SNP
Suresh Raina, Short Ball: ఇండియన్ క్రికెట్‌లో ధోని తర్వాత.. ధోని అంతటోడు అవుతాడని రైనా అందరు ఆశలు పెట్టుకున్నారు.. కానీ, ఒకే ఒక్క వీక్‌నెస్‌తో లెజెండ్ కావాల్సినోడు ఒక నార్మల్ క్రికెటర్‌గా మిగిలిపోయాడు. సురేష్ రైనా వీక్‌నెస్ స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Suresh Raina, Short Ball: ఇండియన్ క్రికెట్‌లో ధోని తర్వాత.. ధోని అంతటోడు అవుతాడని రైనా అందరు ఆశలు పెట్టుకున్నారు.. కానీ, ఒకే ఒక్క వీక్‌నెస్‌తో లెజెండ్ కావాల్సినోడు ఒక నార్మల్ క్రికెటర్‌గా మిగిలిపోయాడు. సురేష్ రైనా వీక్‌నెస్ స్టోరీని ఇప్పుడు మనం తెలుసుకుందాం..
SNP
మిస్టర్ ఐపీఎల్, చిన్న తలా.. సురేష్ రైనా గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా మాజీ క్రికెటర్‌గా, మహేంద్ర సింగ్ ధోనికి క్లోజ్ ఫ్రెండ్‌గా, చెన్నై సూపర్ కింగ్స్‌కి నెం.2గా.. రైనాకు మంచి గుర్తింపు ఉంది. అలాగే.. మంచి బ్యాటర్, అద్భుతమైన ఫీల్డర్, అవసరమైనప్పుడు జట్టుకు ఉపయోగపడే పార్ట్‌టైమ్ బౌలర్‌గా.. ఇండియన్ క్రికెట్‌లో రైనా తనదైన ముద్ర వేశాడు. ఇప్పటికీ ఫీల్డింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే.. యువరాజ్, కైఫ్ తర్వాత వినిపించే పేరు రైనాదే. బెస్ట్ ఫినిషర్ అనే టాపిక్ ఎప్పుడొచ్చినా.. రైనా ప్రస్తావన లేకుండా ఆ టాపిక్ కంప్లీట్ కాదు. ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో, ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తన బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్‌తో అలరించిన రైనా.. ఒకే ఒక్క వీక్‌నెస్ వల్ల లెజెండ్ కాలేక.. ఒక సాధారణ మాజీ క్రికెటర్‌గా మిగిలిపోయాడు. ఎన్నో కష్టాలు, అవమానాలు దాటి.. క్రికెట్‌లోకి వచ్చిన రైనా.. ఆ కసిని ఆటలో చూపించాడు కానీ, ఒక్క వీక్‌నెస్‌ను ఓవర్ కమ్ చేయలేకపోయాడు. ఇండియాకు రైనా రూపంలో ఒక అద్భుతమైన ప్లేయర్ దొరికినా.. అతను దిగ్గజం కాకుండానే ఆటకు దూరమయ్యాడు. ఒకే ఒక్క డెలవరీ రైనా కెరీర్‌తో ఎలా ఆడుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
2005 జులై 30.. దంబుల్లా వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే మ్యాచ్‌తో సురేష్ రైనా అనే కుర్రాడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ ఆడేందుకు రైనా ఎలాంటి పరిస్థితులు దాటాడో తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు. క్రికెట్‌పై పిచ్చి ఇష్టంతో.. చిన్నతనం నుంచే క్రికెట్‌ను కెరీర్‌గా మల్చుకొని స్కూల్ టోర్నమెంట్స్ ఆడేవాడు. తనకున్న ప్రతిభతో.. తనకంటే వయసులో పెద్ద వారితో కలిసి ఆడే అవకాశం రైనాకు వచ్చేది. కానీ, తమకంటే చిన్నవాడు తమను ఎక్కడదాటి వెళ్తాడో అని.. అతని సీనియర్లు రైనాను హింసించేవారు. మ్యాచ్ ఆడేందుకు వేరే ఊరికి ట్రైన్‌లో వెళ్లాల్సిన వచ్చినప్పుడు.. కనీసం పడుకునేందుకు తనకు కేటాయించిన బెర్త్ కూడా ఇచ్చేవారు కాదు సీనియర్లు. వేరే దారిలేక.. బెర్త్‌ల మధ్య కింద పడుకునేవాడు రైనా. అలా నిద్రపోతున్న రైనా ముఖంపై ఒకసారి సీనియర్లు మూత్రం కూడా పోశారు. అయినా కూడా క్రికెట్‌పై ఇష్టంతో ఇలాంటి వికృతాలన్ని ఓర్చుకున్నాడు. అలా అలా.. ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ టీమ్‌కు, అండర్-19 టీమ్‌కు ఆడి.. అక్కడ అద్భుతంగా రాణించి.. ఎట్టకేలకు టీమిండియా జెర్సీ ధరించి.. శ్రీలంకతో తన ఫస్ట్ వన్డే మ్యాచ్ బరిలోకి దిగాడు రైనా.
తొలి మ్యాచ్ అంటే.. ఏ క్రికెటర్‌కైనా అదో ఎమోషనల్ మూమెంట్. రైనాకు కూడా అంతే.. ఫస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేద్దామని బరిలోకి దిగాడు. కానీ, ఫస్ట్ బాల్‌కే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరణ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తొలి మ్యాచ్ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. సున్నాతో మొదలైన రైనా ప్రయాణం.. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా ఎదిగింది. ఇండియాలో క్రికెట్ బతికి ఉన్నంత కాలం నిలిచిపోయే రికార్డు అది. 2008 నుంచి రైనా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక ధోని కెప్టెన్సీలో రైనా ఒక సూపర్ స్టార్‌గా ఎదిగాడు. ధోని నీడలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏకైక క్రికెటర్ రైనానే. మిడిల్డార్, లోయర్ ఆర్డర్‌లో టీమిండియాకు కొండంత అండలా మారిపోయాడు. అలాగే ఫీల్డింగ్‌లో రైనాను దాటి బాల్ వెళ్లడం అంటే అంత ఈజీ కాదు.. ఇక టీమ్‌కు అవసరమైనప్పుడు ఒక నాణ్యమైన పార్ట్‌టైమ్ బౌలర్‌గా కూడా రైనా సూపర్ సక్సెస్ అయ్యాడు. అలా.. అలా.. టీమిండియాకు వైస్ కెప్టెన్ కూడా అయ్యాడు. ధోని లేని సమయంలో కెప్టెన్‌గా టీమిండియాను నడిపించాడు.
ధోని తర్వాత.. నెక్ట్స్ కెప్టెన్ సురేష్ రైనానే.. అనే స్థాయికి వెళ్లాడు. మరో వైపు ఐపీఎల్‌లో అయితే.. రైనా హవా కొనసాగుతోంది. ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ అంత సక్సెస్ అవ్వడంలో రైనా పాత్ర ఎంతో ఉంది. తన సూపర్ బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో సీఎస్‌కేను రైనా ఒంటిచేత్తో గెలిపించాడు. మిస్టర్ ఐపీఎల్‌గా, సీఎస్‌కేలో ధోని తలా అయితే.. రైనా చిన్న తలా అంటూ అభిమానులు ముద్దుగా పిలుకునేవారు. కానీ, ఒక్క వీక్‌నెస్ ఒకే ఒక్క వీక్‌నెస్ మంచి ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రైనాను.. లెజెండ్ అనే నెక్ట్స్ స్టెప్‌కి వెళ్లకుండా చేసింది. అదే.. ‘షార్ట్ బాల్ వీక్‌నెస్’. మినిమమ్ క్రికెట్ నాలెడ్జ్ ఉన్న ప్రతి క్రికెట్ అభిమానికి తెలుసు.. రైనా షార్ట్ బాల్ సరిగ్గా ఆడలేడని. ఒక్క రైనాకే కాదు.. చాలా మంది ఇండియన్ బ్యాటర్లకు షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉంటుంది. అది రైనాకు కాస్త ఎక్కువ ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లాంటి ప్లేయర్లు.. మోడ్రన్ క్రికెట్‌ను ఎడాప్ట్ చేసుకొని.. షార్ట్ బాల్‌ను ఎలా ఎదుర్కొవాలో ప్రాక్టీస్ చేసి.. దాన్ని ఓవర్ కమ్ చేశారు. రోహిత్ అయితే.. షార్ట్ బాల్‌ను ఫుల్ ఆడటంలో మాస్టర్ అయిపోయాడు.
కానీ, సురేష్ రైనా మాత్రం ఆ షార్ట్ బాల్ వీక్‌నెస్ ఓవర్ కమ్ చేయలేకపోయాడు. ఒక ప్లేయర్.. ఏదైన బాల్‌ను ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లు ఆ బాల్‌ను అస్త్రంగా మార్చుకొని.. ఆ బ్యాటర్ క్రీజ్‌లోకి వచ్చి రావడంతో సంధిస్తూ ఉంటారు. ముఖ్యంగా మోడ్రన్‌డే క్రికెట్‌లో.. ప్రతి ప్లేయర్, ప్రతి మ్యాచ్, ప్రతి యాక్షన్.. అంతా వీడియో ఎనాలసిస్‌తో ప్రత్యర్థి జట్లు పిన్ టూ పిన్ చదివేస్తున్నారు. ఏ బ్యాటర్‌కు ఏ షాట్ బాగా ఆడతాడు, ఏ షాట్ సరిగ్గా ఆడలేడు, ఎలాంటి బాల్ వేస్తే ఇబ్బంది పడతాడు, అతని ఫుట్ మూవెంట్ ఎలా ఉంది, బాడీ వేయిట్ ఫ్రంట్ ఫుట్‌లో ఉంచుతున్నాడా? బ్యాక్ ఫుట్‌పై ఉంచుతున్నాడా? బ్యాట్ స్వింగ్ ఎలా ఉంది? ఇలా ప్రతి చిన్న విషయం కూడా.. వీడియో ఎనలిస్ట్‌లు, అసిస్టెంట్ కోచ్‌లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో రైనాకు షార్ట్ బాల్ వీక్‌నెస్ ఉందనే విషయం.. ప్రపంచ మొత్తానికి తెలిసిపోయింది.
ఇండియన్ క్రికెట్‌కు నెక్ట్స్ కెప్టెన్‌గా ఉన్న రైనా.. సరిగ్గా పగ్గాలు అందుకునేందుకు అతని డౌన్ ఫాట్ స్టార్ అయింది అని చెప్పుకోవచ్చు. 2013 నుంచి రైనా.. తన షార్ట్ బాల్ వీక్‌నెస్‌తో బాగా ఇబ్బంది పడ్డాడు. ఏ టీమ్ అయినా.. ఏ బౌలర్ అయినా.. రైనా బ్యాటింగ్ చేస్తున్నాడు అంటూ షార్ట్ పిచ్ బాల్స్ వేసే వాళ్లు. వాటిని సరిగ్గా పుల్ ఆడలేక రైనా వికెట్ సమర్పించుకోవడం అనేది కామన్ అయిపోయింది. అలా అలా టీమ్‌లో చోటు కోల్పోయాడు. షార్ట్ పిచ్ బాల్‌ను ఎదుర్కొనేందుకు రైనా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. సక్సెస్ కాలేకపోయాడు. మరో వైపు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనలు చేస్తున్నా.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మాత్రం రాణించలేకపోయాడు. టీమిండియాలో చోటు కోల్పోయి.. డొమెస్టిక్ క్రికెట్‌లోని ముస్తక్ అలీ ట్రోఫీలో వరుస ఆఫ్ సెంచరీలతో అదరగొట్టి.. మళ్లీ టీమిండియాలోక కమ్ బ్యాక్ ఇచ్చిన.. ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయాడు. అదే షార్ట్ బాల్ వీక్ నెస్.. దాన్ని ఓవర్ కమ్ చేసేందుకు బౌలర్ షార్ట్ బాల్ వేస్తాడని.. బ్యాక్ ఫుట్‌లో బాల్ కోసం వేయిట్ చేయడం స్టార్ట్ చేశాడు రైనా. దాంతో యార్కర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడేవాడు.
తన వీక్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకొని.. బౌలర్ కచ్చితంగా షార్ట్ పిచ్ బాల్ వేస్తాడని భావించి.. బ్యాక్ ఫుట్‌లో వేయిట్ చేస్తుంటే.. డేల్ స్టెయిన్ లాంటి తెలివైన ఫాస్ట్ బౌలర్లు కచ్చితమైన యార్కర్లతో క్లీన్ బౌల్డ్ చేసేవారు. బాడీ వేయిట్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచడం వల్ల.. ఫ్రంట్‌ఫుట్‌కి రావడం ఇబ్బంది అయ్యేది. అలా అలా తన టెక్నిక్ మిస్ అయి.. ఫుట్ మూమెంట్ కూడా లాస్ అయ్యాడు రైనా. షార్ట్ బాల్ వీక్‌నెస్‌తో స్ట్రగుల్ అవుతూనే.. 2018లో తన చివరి టీ20 మ్యాచ్ ఆడేశాడు రైనా. ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రైనా రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? జస్ట్ 33 మాత్రమే. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 37 ఏళ్ల వయసులో ఇండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఫిట్‌నెస్ విషయంలో రోహిత్ కంటే రైనాకే కొన్ని మార్కులు ఎక్కవపడతాయి, అలాగే అద్భుతమైన ఫీల్డర్, పార్ట్‌టైమ్ బౌలర్, లాఫ్టెడ్ షాట్, ఫ్లిక్ షాట్, కవర్ డ్రైవ్, కట్ షాట్.. ఇలా క్రికెట్‌లో ఎన్ని రకాల షాట్లు ఉన్నాయో అన్ని రకాల షాట్లు అద్భుతంగా ఆడగలిగే రైనా.. ఒక్క షార్ట్ బాల్ వీక్‌నెస్‌ను మాత్రం ఓవర్ కవర్ చేయలేకపోయాడు.
ఆ ఒక్క వీక్‌నెస్ లేకపోయి ఉంటే.. ఇండియన్ క్రికెట్‌లో రైనా ఒక లెజెండ్ క్రికెటర్ అయ్యేవాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఇప్పుడు రైనా అండర్‌లో ఆడుతూ ఉండేవారు. ప్రాక్టికల్‌గా, స్ట్రాటట్స్ పరంగా రైనా.. లెజెండ్ కాకపోయినా.. తన స్టైలిష్ బ్యాటింగ్, సూపర్ ఫీల్డింగ్, మ్యాజికల్ స్పిన్ బౌలింగ్‌తో ఎంతో మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో లెజెండ్‌ల నుంచి మించిన స్థానం సంపాదించుకున్నాడు. రైనా అంటే పేరు కాదు.. అదొక ఎమోషన్ అని అనుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. మరి ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. ఒక్క వీక్‌నెస్‌తో లాంగ్ కెరీర్‌ను కొనసాగించలేకపోయినా.. సురేష్ రైనా కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.