Nidhan
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమితో బాధలో ఉన్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో రోహిత్ సేనను దరిద్రం ఇలా పట్టుకుందేంటని అభిమానులు అంటున్నారు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఓటమితో బాధలో ఉన్న భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. దీంతో రోహిత్ సేనను దరిద్రం ఇలా పట్టుకుందేంటని అభిమానులు అంటున్నారు.
Nidhan
సఫారీ టూర్‌ను పాజిటివ్‌గా స్టార్ట్ చేసిన టీమిండియా టెస్ట్ సిరీస్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సౌతాఫ్రికాతో తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను సమం చేసిన భారత్.. ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో టెస్ట్ సిరీస్ కూడా నెగ్గుతుందని అభిమానులు అనుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్లు టీమ్‌లో ఉండటంతో ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచుకున్నారు ఫ్యాన్స్. కానీ టెస్ట్ సిరీస్‌లో భారత్‌కు ఏదీ కలసి రావడం లేదు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ సేన ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ మూడ్రోజుల్లోనే ముగిసిపోవడం, భారత్ అన్ని విభాగాల్లోనూ విఫలమవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఈ తరుణంలో టీమిండియాకు మరో షాక్ తగిలింది.
చివరి టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా అతడి భుజానికి గాయమైంది. దీంతో అతడు రెండో టెస్ట్‌లో ఆడటం అనుమానంగా మారింది. అసలే మొదటి టెస్ట్‌లో చిత్తుగా ఓడిపోవడం, బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా ఫామ్‌లో లేక ఇబ్బందులు పడుతున్న టైమ్‌లో శార్దూల్ గాయపడటం భారత టీమ్ మేనేజ్మెంట్ను మరింత కలవరపరుస్తోంది. ఈ విషయం తెలిసిన టీమిండియా ఫ్యాన్స్ రోహిత్ సేనను బ్యాడ్ లక్ వదలడం లేదని అంటున్నారు. దరిద్రం ఇలా పట్టుకుందేంటని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. రెండో టెస్ట్‌లోనైనా నెగ్గి సిరీస్‌ను సమం చేస్తారని అనుకుంటే ఇలా అయిందేంటని ఆందోళన చెందుతున్నారు.
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడిన శార్దూల్ లాస్ట్ టెస్ట్‌లో ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేం. దీని గురించి టీమ్ మేనేజ్మెంట్ ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ శార్దూల్ దూరమైతే అతడి ప్లేస్‌లో టీమ్‌లోకి ఎవర్ని తీసుకొస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. షమి స్థానంలో జట్టుతో చేరిన యంగ్ పేసర్ అవేశ్ ఖాన్‌ను బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శార్దూల్ గాయం గురించి టీమ్ మేనేజ్మెంట్ ఏదో ఒకటి చెప్పేదాకా దీనిపై క్లారిటీ రాదు. కానీ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ మాత్రం ఫిట్ అయినా శార్దూల్‌ను ఆడించొద్దని అంటున్నారు. ఫస్ట్ టెస్ట్‌లో అతడు దారుణంగా ఫెయిలయ్యాడని చెబుతున్నారు. బౌలింగ్‌లో 101 రన్స్ ఇచ్చి ఒకే వికెట్ తీశాడని.. బ్యాటింగ్‌లోనూ రాణించలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇదీ చదవండి: క్రికెటే కాదు.. బిజినెస్‌లోనూ సచిన్ మాస్టరే! ఒక్క నిర్ణయంతో రూ.26 కోట్ల లాభం
Major scare for India, Shardul Thakur suffers shoulder injury while batting in nets https://t.co/8SWiSikfiF
— InsideSport (@InsideSportIND) December 30, 2023
Shardul Thakur has suffered a blow to his shoulder while batting at the nets ahead of the second Test
📷: BCCI/ PTI
#India #SAvsIND #AUSvsIND #Cricket #Tests #shardulthakur pic.twitter.com/frSWj0Og67— SportsTiger (@The_SportsTiger) December 30, 2023