ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను భారత్ చేజిక్కించుకుంది. కానీ ఈ సిరీస్‌లో ఎన్నో ఆన్సర్స్ లేని క్వశ్చన్స్‌ను వదిలేసింది భారత్.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను భారత్ చేజిక్కించుకుంది. కానీ ఈ సిరీస్‌లో ఎన్నో ఆన్సర్స్ లేని క్వశ్చన్స్‌ను వదిలేసింది భారత్.
వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో బాధలో ఉన్న అభిమానులకు ఊరట కలిగిస్తూ ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌ను చేజిక్కించుకుంది భారత్. ఈ సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. ఆఖరి మ్యాచ్‌లో విజయం కష్టమే అనుకున్నా.. బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్, బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ చెలరేగి గెలిపించారు. ఈ విజయంతో సౌతాఫ్రికా టూర్‌కు మరింత కాన్ఫిడెంట్‌గా వెళ్లనుంది మన టీమ్. ప్రపంచ కప్ ముగిసిన నాల్రోజుల్లోనే నిర్వహించిన ఆసీస్ సిరీస్‌లో భారత్‌కు ఎన్నో సానుకూలాంశాలు ఉన్నాయి. కెప్టెన్సీ దగ్గర నుంచి అనేక విషయాలు మన టీమ్‌కు కలిసొచ్చాయి. టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో ఉన్న భారత్‌కు ఈ సిరీస్ పెద్ద ప్లస్ అనే చెప్పాలి.
కంగారూలతో టీ20 సిరీస్‌లో ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా జైస్వాల్ మెరుపు ఆరంభాలు అందిస్తూ సత్తా చాటాడు. రుతురాజ్ ఒక మ్యాచ్‌లో సెంచరీ బాది తన టాలెంట్‌ను మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. ఫ్యూచర్ తమదేనని ఈ యంగ్ ఓపెనింగ్ జోడీ భరోసా ఇచ్చింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ కూడా ఫామ్ చాటుకున్నారు. ముఖ్యంగా ఇషాన్ అయితే బెరుకు, భయం లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి టీ20లో టాపార్డర్ పెవిలియన్ చేరిన టైమ్‌లో అయ్యర్ పట్టుదలతో బ్యాటింగ్ చేయడం అతడి మెచ్యూరిటీ ఏంటో చూపిస్తోంది. సూర్య అటు బ్యాటింగ్‌లో అదరగొట్టడంతో పాటు ఇటు కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపించాడు.
బౌలర్లకు అవసరమైన సలహాలు ఇస్తూ.. సిచ్యువేషన్‌కు తగ్గట్లు ఫీల్డింగ్, బౌలింగ్ ఛేంజెస్ చేస్తూ కెప్టెన్‌గా సూర్య ఆకట్టుకున్నాడు. పేసర్లు ముకేశ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, దీపక్ చాహర్ రాణించారు. ముఖ్యంగా ముకేశ్ అవసరమైన ప్రతిసారి బ్రేక్ త్రూలు ఇచ్చాడు. స్పిన్నర్లు రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తమ బౌలింగ్‌తో అదరగొట్టారు. బిష్ణోయ్ పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ అపోజిషన్ టీమ్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. అక్షర్ వికెట్లు తీస్తూనే బ్యాట్‌తోనూ విలువైన కాంట్రిబ్యూషన్ అందించాడు. ఇలా ఈ సిరీస్ భారత్‌కు చాలా విధాలుగా మంచే చేసింది. సిరీస్ గెలిచారు.. కానీ ప్రయోగాలు చేయడంలో మాత్రం మన టీమ్ వెనుకబడింది.
ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను నాలుగో మ్యాచ్‌లోనే సొంతం చేసుకుంది టీమిండియా. అయినా ఆఖరి మ్యాచ్‌లో పెద్దగా ప్రయోగాలు చేయలేదు. సిక్త్ బౌలింగ్ ఆప్షన్‌ను ఏ మ్యాచ్‌లోనూ వినియోగించుకోలేదు. ఐదుగురు మెయిన్ బౌలర్లు.. ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాటర్ల ఫార్ములానే వాడారు. ఇదే ఆప్షన్ ఐసీసీ టోర్నీల్లో మనల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. ఇప్పుడైనా ప్రయోగాలు చేసి పరిష్కారం కనిపెడతారా అంటే మళ్లీ కథ మొదటికే వచ్చింది. కెప్టెన్ సూర్య, కోచ్ లక్ష్మణ్ సేఫ్ గేమ్ ఆడారు. ఇలాంటప్పుడు సిరీస్‌లు పెట్టడం ఎందుకు? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సిక్త్ బౌలింగ్ ఆప్షన్ వాడుకోలేదు.. అదే టైమ్‌లో హార్దిక్ పాండ్యాకు బ్యాకప్‌గా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను కూడా ఈ సిరీస్‌లో ప్రయోగించలేదు.
శివమ్ దూబే రూపంలో ఆప్షన్ కళ్ల ముందే ఉన్నా అతడ్ని బెంచ్‌కే పరిమితం చేశారు. దీంతో టీమ్ మేనేజ్మెంట్కు ఎందుకంత భయం? అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకవేళ ప్రయోగాలు చేసి ఓడినా లాంగ్ టర్మ్‌లో మంచి ఫలితాలు వచ్చేవి కదా అని సీనియర్ క్రికెటర్స్ అంటున్నారు. అటు ఆసీస్ మాత్రం అన్ని రకాలుగా బౌలింగ్, బ్యాటింగ్, ఆల్‌రౌండర్స్ విషయంలో ప్రయోగాలు చేసింది. ఈ సిరీస్ ఓడినా ఒరిగేదేం లేదనే ధీమాతో అటాకింగ్ గేమ్ ఆడింది. కానీ భారత్ మాత్రం ఎంతసేపు గెలుపు తప్ప ప్రయోగాలపై ఫోకస్ పెట్టలేదు. సేఫ్ స్ట్రాటజీతో సిరీస్ అయితే నెగ్గారు కానీ సమాధానం లేని ఎన్నో ప్రశ్నల్ని అలాగే వదిలేశారు. మరి.. పెద్దగా ప్రయోగాలు చేయకుండానే ఆసీస్‌తో సిరీస్‌ను భారత్ ముగించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs AUS: అలా బౌలింగ్ చేయడానికి సూర్యనే కారణం.. అతడు చెప్పిన ఆ మాటతోనే..!