​, బౌలర్లను అర్థం చేసుకొని బాల్ మెరిట్​ను బట్టి హిట్​మ్యాన్ బ్యాటింగ్ చేస్తున్నాడని అంటున్నారు. హిట్​మ్యాన్​ను స్ఫూర్తిగా తీసుకొని ఇతర బ్యాటర్లు దూకుడుగా ఆడాలని అనాల్సింది పోయి న్యూ బాల్​తో రన్స్ చేయడం ఈజీ అని మాట్లాడటం సరికాదని చెబుతున్నారు. ఇదంతా గంభీర్​కు తెలిసే జరిగిందా? నాయర్ ఇక మీదట అయినా జాగ్రత్తగా మాట్లాడాలని సూచిస్తున్నారు. మరి.. రోహిత్​ను ఉద్దేశించి నాయర్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments