Rohit Sharma: శ్రీలంకతో వన్డే సిరీస్.. రోహిత్ సహా ఆ ఇద్దరు స్టార్లు దూరం! కారణం ఇదే!

టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతుండగానే జింబాబ్వేతో టీ20 సిరీస్​తో బిజీ అయిపోయింది టీమిండియా. ఈ సిరీస్​ ముగిశాక కూడా మరిన్ని సిరీస్​ల్లో పాల్గొననున్నారు భారత ఆటగాళ్లు.

టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతుండగానే జింబాబ్వేతో టీ20 సిరీస్​తో బిజీ అయిపోయింది టీమిండియా. ఈ సిరీస్​ ముగిశాక కూడా మరిన్ని సిరీస్​ల్లో పాల్గొననున్నారు భారత ఆటగాళ్లు.

టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతుండగానే జింబాబ్వేతో టీ20 సిరీస్​తో బిజీ అయిపోయింది టీమిండియా. ఈ సిరీస్​లో ఇప్పటికే రెండు మ్యాచ్​లు అయిపోయాయి. మొదటి టీ20లో ఓడిన భారత జట్టు.. రెండో మ్యాచ్​లో పుంజుకొని జింబాబ్వేను రఫ్ఫాడించింది. 100 పరుగుల భారీ తేడాతో నెగ్గి సిరీస్​ను సమం చేసింది. ఈ సిరీస్​లో ఇంకో మూడు మ్యాచ్​లు ఉన్నాయి. జింబాబ్వే టూర్ ముగిశాక శ్రీలంకకు వెళ్లనుంది మెన్ ఇన్ బ్లూ. అక్కడ మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన జులై 27న మొదలై ఆగస్టు 7వ తేదీన ముగుస్తుంది. అయితే ఈ సిరీస్​లో కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం అనుమానంగా మారింది. అతడితో పాటు మరో ఇద్దరు స్టార్ ప్లేయర్లు కూడా లంక పర్యటనకు వెళ్లడం డౌట్ అని తెలుస్తోంది.

లంక టూర్​కు రోహిత్​తో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసుగుర్రం జస్​ప్రీత్ బుమ్రా దూరం కానున్నారని సమాచారం. ఈ సిరీస్​ మొత్తానికి వీళ్లు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఐపీఎల్-2024తో నెలన్నర పాటు రెస్ట్ లేకుండా ఆడారు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ వల్ల మరో నెల రోజులు బిజీ అయిపోయారు. మెగాటోర్నీ ముగిశాక స్వదేశంలో నిర్వహించిన విక్టరీ పరేడ్, ఇతర సెలబ్రేషన్ ప్రోగ్రామ్స్​తో రోహిత్, కోహ్లీ, బుమ్రాలు అలసిపోయారు. అందుకే వాళ్లకు రెస్ట్ ఇచ్చి.. ఆ స్థానాల్లో యంగ్​స్టర్స్​ను లంక సిరీస్​కు పంపాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తోందని టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. ఆ టోర్నీలో నెగ్గాలంటే ఈ ముగ్గురు స్టార్లు ఎంతో ఫిట్​గా ఉండాలి.

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్, బుమ్రా, కోహ్లీ ఫిట్​గా ఉండటం టీమిండియాకు చాలా ముఖ్యం. లంక సిరీస్​లో ఆడిస్తే అనవసర గాయాలైతే మళ్లీ మొదటికే మోసం వస్తుంది. ఈ ముగ్గురు సీనియర్లను ఎన్నాళ్లు కాపాడుకుంటే భారత క్రికెట్​కు అంత మంచిది. రోకో జోడీ ఉన్న టైమ్​లోనే యంగ్ క్రికెటర్లతో పర్ఫెక్ట్ టీమ్ తయారవ్వాలి. అలా జరగాలంటే వీళ్ల సేవల్ని పొదుపుగా వాడుకోవాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే లంక సిరీస్​కు వీళ్లకు విశ్రాంతి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు వినిపిస్తోంది. ఈ సిరీస్ అనే కాదు.. ఫ్యూచర్​లో ఎప్పుడైనా సరే, రోహిత్-కోహ్లీకి అవసరమైన ప్రతిసారి రెస్ట్ ఇవ్వడం, ఇంజ్యురీల బారి నుంచి కాపాడటానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. మరి.. లంక సిరీస్​కు రోహిత్ సహా కోహ్లీ, బుమ్రా దూరమవనున్నారనే వార్తలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments