రోహిత్, కోహ్లీ కాదు.. నాకౌట్​లో టీమిండియా ఆశలన్నీ అతని పైనే!

  • Author singhj Published - 03:20 PM, Tue - 14 November 23

ప్రపంచ కప్-2023 సెమీస్​కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగనుంది టీమిండియా. అయితే నాకౌట్ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే కూడా ఒక ప్లేయర్ మీదే భారత్ ఆశలు పెట్టుకుంది.

ప్రపంచ కప్-2023 సెమీస్​కు సర్వం సిద్ధమైంది. ఈ మ్యాచ్​లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగనుంది టీమిండియా. అయితే నాకౌట్ మ్యాచ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే కూడా ఒక ప్లేయర్ మీదే భారత్ ఆశలు పెట్టుకుంది.

  • Author singhj Published - 03:20 PM, Tue - 14 November 23

వన్డే వరల్డ్ కప్-2023 నాకౌట్ దశకు చేరుకుంది. లీగ్ స్టేజ్ ముగియడంతో ఇప్పుడు అందరూ సెమీఫైనల్​ పైనే ఫోకస్ చేస్తున్నారు. మరో మూడు మ్యాచులతో ఈసారి టోర్నీ విజేత ఎవరో తేలిపోనుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, టీమిండియా, న్యూజిలాండ్.. ఈ నాలుగు జట్లలో ఎవరో ఒకరు ఛాంపియన్​గా నిలవనున్నారు. భారత్-కివీస్ మధ్య తొలి సెమీస్ జరగనుంది. ఈ రెండు జట్లు గత వరల్డ్ కప్​లో నాకౌట్​ మ్యాచ్​లోనే తలపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్​ను భారత అభిమానులు అంత ఈజీగా మర్చిపోలేరు. గెలుపు అంచుల దాకా వచ్చి మ్యాచ్​ను కోల్పోయింది టీమిండియా. కీలక టైమ్​లో ఎంఎస్ ధోని రనౌటై వెనుదిరగడంతో మ్యాచ్​తో పాటు కప్ ఆశలు కూడా గల్లంతయ్యాయి. ఒక్క ఇంచు తేడాలో మాహీ రనౌటై వెనుదిరగడంతో కోట్లాది మంది ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయింది.

ఇప్పుడు మళ్లీ న్యూజిలాండ్​తోనే వరల్డ్ కప్ సెమీస్ అనేసరికి భారత ఫ్యాన్స్ తెగ భయపడిపోతున్నారు. 2019 సెంటిమెంట్ రిపీటైతే పరిస్థితి ఏంటని టెన్షన్​కు గురవుతున్నారు. ఎలాగైనా కివీస్​ను ఓడించి మెగా టోర్నీ ఫైనల్​కు చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇదంత ఈజీ కాదనే చెప్పాలి. లీగ్ స్టేజ్​లో ఎలా ఆడారు, స్ట్రెంగ్త్స్​ ఎలా ఉన్నా సెమీస్​లో ఇరు టీమ్స్​కు సమానంగా ఛాన్సులు ఉంటాయని చెప్పొచ్చు. ఫైనల్​కు చేరుకోవాలనే ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎంతటి జట్టుకైనా ప్రెజర్ తప్పదు. కప్ గెలవాలనే ప్రెజర్​ను ఎవరైతే తట్టుకొని బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్లనే విజయం వరిస్తుంది. కాబట్టి భారత్-న్యూజిలాండ్ సెమీస్ పోరులో ఒత్తిడిని ఏ టీమ్ బాగా డీల్ చేస్తుందనేది కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్​లో టీమిండియా బ్యాటర్లకు కివీస్ బౌలింగ్​ యూనిట్​కు మధ్య సిసలైన పోరు జరగడం ఖాయం.

ట్రెంట్ బౌల్ట్ లాంటి నిఖార్సయిన లెఫ్టార్మ్ పేసర్​ను ఎదుర్కోవడం భారత్​కు కీలకం కానుంది. పిచ్ నుంచి మంచి సపోర్ట్ లభిస్తే బాల్​ను రెండు వైపులా స్వింగ్ చేయగల సత్తా ఉన్న బౌల్ట్​ను మన బ్యాటర్లు కాచుకొని రన్స్ చేయాలి. అలాగే స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్, స్పీడ్​స్టర్ లాకీ ఫెర్గూసన్​ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కంటే కూడా కేఎల్ రాహుల్ తప్పకుండా రాణించాల్సి ఉంటుంది. మిడిల్ ఓవర్లలో శాంట్నర్ బౌలింగ్​లో రాహుల్ తప్పకుండా రన్స్ చేయాలి. అతడితో పాటు అయ్యర్ కూడా రాణిస్తే భారత్​కు తిరుగుండదు. టాపార్డర్ ఫెయిలైనా వీళ్లిద్దరూ రాణిస్తే భారీ స్కోరు సాధ్యమవుతుంది.

కేఎల్ రాహుల్ రీసెంట్​ ఫామ్ చూసుకుంటే అతనొక్కడు ఆడితే చాలు నాకౌట్ మ్యాచ్​లో విజయం పక్కా అనిపిస్తోంది. రాహుల్ ఆడిన గత 14 వన్డే ఇన్నింగ్స్​ల్లో 111 నాటౌట్, 19, 58 నాటౌట్, 52, 26, 97 నాటౌట్, 19 నాటౌట్, 34 నాటౌట్, 27, 39, 21, 8, 102 స్కోర్లు చేశాడు. ఈ పద్నాలుగు మ్యాచుల్లో రెండు సెంచరీలు సహా, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరో విషయం రాహుల్ ఐదుసార్లు నాటౌట్​గా నిలిచి మ్యాచులు ఫినిష్ చేశాడు. దీన్ని బట్టే భారత్ బ్యాటింగ్​లో అతడు ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. భీకర ఫామ్​లో ఉన్న రాహుల్ వికెట్లు త్వరగా పడినా నిలబడగలడు, మ్యాచ్​ను ముందుకు తీసుకెళ్లగలడు. అందుకే టీమిండియా అతడి మీదే ఆశలు పెట్టుకుంది. మరి.. నాకౌట్ మ్యాచ్​లో భారత్​కు ఎవరు కీలకమని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కోహ్లీ ఏదో లక్కీగా ఆ వికెట్‌ పడగొట్టలేదు! దాని వెనుక మాస్టర్ ప్లాన్..

Show comments