Virat Kohli: టీమిండియాకు బిగ్‌షాక్‌! ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం! కారణం?

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు ముందు భారత జట్టుకు బిగ్​ షాక్ తగిలింది. ఈ సిరీస్​లోని తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఎందుకంటే..!

ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​కు ముందు భారత జట్టుకు బిగ్​ షాక్ తగిలింది. ఈ సిరీస్​లోని తొలి రెండు మ్యాచులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఎందుకంటే..!

క్రికెట్​లో మరో ఆసక్తికర సిరీస్​కు సర్వం సిద్ధమవుతోంది. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది. మరో మూడ్రోజుల్లో ఈ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్​లో భాగంగా తొలి టెస్ట్ జనవరి 25న ఉప్పల్​లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో స్టార్ట్ కానుంది. ఇప్పటికే టీమిండియాతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా హైదరాబాద్​కు చేరుకున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్​లో మునిగిపోయారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్​ పాయింట్స్ టేబుల్​లో టాప్ ప్లేస్​కు చేరుకోవాలంటే కీలకం కావడంతో ఈ సిరీస్​ను నెగ్గాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను పన్నుతున్నాయి. ఈ తరుణంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు.

ఇంగ్లండ్​తో జరగనున్న టెస్ట్ సిరీస్​కు కోహ్లీ దూరమయ్యాడు. అయితే సిరీస్​లోని మొదటి రెండు మ్యాచులకు మాత్రమే విరాట్ దూరంగా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ మ్యాచ్​లకు అందుబాటులో ఉండట్లేదు. ఈ విషయంపై కోహ్లీ రియాక్ట్ కానప్పటికీ బీసీసీఐ మాత్రం అభిమానులకు, మీడియాకు స్పెషల్ రిక్వెస్ట్ చేసింది. కోహ్లీ పర్సనల్ రీజన్స్ వల్ల ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు దూరంగా ఉంటాడని.. దయచేసి అతడి ప్రైవసీకి ఎలాంటి భంగం కలిగించొద్దని భారత క్రికెట్ బోర్డు కోరింది. ఇది తెలిసిన ఫ్యాన్స్ విరాట్ త్వరగా కమ్​బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. కింగ్​ ప్రైవసీకి భంగం కలిగించబోమని.. అతడు గ్రౌండ్​లో చెలరేగి ఆడితే చూడాలని ఉందని కామెంట్స్ చేస్తున్నారు.

కోహ్లీకి అసలు ఏమైందని.. అతను ఎందుకు రెండు టెస్టులకు దూరమయ్యాడా అని మరికొందరు అభిమానులు ఆలోచనల్లో మునిగిపోయారు. ఈ సిరీస్​లోని తొలి మ్యాచ్​ కోసం హైదరాబాద్​కు వచ్చాడు విరాట్. అందరికంటే ముందే భాగ్యనగరానికి వచ్చి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాక ఎందుకు మధ్యలో నుంచి వెళ్లిపోయాడనేది ఎవరికీ అర్థం కావడం లేదు. రీసెంట్​గా ముగిసిన ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్ సమయంలోనూ కింగ్ ఇలాగే హఠాత్తుగా వెళ్లిపోయాడు. అప్పుడు కూడా వ్యక్తిగత కారణాల వల్లే తొలి టీ20కి దూరమయ్యాడు. అయితే ఆ తర్వాత తిరిగొచ్చి మిగిలిన రెండు మ్యాచుల్లో ఆడాడు. దీంతో అసలు విరాట్ ఎందుకు ఇలా సిరీస్​ల మధ్యలో వెళ్లిపోతున్నాడు? అతడికి వచ్చిన సమస్య ఏంటో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. దీనిపై బోర్డు లేదా కోహ్లీ త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి. మరి.. ఇంగ్లండ్​తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments