రోహిత్ నమ్మశక్యం కాని బ్యాటింగ్.. ఎన్నో సెంచరీలకు సమానం ఈ ఇన్నింగ్స్!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మశక్యం కాని బ్యాటింగ్​తో చెలరేగిపోయాడు. సెంచరీ కొట్టకపోయినా ఎన్నో శతకాలకు సమానమైన ఇన్నింగ్స్​తో అందరి మనసులు గెలుచుకున్నాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నమ్మశక్యం కాని బ్యాటింగ్​తో చెలరేగిపోయాడు. సెంచరీ కొట్టకపోయినా ఎన్నో శతకాలకు సమానమైన ఇన్నింగ్స్​తో అందరి మనసులు గెలుచుకున్నాడు.

పిడుగు వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియాకు చూపించాడు రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ సృష్టించిన పరుగుల తుఫానులో ప్రత్యర్థి బౌలర్లు మునిగిపోయారు. బౌండరీల మీద బౌండరీలు, సిక్సుల మీద సిక్సులు కొడుతూ కారుమబ్బులా ఆసీస్​ను కమ్మేశాడు హిట్​మ్యాన్. నమ్మశక్యం కాని బ్యాటింగ్​తో అందర్నీ సర్​ప్రైజ్ చేశాడు. 41 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సులతో అతడు 92 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు.

కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన హిట్​మ్యాన్ తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. ఇంకో 8 పరుగులు చేస్తే శతకం పూర్తయ్యేది. కానీ మిచెల్ స్టార్క్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. అతడి బౌలింగ్​లో రోహిత్ క్లీన్​బౌల్డ్ అయ్యాడు. అయితే క్రీజులో ఉన్నంత సేపు హిట్​మ్యాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. స్టార్క్, కమిన్స్, స్టొయినిస్, జంపా.. ఇలా ఎవరు బౌలింగ్​కు వచ్చినా భారీ షాట్లతో భయపెట్టాడు భారత సారథి. 19 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్న రోహిత్.. తర్వాత 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇంకో మూడ్నాలుగు బంతులు ఆడితే సెంచరీ పూర్తయ్యేది. కానీ అది సాధ్యపడలేదు. అయితే కీలక మ్యాచ్​లో ఆసీస్​ను అతడు వణికించిన తీరు, భయం లేకుండా ఆడటం.. అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పొచ్చు. మరి.. రోహిత్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments